మహిమ ప్రభావములు గల తండ్రి ! మానవుని కొరకు సమస్త దానములు గల భూమి, ఆకాశములు కలుగజేసిన తండ్రి ! వందనములు.

మానవుడు తన జ్ఞానమును వినియోగించి నీవు కలుగజేసిన వాటిని వాడుకొని స్వస్థత నొందుటకు, సృష్టిలో నీ ప్రభావమును ఉంచిన తండ్రీ! నమస్కారములు. ‘నిన్ను స్వస్ధపరచు యెహూవాను నేనే’ అని పలికిన తండ్రీ ! నీ ప్రవక్తల ద్వారా అనేక రోగులను స్వస్ధపరచిన నీకు స్తుతులు.

కుమారుడవైన తండ్రీ! నీవే స్వయముగా నీ ప్రభావము చేత రోగులను స్వస్ధపరచిన నీకు స్తుతులు.

ప్రభువా! పక్షవాతరోగి నీయెుద్ధకు తేబడి నిన్ను అడుగకపోయినను, వాని హృదయములోనున్న కోరికనుబట్టి స్వస్ధపరచిన నీకు వందనములు.

దేవ మానవుడవైన ప్రభువా! సేన దయ్యములు పట్టినవాడు నిన్ను చూచి నమన్కరించిన చర్యనుబట్టి, అతనిలోని దయ్యములసు వెళ్ళగొట్టిన నీకు నమస్కారములు.

జీవమైన తండ్రీ! ఒక అధికారి వచ్చి “నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము. ఆమె బ్రతుకుసు” అనెను. అధికారి నిన్ను కోరిన వెంటనే వెళ్ళి ఆ చిన్న దానిని బ్రతికంచిన దేవా! నీకు ప్రణుతులు.

ఏర్పాటు రక్షకుడవైన ప్రభువా! కనాను స్త్రీ వచ్చి తన కుమార్తె స్వస్థతకొరకు ప్రాధేయపడి అడుగగా, ఆమె కుమార్తెను బాగుచేసిన నీకు వందనములు
పరిశుద్ధుడవైన తండ్రీ! పదిమంది కుమ్దరోగులు “మమ్మును కరుణించుమని” వేడుకొనగా వారి మనవి విని “మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకొనుడని” చెప్పిన నీ మాట ప్రకారము వారు వెళ్ళుచూ దారిలో బాగుపడిరి. ఈ విధముగా స్దలాంతరమువ బాగుచేసిన నీకు స్తోత్రములు.

“ప్రార్ధన చేయునపుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది యున్నారని నమ్ముడి. అప్పుడవి మీకు కలుగునని చెప్పుచున్నాను ” అని సెలవిచ్ఛిన ప్రభువా! మేము ప్రార్థించినవియు, ఆశించినవియు నెరవేరనప్పుడు నెరవేరివవని నమ్మగల గట్టి విశ్వాస పద్దతిని మాకు అలవరచిన నీకు వందనములు.

మా స్జితిని, గతిని ఎరిగిన తంద్రీ! మేమెంత ప్రార్ధించినా నెరవేరనప్పుడు, మా ప్రార్థనాంశము నీ దివ్యచిత్తమునకు సంపూర్థముగా సమర్పించి, నీ సహాయము కొరకు అబ్రాహాము వలె నిరీక్షింపగల కృప దయచేయుదువని నమ్ముచూ నీకు న్తుతులు చెల్లించుచున్నాను.

పరిశుద్ధాత్మవైన తండ్రీ! నీ సంఘమునకు నీ శక్తులను దయచేసి రెండువేల సరివత్సరములనుండి అనేకులను నీ ప్రభావముచే బాగుచేయుచున్న నీకు స్తోత్రములు.

మాకు కలిగిన …………… (జబ్బు పేరు) అను ఈ అస్వస్దతసు మీ పాదములయెుద్ద ఉంచి ప్రార్ధన చేస్తున్నాము. మీ ప్రభాపముచేత ఈ అస్వస్థతను తొలగించి స్వస్ధత దయచేయుమని విశ్వాసముతో వేడుకొనుచున్నాము. ఈ స్తుతులు త్వరగా రానైయున్న యేసుక్రీస్తు నామమున అంగీకరించుము. ఆమేన్!

