ప్రేమగల తంద్రీ! మా మీదనుండి గడిచిపోయిన రాత్రికాల విపత్తులనుండి కాపాడి, ఈ ఉదయమున మమ్ములను లేపి, మరియొక దినము అనుగ్రహించనందుకు నీకు వందనములు. ఆమేన్.

సృష్టికర్తవైన తండ్రీ! నేటి దినమున నేను చేయవలసిన పనులలో నాకు తోడైయుండుటకు నీవు కూడ నాతో కలిసి పనిచేయు తండ్రివైయుండుము. ఆమేన్.

ప్రభువా! మా ప్రవర్తన వలన నేటి దినమును పరిశుద్ధ దినముగా బైలుపరచుకొను ప్రవర్తనా శక్తీ కలిగించుము. ఆమేన్.

దేవా! ఈ దినమున నీవు నాకు ఏమి చెప్పనైయున్నానో అది నాతో చెప్పుము. ఆమేన్.

రక్షకుడవైన దేవా! ఈ దినమందు మమ్ములను వేటినుం రక్షింపవలెనో వాటినుండి రక్షింపుము. ఆమేన్.

మా కాపరివైన ప్రభువా! మమ్మును యే దారిని నడిపింప దలచుకున్నావో ఆ దారిని నడిపింపుము. ఆమేన్.

దానకర్తవైన ప్రభువా! మేము అనుభవించుటకు ఈ వేళ మాకు ఏమి అందించెదవో, అవి అందుకొనే సమర్ధత దయచేయుము. ఆమేన్.