లోకైక రక్షకుడవైన యేసు క్రీస్తు ప్రభువా! వాక్యమను పేరుగల ప్రభువా! నిను గురించి వాక్యమవియు, దేవుడనియు వ్రాయించినందుకు నీకనేక వందనములు. సమస్తమును నీ మూలముగా కలిగినదనియు, కలిగియున్న దేదియు నీవు లేకుండ కలుగలేదనియు, గ్రంథములో నున్న౦దుకై నీకు స్తోత్రములు. తండ్రీ! ఈ వ్రాతనుబత్తి ఉపయోగకరమైన సూర్యచంద్ర నక్షత్రములు, వర్షము, వాయువు, పక్షులు, జం తువులు, వృక్షాదులు, భూమి, భూమిలోని లోహములు, ఇవన్నియు, నీవు లేకుండ కలుగలేదు గనుక నీకనేక స్తుతులు. వాటికి నరులకున్నట్లు వాక్కున్నయెడల అవికూడ మమ్మును కలుగజేసినందుకు నీకు వందనములు అని చెప్పకమానవు. వాటి ఉనికి నీకు కీర్తి తెచ్చునదిగాను, వందనములు ఆచరించునదిగాను ఉన్నది గనుక నీకనేక వందనములు. లోకము పాపమయమైయున్నందువల్ల, లోకము వలన తెలియబడుటకై, లోకములో ప్రత్యక్షమైనాపు గనుక నీకనేక నమస్కారములు. కొన్నాళ్ళు లోకమును నీ నివాస స్థలముగా ఏర్పరచుకొనుట వలన లోకమున ఘవపర్చినావు. గనుక నీకు వందనములర్పించుచున్నాము. మా మానవులు నిన్ను అంగీకరింపవలెనని కోరియున్నవు. మా మానవుల శరీరమునే ధరించుకొని యున్నవు. ఇట్లు మా శరీరమును గౌరవపరచినాపు. గనుక నీకనేక స్తోత్రములు. పాపమునుబట్టి వ్యాధితో నిండియున్న శరీరములను స్వస్ధపరచుటకై, మానవులను నీయొద్దకు ఆకర్షించి, నమ్మినవారి శరీరములను స్వస్ధపర్ఛినాపు. గనుక నీకనేక స్తుతులు. ఒక్క శరీరమునే గాక శరీరమును నివాస మందిరముగా కలిగియున్న ఆత్మకు విశ్వాసము కలిగించి స్వస్ధపర్ఛినాపు. గనుక నీకు స్తోత్రములర్ఫించుచున్నాము. ఓ యేసుప్రభువా! నీవు కలుగజేసిన లోకములోనికి వచ్చిన పావన దేవా! శరీరమును స్వస్ధపరచిన ‘శరీర రక్షకా! ఆత్మను శుద్ది చేసిన ఆత్మరక్షకా ! నీకనేక గౌరవానంద వందనములు.
శరీరాత్మల వైద్యుడవైన తండ్రీ! నా శరీరాత్మల కళంకమును పరిహరింతువని నీకు స్తుతులర్పించుచున్నాను. శరీరములోని బాధలను, ఆత్మలోని బాధలను లేకుండ చేసి, మాకు విమోచన కలిగింతువని నమ్మి, ఓ విమోచనకర్తా! నీకు మా వందనములు ఆచరించుచున్నాము. దీనరక్షకా! తమ్మును రక్షించుకొన శక్తీలేని దీన ప్రజలను రక్షింపగల ఉద్యోగమును వహించి, నీ ఉద్యోగమును యుక్తమైన రీతిని నిర్వహించుకొన్న దీనజన రక్షకా! మా దీనప్రార్ఖన ఆలకింతువని ఆశించి నీకు స్తోత్రములాచరించుచున్నాము. నీవు దేవుడవు గనుక మా వ్యాధి, బాధలు మేము చెప్పక ముందే నీకు తెలిసే యున్నవి. ఈ విషయము మాకు ఆదరణకరమైన విషయమైయున్నది. మాకు తెలిసిన ఈ విషయమును గూర్ఛి నీకనేక వందనములు సమర్పించుచున్నాము. ఓ తండ్రీ! నిన్ను ఎట్లు వేడుకొనపలెనో మాకు తెలియకపోయినను, మా అంతరంగములో నున్న కోర్కెను బత్తి, మమ్మును బాగు చేయుదువని, విశ్వసించి, నిన్ను వందించు చున్నాము. ఆమేన్

దేవా! యేసుక్రీస్తు ప్రభువా! నీవు దేవుడవైనను మా మానవులకు కనబడుటకును, మోక్షలోక భోధలు వినిపించుటకును, వారితో కలసి మెలసి యుండుటకును నరుడుగా జన్మించినాపు. గనుక నీకనేక నమస్కారములు. తండ్రీ! నీవీ లోకములో వున్నప్పుడు, ఒకనాడొక పక్షవాత రోగిని చూచి నీ పాపములు క్షమింపబడినవని చెప్పి, మొట్టమొదట అతని పాపములు పరిహరించినావు గనుక నీకు స్తోత్రములు. తర్వాత అతడు తన జబ్బును గురించి ఏమియు చెప్పుకొనక ముందే అతనిని ఇంటికి వెళ్ళుమని చెప్పెనావు. వెంటనే అతని జబ్బు బాగైనందున సరితోషముతో అతడు ఇంటికి వెళ్ళెను. కాబట్టి నీకనేక వందనములు. నా పాపములు కూడ క్షమించుము. నా జబ్బులు బాగుచేయుము. ఇట్లు చేయుదువవి నేను నమ్ముచున్నాను. మా కాలములోకూడ నీవు వేలకొలది ప్రజలను నీ ప్రభాపమువల్ల బాగుచేచున్నాపు. నీకనేక స్తుతులు. నా శరీరములోని జబ్బులు, బాధలు నాకంటే నీకే బాగుగ తెలుసుసు. షాపులను, రోగులను జూచి నీవు జాలిపడుదుపు. నమ్మినయెడల బాగుచేయుదువు. తండ్రీ! నీవు పాపములను పరిహరించు వాడవు గనుక నీవు నా ఆత్మ వెద్యుడవు, అలాగుననే నా శరీర జబ్బులు బాగుచేయువాడవు గనుక నా శరీర వైద్యుడవు. నీవే నా రక్షకుడవు, నీవే నా పోషకుడవు కాబటి నిన్నే నా మనసులోను, బహిరంగములోను పూజింతును. ఎటువంటి వ్యాధియైనను ఎంత దీర్ఘకాల వ్యాధియైనను సుళువుగా ఒక్క క్షణములో నీవు బాగుచేయగలవని నమ్ముచున్నాను. నీవే నా దేవుడవు. నీ నా రక్షకుడవు, నీవే నా పోషకుడపు నీ నా యెుద్ద నిత్యము నివసింపగల సహవాసివి. అం దుకే నన్ను నీవశము చేసికొన్నాపు.

ఓ తండ్రీ! భూత పీడితులలోనున్న దయ్యములను వెళ్ళగొటుము. సంతానములేనివారికి సంతానము దయచేయుము. చిక్కులలోనున్న వారిని విడిపించుము. నీ సంగతులు లోకస్తులందరికి ప్రకటించుము. నాకు నీ బోధ తరచుగా వినిపించుము. దానివల్ల నాలో నమ్మిక కలిగించుము. ఆ నమ్మికనుబట్టె నీవు నాకు చేయదలచిన ఉపకారములు దయచేయుము. నా పాపములు, వ్యాధులు, నిత్యశిక్ష పరిహరించుటకై నీ ప్రాణము ధారపోసిన ప్రభువా! వీకనేక స్తోత్రములు. నేను నీయెుద్దకు రావలసిన గడియలో మోక్షమునకు చేర్చుకొమ్ము. ఇట్లు నీవు నాలో ‘కీర్తినొందుము అని మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము. ఆమేన్.

జబ్బుగా నున్నవారి కొరకు ప్రార్ధన
(మరిరుశ్రీ. 11:24వ వచనము మన ప్రార్థనకు ఆధారము)

1) ఓ దేవా! సృష్టికర్తా! మా తండ్రీ ! తలపోటు, మాడుపోటు, మతిచాంచల్యము, చుండ్రు, దురద, వెంట్రుకలు ఊడిపోపుట, తలకు పేలెక్కుట, ఈ విధమైన శిరస్సు బాధలు ఉన్నవారికి స్వస్థత దయచేయుదువని నమ్ముచున్నామ. నీకు నమస్కారములు, ఆమేన్.

2) చెవిపోటు, చెవుడు, చెవిలో చీము కారుట, వినబడకపోవుట; ఈ విధమైన జబ్బులు గలవారికి స్వస్థత దయచేయుదువని నమ్ముచున్నాను. అలాగే చెవిలో స్వస్థత దయచేయుదువని నమ్ముచున్నాను.

3) కండ్లు కలుగుట, కంటిలో పువ్వులు, కంటి నొప్పి, మంటలు, దురదలు, నీరుకారుట, మసకగా కనబడుట, దృష్టిహీనత ఈ మొదలన వారికి స్వస్థత దయచేయుదువని నమ్ముచున్నాను.

4) నాసిక జబ్బు, పడిసెము, కొందరికి నాసిక రంద్రము పెరుగుట, కాయలుండుట వలన వాటిని డాక్టర్లు కాల్చుదురు: అట్టి జబ్బులు ఏవైన ఉన్నవారికి స్వస్థత దయచేయుదువవి నమ్ముచున్నాను. ముక్కుచీదుట, రక్తము కారుట, ముక్కువ్యాధులు బాగుచేయుటకు నేర్చుకొనుటకు డాక్టర్లు యున్నారని వెళ్ళుదురు; వారి దగ్గరనూ తగ్గనివి నేడిక్కడ బాగుచేయుదువని నమ్ముచున్నాను.

5) దగ్గు, క్షయ, రొంపదగ్గు అన్ని విధములైన దగ్గులు గలవారికి స్వస్థత దయచేయుదువని నమ్ముచున్నాను.

6) సంతానము లేనివారికి సంతానము దయచేయుదువనియు, ఇబ్బందిగలవారికి ఇబ్బంది తీర్చుదువనియు, అప్పుగలవారి అప్పులు
తీర్చుదువనియు, విష పురుగుల బాధగలవారికి బాధ నివృత్తి, కోర్టులో అన్యాయము జరిగిన వారికి న్యాయము జరిగింతువనియు నమ్ముచున్నాను. చేతబడి, బాణామతి, శక్తీవూజ, మెస్మరిజం ఈ మొదలగు వాటివల్ల హాని పరిహరింతువని నమ్ముచున్నాను. పరీక్షలలో జయము కలుగు కృప, వివాహములో మంచి ఏర్పాటు కలుగు కృప కుటుంబ కలహములు తీర్తువని నమ్ముచున్నాను. మీటెరిగులకు రావలెనని అనుకురిటే తక్కినవారు రానివ్వరు. అట్టి ఆటంకము తీసీవేతువని నమ్ముచున్నామ. తల్లిదండ్రులలోని దుర్గుణాలు, వారిలోని జబ్బులు పిల్లలకు రాకుండ చేతువని నమ్ముచున్నాసు. ధనాపేక్ష కలిగియండు వారికి అట్టి ఆపేక్ష తీసివేతువని నమ్ముచున్నాను. గూడెంలో ఒకరికి, ఒక భక్తునికి ధనాపేక్ష కలిగినందున అతనికి చాంచల్యము కలిగినది ఇంకొకరికి జబ్బు, వేరొక నష్టము ఇత్తివి అనేకములు కలుగుచున్నవి. ఈ జాబితాలోని వాటిని పరహరింతువని నమ్ముచున్నను.
దశమ భాగము ఇవ్వనివారికి ఇబ్బంది కలుగును. ఇచ్చినవారు భాగ్యవంతులౌదురు. జీవాంతమందు మాకు ప్రతి ఫలము కలుగునని నమ్ముచున్నాము. మేము తలంచుకున్న పనులన్నీ సఫలము చేయుదువని నమ్ముచున్నాను . ఆమేన్.

రోగులు చేసికొనవలసిన ప్రార్ధన

ఓ యేసుక్రీస్తు ప్రభువా! నీవు వైద్యుడవైయున్నాపు గనుక వందనములు. నీయెుద్దకు పూర్వకాలము ఎంతమంది రోగులు వచ్ఛినారో అందరిని బాగుచేసినాపు. గనుక నన్నును బాగుచేయుము. ఎటువంటి వ్యాధియైన బాగుచేసినాపు గనుక నా వ్యాధి బాగు చేస్తావు. ఓ తండ్రీ నేను నిన్ను నమ్ముకొనియున్నాను. తగిన ఔషధము దొరికేటట్టు చేసికూడ నీవు బాగుచేయగలపు. ఔషధము లేకుండాకూడ బాగుచేయగలపు. నీ వాక్యమే గొప్ప ఔషధము. నీ వాక్యము నాకు ఇంకను బాగుగా నేర్ఫించుము. ఓ యేసుక్రీస్తు ప్రభువా! నీవు దయ్యా లను వెళ్ళగొట్టితివి. ఇప్పుడుకూడ వెళ్ళగొట్టగలపు. పాపాత్ముల పాపములు క్షమించితివి. చనిపోయిన వారిని బ్రతికించితివి. నేను నిన్ను నమ్ముకొన్నాను గనుక నీవు ఎంత ఉపకారమైన చేయగలవు. నాకు ఆ నమ్మిక కలిగించుము. నా మనస్సులోకి అపనమ్మిక రానియ్యకుము. అవిశ్వాసము రానియ్యకుము. సందేహము రానియ్యకుము. నా మనస్సులో ధైర్యము కలుగజేయుము. విసుగుదల కలుగును గనుక దానిని రానియ్యకుము. ఓ తండ్రీ! నీకనేక నమస్కారములు.

నా మనస్సులో ధైర్యము, విశ్వాసము, నిరీక్షణ కలిగించుము. జబ్బులు బాగుచేయుము. నేను ఎల్లప్పుడు నీ సేవలోయుంటాను. నాకు పరిపూర్ణ ఆరోగ్యము దయచేయుము. ఈ కాలములోకూడ అనేకమంది రోగులు
మ౦దులు వాడుకొనకుండ బాగు అగుచున్నారని అనుకొనుచున్నాను, నా ప్రార్థనలు నీ కృపనుబత్తి ఆలకించుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.

ప్రార్థన చేయుట సూచనలు:

నీవే స్వయముగా నీ హృదయ పూర్వకముగా నీ హృదయములోని కష్టములన్నీ, మనవులనన్నీ నీ తండ్రి యెదుట ధారపోయుము. నీ మనస్సునకు సంతుష్టి కలిగే వరకు ప్రార్థన చేయుము. నీవు నీ ప్రార్థనలకు జవాబు వచ్చునని కనిపెట్టుము. జవాబు వచ్చేవరకు మోకాళ్లమీద యుండుము.

2. ప్రసరిగించుటకు నీకు ఎవరైనా జత వచ్చేవరకు ఆగక ఇతరులకు సువార్త స్వతంత్రముగా చెప్పుము. ఒకవేళ నీవు ప్రసంగము చేసే ఆ సమయము వినేవారికి ఆఖరు పమయమై ఉండవచ్చును. నీవు రక్షించబడినావు గనుక ప్రతి దినము ఎవరికో ఒకరికి రక్షణ వార్త చెప్సవలెను.

3. దాత్ఫత్వము అనగా దేవుని సంఘాభివృద్దికై చందాలు ఎంత ఇవ్వవలెనో ఇతరులను అడుగక ధారాళముగా ఇవ్వవలెసు.

4. సలహాలు అనగా ఏదైనా ఒక చిక్కు వచ్ఛినప్పుడుడుగాని, మిక్కిలి కష్టమైనపని వచ్ఛినప్పుడు గాని దేవుని సలహా అడుగుము. ఇతరులయెుక్క సలహాలమీద ఆనుకొనవద్ధు. ఏ పనియైనా స్వతంత్రముగా నీ అంతట నీవే చేయుము.

యేసుప్రభువా! మీ పేరులోనే రక్షించేవాడపు అని యున్నది. వైద్యుడు సగము జబ్బు ఆపి సగములో విడిచిపెట్టివెళ్ళడు. అలాగే వీపు ఒక్క శరీరవ్యాధి బాగుచేసి, ఆత్మజీవనములోని పాపవ్యాధి బాగుచేయకుండా మనుషుష్యుని విడిచిపెట్జవు. గనుక నీవు రెండు విధములైన వైద్యుడవైయున్నాపు గనుక స్తోత్రములు. ప్రభువా! లోకవైద్యులు ఆస్పత్రిలో ఎన్నో రోజులు మందు ఇస్తే గాని రోగులు బాగుపడరు. అయితే నీవు సువార్తలలో వ్యాధిగ్రస్తులను ఒక్కసారే బాగుచేసివాపు. మా దేశములో జబ్బుగాయున్న రోగులకు ఒకసారి ,ప్రార్ధనచేస్తే మరుసటివారము మరల వత్తురు. అయితే పూర్ణ విశ్వాసము ఉన్నయెడల ఒక్కసారితోనే బాగుపడుదురు. అట్టి విశ్వాసము ఇక్కడ ఉన్నవారికి దయచేయుము. వారు తెచుకున్న తైలమును, ఆ తైలమున్న బుడ్డిని, వాడే రోగిని దీవించుము. కంటికి కనబడే రొట్టె, రసము ఇచ్చుచూ, కంటికి కనబడని శరీర రక్తములు కూడ ఇస్తూయున్నావుగదా! అలాగే వెంటనే స్వస్థత కనబడకపోయినను, ఒకసారి మీటింగులో ప్రార్థన అయినది గనుక నేను బాగుపడవలెను. రెండవసారి మీటింగునకు వెళ్ళనని నిశ్చయించుకొనే ధైర్యము దయచేయుము. ఈ తైలము‘నీ శిష్యులు వాడిన తైలమును, పెద్దలు వాడిన తైలమునైయుస్నది. గనుక మేముకూడ వాడుచున్నాము. ఈ గదిలో ఇప్పుడు ఎవరెవ్వరికి ఏ జబ్బులు యున్నవో అవి వ్రేళ్లతోపాటు పెరికివేయుము. వెంటనే ఆరోగ్యము కలుగజేయుము. మరల స్వస్థత మీటింగుకు రాకుండా ఇంటివద్ద స్తుతిచేసేటట్టు దీవించుము. ఆమేన్.

న్వస్ధి ప్రార్ధన

యేసు ప్రభువా! పరమవైధ్యుడా! నీవు ఇశ్రాయేలు దేశముయెుక్క పట్టణములలో సంచరించి నానావిధ రోగులను స్వస్థపరచినావు. కాబట్టి వందనము￰￰లు అది గొప్ప సరిగతి. నీవు ఒక్క మాట అన్నావు. నా శిష్యులు నా కంటే గొప్పవి చేస్తారన్నావు. పేతురుయొక్క నీడ తగిలి కొంతమంది బాగైరి. ఈ అద్భుతము నీవు చేసినట్టు లేదు. నీ శిష్యుడు చేశాడు. అలాగే ఇప్పుడు కాకానిలో ఈ వేళ నీ శిష్యులు ప్రార్ధనచేస్తే చాలామంది రోగులు బాగైపోతున్నారు. అయితే నీవు బాగుచేసినావని భావిసున్నాము. అక్కడ పా￰￰లస్తీనాలో పబ్లిక్‌గా (బహిరంగముగా) తిరిగిన నీవు ఇప్పుడు లోకములో ఎక్కడ స్వస్థత కలుగుచున్నదో, అక్కడ ఉంది ఉండి నీ సేవకులద్వారా స్వస్థత జరిగించుచున్నాపు. నీవు నేడు, నిరంతరము ఒక్క ఠీతిగానే ఉన్నానని పౌలు వ్రాసిసమాట సత్యము. అప్పుడు బహిరంగముగా చేసిన పని స్వస్థత. ఇప్పుడు రహస్యముగా చేస్తున్న చేస్తున్న ా పనికూడా స్వస్థతే. గనుక అప్పుడు స్తూ స్థుతికి కారణభూతుడవు ఆలాగే ఇప్పుడును మరింత స్థుతికి కారణభూతుడవు. ఇప్పుడు బేతేలు గృహమునకు వచ్చినవారిని గురించికూడా ప్రార్థిస్తున్నాము.అదికూడ స్వస్థతే స్వస్థతే. మేము చేసినట్లు కాదు, నీవు చేసినట్లే. ఆ ప్రార్ధనలు రోగులు విని, ప్రార్ధనలు చేస్తున్న స్వస్థత అని నమ్మినయెడల వారి హృదయములో కృతజ్ఞత ఉండును. తైలము తెచ్చుకొని దీవెన కోరుచున్నారు. నేను నా చెయ్యిచాపి దీవించక పోయినను, నోటిమాటతో మాత్రమే దీవించినప్పటికి, అది నీవు చెయ్యిచాపి తైలముమీదవేసి దీవించినట్టే అని వారు తెలుసుకొనినయెడల ఎట్టి వ్యాధియైనను అంతరించును. అట్టి కృప తైలము తెచ్చుకొన్న వారికి చూపును. పూర్వకాలమందే కాక నేడును మా తైలమునుకూడ యేసు ప్రభువు ఆశీర్వదిస్తున్నాడు. గనుక మాకు పర్వాలేదని తైలము రాసుకుంటే ఎంత ధన్యులు. నీవల్ల, నీ శిష్యుల వల్ల, పాలస్తీనాలో స్వస్ధతపొందిన వారి సంతోషము వీరికినికూడ కలుగును. ఈ తైలము నీవు చెప్పినదే, బబిబిలులో వ్రాయబడినదే. కాబత్తి శిలాక్షరముల వ్రాతలో పడినది. నెరవేరినది. నీకే మహిమ. ఆమేన్.

యేసుప్రభువా! నీళ్లవల్ల కలిగే శుద్దియు, పాలవల్ల కలిగే శుద్ధియును అసంపూర్ణమైనది. ఎడ్లయెుక్కయు, మేకలయెుక్కయు రక్తమువల్ల కలిగే శుద్ది అశాశ్వతమైనది. అయితే అవి ఈ లోకమునకు మాత్రమే పనికి వచ్చును. నీ అమూల్య రక్తమువల్ల కలిగే శుద్ది పైలోకమునకు పనికి వచ్చేది మేము రాబోయే కాలమందు మేము నీ సింహాసనము యెుద్దను, మహిమలోను, దేవదూతల ఎదుటను, వీ పరిశుద్ధుల యెదుటను ఉండభోవుచున్నాము. అందుకు పనికివచ్ఛేటట్లు మమ్మును ఇప్పుడు నీ రక్తమువల్ల శుద్దిచేయుమని వేడుకొనుచున్నాము. ప్రభువా ఒకప్పుడు నీవు యూదుల ఎదుట నిలువబడి, నాలో పాపమున్నదని ఎవరు నిరూపించగలర? అని పలికిన నీ పరిశుద్ద తమ వారికి చూపినావు. అట్లే మేమును నేడు లోకమ్దల ఎదుట నిలువబడి నాలో పాపమున్నదని ఎవరు నిరూపించగలరు? అని పలికే ధైర్యమును, పవిత్రతను అనుగ్రహించుము. మా పరిశుద్ధ వెన్నెల వంటిదైనను, ఎండవంటిదైనను కాక, ణి పరిశుద్ధతవంటి పరిశుధ్ధత దయచేయుమని వేడుకొనుచున్నము, ప్రార్థించుచున్నాము . ఆమేన్.

మరణమును కొట్టీవేయు ప్రార్థన

(మృతికి మృతి)

1. దయగల ప్రభువా! నీవు హిజ్కియాకు మరణ శాసనమును ప్రవచించినావు (రాజులు 20:1-6). అయినను ఆయన ప్రార్థించగా కొట్టివేసినాపు. ప్రవచించినవాడవు నీవే. ప్రార్థించగా కొట్టివేసినవాడవు నీవే.

2. గవర్నమెంటువారు ఒక ఆజ్ఞ ప్రజలకు ఇచ్చినట్లయితే ప్రజలు అల్లరిచేయగా ఆ జిఓ (.౦) కొట్టివేస్తారుగదా! వారు జి.ఓ. కొట్టివేయగా ప్రజలు జి.ఓ. కొట్టివేయబడినదని చెప్పుకొందురు గదా! మొదటిది గ్రంథములోనిది, రెండవది గవర్నమెంటులోనిది ఎత్తి ప్రార్ధించుచున్నాము. నేనుకాదు. నా స్నేహితులునన్నూ విజ్ఞాపన చేయుచున్నారు. నీవు విజ్ఞాపన వింటావు గదా! ఎలాగంటే పేతురునకు రేపు మరణము అనగానే పంఘనుంతయు ప్రార్థించగా విని విడిపించినావు గదా! విజ్ఞాపనలు వింటావని నిన్ను స్తుతించుచున్నాము.

3. మత్తయి 19:26లో నీవు ‘ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే అని అన్నావు. యేసుప్రభువా! గోజులాడిన స్త్రీ ఉపమానము నీవే చెప్పినాపు. దానిని ఆధారము చేసుకొని రోజూ అడుగుదును. నాకు మరణము కొట్టెవేయుము. లూకా 11:5-1౩లో రొట్టెలను దయచేసిన స్నేహితుని కథ నీవు చెప్పెనావు. సిగ్గుమాలి మాటిమాటికి అడిగినందున రొట్టెలు దొరికినట్లు నీవే వ్రాయించినాపు. గాన సిగ్గుమాలి అడుగుచున్నాను. నేరవేర్చుము.

4. హిజ్కీయాకు 15 సంవత్సరాలు ఆయుష్షు ఇచ్చినట్లు నేను 15 సంవత్సరాలు అడుగుటలేదు గాని ఎఫెసీ, 3:21లో ఉన్నట్లు (అడుగు వాటన్నిటికంటెను, ఊహించు వాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి ….. మహిమ కలుగును గాక!), అది ఇది కలిపి ఇమ్మని అడుగుచున్నాను, కాబట్టి ఆయుష్కాలమిమ్ము.
5. లూకా 18:1-8లో విసుగకుండా ప్రార్థించుమని నీవే అన్నావు’ నీవే చెప్పినాపు. నాకు విసుగుదలవున్నా ప్రార్థిచుచున్నను. శరీర, బలహీనతవల్ల విసుగుదల ఉన్న విసుగుదల ఉన్నదని నీకు తెలుసును గసుక 1) విసుగుదలను 2) మరణమున్ను కొట్టివేయుము అనికూడా ప్రార్థించుచున్నాను.

6. ముసలితనములో చిగిరిస్తారని దావీదు కీర్తనలు 92:14-15లో ఉన్నది గదా! ఒకవేళ ముసలితనము వచ్చినా చిగిరిస్తారని నీ వాక్యములో నీవే చెప్పిన దానిని ఎత్తుకొని ప్రార్జించుచున్నాను గాని కల్పించుటలేదు గదా!

7. 10౩వ దావీదు కీర్తనలో పక్షిరాజు యౌవ్వనమిస్తావని ఉన్నది గదా! అది ఎప్పుడు నాకిస్తావు? నేను వృద్ధాప్యములో నుంటే యౌవన బలమిస్తావని ఉన్నదిగదా! అది ఎప్పుడు నాకిస్తావు? నేను వృద్ధాప్యంలో ఉంటే యౌవన బలమిస్తావని వాక్యములో ఉన్నది. అది పరలోకములోనే కాదు, ఈలోకములోనూ ఇస్తావనే గదా!

8. నా నామమందు ఏది అడిగినా ఇస్తాను అని అన్నావు (యోహాను 14:14). వాక్యములో ఉన్నదే అడుగుచున్నను గాని ప్రభువా! క్రొత్తది ఏది అడుగుటలేదు గదా!

9. మార్కు 11:24 ‘చెప్పినట్లు జరుగక మురిదే జరిగినదని నమ్మమన్నావు. జరుగకముందే జరిగిందని నమ్ముటకు ప్రయత్నము చేయుచున్నాను. గనుక నేను నమ్మినట్టేగదా! నీవు నెరవేర్చవలెను గదా!

10. ప్రభువా! సన్నిధి కూటములలో నాకేకాదు, అనేకులకు జవాబులినస్తున్నవు గదా! ఈ మరణమును కొట్టివేయుమని అడిగినవానికి కొట్టివేసి, ఎందుకు జవాబులివ్వకూడదు?

11. ప్రభువా! దుష్తస్వప్నాలు, దుష్టదర్శనాలు, పిశాచి దర్శనాలు కలుగునప్పుడు శరీరములో అనారోగ్యములు, మనస్సులో వేదనలు ఉండును, గనుక అవి కొట్టి వేసి ఆదరణ కలుగజేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.

హింసకాల ప్రార్ధన

1. దయగల తండ్రీ! శ్రమలు రానైయున్నవని నీవు తరచుగా చెప్పుచున్నావు. గనుక మేము తప్పించుకొనుటకు ప్రార్థించుట న్యాయమే గదా! దేశాధికారులు మత సామరస్యమును కాపాడని యెడల క్రైస్తవులకు శ్రమ వచ్చునని మేము గ్రహించుచున్నాము. అయితే తప్పించుకొనే ప్రార్థన చేయవచ్చును గదా! అది వీ చిత్తమైతే తప్పించుము.

2. మా కండ్ల ఎదుట, యోహాను 14:14లో ‘నా నామమును బట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేతును’ అను వాక్యములో ‘ఏమి’ అనే మాటను జ్ఞాపకము చేసికొనుచున్నాము. ఏమి అడిగినను చేస్తానన్నావు గనుక శ్రమ కాలములో మమ్మును తప్పించుము.

3. ఓ ప్రభువా! యెరూషలేము నాశనమగునని తెలిసి నీ శిష్యులను ఉత్తరముననున్న దాను గోత్రములోని “పెల్ల” అనే గ్రామమునకు వంపివేసినావు గదా! అలాగే మా బైబిలు మిషను విశ్వాసులసు దాగొనేచోటికి పంపించుమని వేడుకొనుచున్నాము.

4. ఓ మా ప్రభువా! ఒక మాట ఉన్నది. అదేదనగా “తిరశ్కరణి” విద్య. ఈ విద్య నేర్చిన వారు బజారులో నడుచుచుందురు గాని ఎవ్వరికిని కనబడరు. హింసకుల యొక్క కండ్ల యెదుట ఉన్నప్పటికిని వారికి కనబడరు. అట్టి విద్య, హింసకాలములో విశ్వాసులకు దయచేయుము.

5. సాధు సుందరసింగు ఒకప్పుడు రైలుబండిలో మొదటి తరగతి పెట్టెలో ప్రయాణము చేయుచుండెను. అదే పెట్టెలో కూర్చున్న దొరకు కోపము వచ్చి, దొరలు కూర్చున్న పెట్టెలో మీరు కూర్పుండ కూడదని గద్ధించెను. ఆ దొర ఒక మూలకు వెళ్ళి కూర్చుండెను. సుందరసింగు అక్కడనే కూర్చుండెను గాని నీవు ఆ దొరగారికి కనపడకుండ చేసినావు. బండి స్టేషనుకు రాగానే ఇద్ధరును ఒకే పెట్టెలో నుండి దిగిరి. ఆ దొరగారు నీవు ఇంతసేపటి నుండి , ఎక్కడనున్నావని సుందరసింగును అడిగెను. ‘నేనెక్కడికి వెళ్ళలేదు’, ఇక్కడనే కూర్చున్ననని సుందరసింగు జవాబిచ్చెను. అతడు ఏమైనాడో అని చింతించుచు కూర్చుండిన ఆ దొర ఈ విషయమునకు చాలా సంతోషించెను, అలాగే మమ్ములను కూడ శత్రువులకు కనబడకుండ చేయకూడదా?

6. మరియు ఓ తండ్రీ!, ‘నాకు దాగుచోటు నీవే’ (కీర్తన ౩2:7) అని వ్రాయించినావు గదా! గనుక మమ్ములను శ్రమ సమయములో దాచిపెట్టుమని ఈ వాక్యమును బట్టి వేడుకొనుచున్నము.

7. మరియు ఓ దేవా! నీవు యిర్మియాను దాచిపెట్టెనావు గదా! (యిర్మియా 36:26) నీవు దాచిపెట్టిన ఎవరు కనుగొనగలరు? మా ఇంటిలో మేము, మా బిడ్డలు, పెట్టెలు, మంచములు అన్ని ఉండుసు గాని మేము ఎవ్వరికిని కనబడుము. హింసకులు వచ్చి చూచి ఎవ్వరు లేరు అనుకొని వెళ్ళిపోవుదురు. గనుక విశ్వాసులను నీవే దాచిపెట్టుమని మనవి చేయుచున్నాము.

8. మరియొక సంగతి. ఓ ప్రభువా! ఐగుప్తులో 10 తెగుళ్ళు కలిగినవి గాని అక్కడనున్న నీ బిడ్డలగు ఇశ్రాయేలీయులకు వీటిలో ఏదియును కలుగలేదు. ఎంత ఆశ్చర్యము! ఎంత అద్భుతము! ఎంత సహాయము! సంఘము యొక్క శ్రమకాల సమయములో అట్టి అద్భుతము మా యెడలసు జరిగించుమవి ప్రార్జించుచున్నాము.

9. ఓ ప్రభువా! ఒక దేశములో బొబ్బాయి అను ప్లేగు వచ్చినది. ఆ వ్యాధి ఆ దేశపు వారికే గాని, మా దేశము వారు అక్కడనున్నను వారికి రాలేదు, ఇతరులకు కూడ ఆ తెగులు తగులలేదు. నీవే వారిని కాపాడినావు’ మమ్మును కూడ అట్లు కాపాడుమని నిన్ను అడుగుచున్నాము.
1౦. నీ విశ్వాస బిడ్డలైన మమ్ములను ఇతరులు హింసించిన, వారికి మేము లోకువ అయినట్టు కాదా! నీవు మమ్మును అట్టి సమయములో కాపాడిన యెడల నీవు గొప్ప దేవుడవని బుుజువగును గనుక మమ్మును అట్టి సమయములో కాపాడుము.

11. పూర్వము రోమా చక్రవర్తుల కాలములో నీ విశ్వాసులకు హింసలు కలిగెను. ఒక గ్రామములో రోమా భటులు క్రైస్తవులను నరికి వేయుచుండగా, 7గురు ఋషులు వారికి భయపడి దగ్గరనున్న కొండ గుహలలోనికి పారిపోయి దాగుకొనిరి. వారు లోపల ప్రవేశింపగానే ఒక సాలీడు ఆ గుహ ద్వారమునకు గూడు అల్లివేసెను. లోపల ఆ ఋషులు నిద్రపోయిరి. భటులు ఆ గుహ దగ్గరకు వచ్చి సాలీడు అల్లిన గూడును చూచి, ఇది చాలా కాలము నుండి ఉన్నది. గుహ లోపల ఎవరును ప్రవేశింపలేదని వెళ్ళిపోయిరి, తర్వాత ఆ ఋషులు నిద్ర నుండి లేచి ఆకలి వలన, ఏదైన కొనుట ఏలాగు? అని అనుకొని, చంపివేస్తారను భయముతో వారిలో ఒకరిని చాటుగా వెళ్ళి, వస్తువులు తెమ్మని వారు పంపిరి. అతడు గుహ వెలుపలికి రాగానే అనేక క్రైస్తవ దేవాలయములసు చూచి ఆశ్చర్యపడెను. పట్టణములోనికి వెళ్ళగా అందరు క్రైస్తవులే తిరుగులాదుచుండిరి. ఇదేమిటి? అని ఆశ్చర్యపడెను, దుకాణమునకు వెళ్ళి డబ్బు ఇచ్చి సరుకు ఇమ్మని అడుగగా, ఆ సరుకు అమ్మువాడు అదెప్పటి నాణెము. ఇప్పుడు అది చెల్లుబడికాదు. ఆ రాజు చనిపోయినాడు అని చెప్పెను. ఆ ఋషి “క్రైస్తవులను చంపు ఆ రాజు లేదా”? అని అడుగగా అది 10 సంవత్సరములకు పూర్వపు సంగతి అని చెప్పెను. ఇప్పుడూ క్రైస్తవ రాజు కాన్‌ష్టంటైన్ రాజుగారున్నాడని చెప్పెను. ఆ ఋషి మేము నిద్రిరిచి 10 పరివత్ఫరములు అయినదా అని ఆశ్చర్యపడి, గుహలోని వారికి సంగతి తెలియజేయగా, వారందరు బయటికి వచ్చి సరితోషించిరి. మేము 10 సరివత్సరములు నిద్రించినామా అని వారును ఆశ్చర్యపడిరి. ఇట్టి అద్భుతము మా యెఢలను జరిగించుమని ప్రభువా! వేడుకొనుచున్నాము. ఆమేన్.

1. ఓ క్షమాపణ కర్తవైవ తండ్రీ! నేను అన్నింటికంటె అందరికంటెను ఎక్కువగా నిన్నే ప్రేమించి, నా మొదటి ప్రేమ నీకుచ్చునట్లు నా స్వభావమును మార్చును. ప్రభువా! నేను లోకములో నున్న వస్తువులకైనను, జీవరాసులకైనను, మానపులకైనను, సైతానుకైనను భయపడక, నేను ఎల్లప్పుడు నీకు మాత్రమే భయపడే కృప దయచేయుము.

2. ఓ ప్రభువా! నేను నీ నామమును వృథాచేయకుండా నీ నామమును గౌరవించి, మహిమపర్పు బ్రతుకు నాకనుగ్రహించుము. ప్రభువా! నేను బైబిలు చదుపుటయందును, ప్రార్థించుట యందును, కీర్తన పాదుటరిరంందును, గౌరవ బుద్ధితోను, భక్తితోను చేయగల కృప నాకనుగ్రహించుము.

3. ఓ ప్రభువా! ఆరాధన దినమును గౌరవించవలసినదని సెలవిచ్చినావు. ఆ దినముననే అనేకులు విందులు చేసికొనుచు, లేవిపోని గొడవలు మాట్లాడుచున్నారు, ఊళ్ళు వెళ్ళుచున్నారు. బట్టలు కుట్టుచున్నారే ఇల్లు అలుకుచున్నారు. నామకార్ధముగా ప్రార్ధించుచున్నారు. పాటలు పాడుచున్నారు. ఆదివారమంటే తక్కిన రోజులుగానే భావించుచున్నారు. ఎంత మంది పాప్టర్లు తమ ఇచ్చ నెరవేర్చుకొనే ప్రసంగాలు చేయుచున్నారు. ప్రభువు అట్టివారిని క్షమించుము. కృప దయచేయుము. వారికి వర్తమానము దయచేయుము.

4. ఓ ప్రభువా! తల్లిదండ్రులను తన్నేవారు, దూషించేవారే గౌరవిరచనివారు, సంపాదన ఎత్తుకొనిపోవువారు కలరు. అలాగే కొందరు రాజులను, కలెక్టరులను, పంచాయితీ వారిని ఎదిరించి, బహుఠీవిగా నడుతురు. అంతా వ్యతిరేకము. చాలామంది పంతుళ్ళను, మిషనరీ వారికే రైల్వేవారిని, రైతులను ఎదిరింతురు. వారినందరిని క్షమించుము. దేవుని తరువాత గొప్పవారెవరనగా తల్లిదండ్రులు, ఆ తరువాత అధికారులు అని గ్రహించునట్లు చేయుచు, నిన్ను బట్టి వినయ విధేయతలు, ప్రేమ, గౌరవకము చూపించి, నేను దీర్ఘాయుష్మంతుడుగా వర్దిల్లునట్లు చేయుము.

5. ఓ ప్రభువా! కొందరు పగ ఉండి భార్యమీద అనుమానపడి, ఆమె తల సరుకుట, స్వంత బంధుపులలో విరోధముండి చంపుట, కోప నరహంతకులు, అసూయ నరహంతకులు, స్వహత్య చేసికొనేవారు, జబ్బులు సహించలేక, భర్తపోరుపడలేక, అప్పులవారి బాధపడలేక, నూతిలోనో, నదిలోనో పడి, నరహత్య చేసికొనుచున్నారు. ప్రభువా! నేను నా దుర్గుణముల ద్వారా నిన్నైనను, నీ స్వరూపనుందు సృష్టించిన మానవునినైనను మనస్సు నొప్పించి ఆయాసపర్చక నీకును, లోకమునకు ఇప్ఘముగా బ్రతికే కృప నాకనుగ్రహించుము. నా శరీరము నీకు ఆలయము గనుక దానిని శుద్ధీకరించు విషయములోను, పోషించు విషయములోను తగిన జాగ్రత్త తీసికొనే జ్ఞాపకశక్తి దయచేయుము.

6. ఇది గొప్ప పాపము. నీచమైన పాపము, ఘోరమైన పాపము. మీ దఎష్టీలో ఎంతోమంది యౌవనులు తమ జీవిత చరిత్రను పాడుచేసుకొంటున్నారు. ఎంతోమంది వ్యాధులు తెచ్చుకొని చనిపోవుచున్నారు. వివాహములు గల కుటుంబములు నాశవమగుచుచున్నవి. తల్లిదండ్రుల వ్యాధులు పిల్లలకు అంటుకొనుచున్నవి ఇట్టి వారందరికి నీ కృప దయచేయుము. ఓ ప్రభువా! నేను నీవు జతపర్చిన భార్యభర్తలకు మధ్యగా వెళ్ళి వారి ఐక్యతను విడదీయకుండను, నీ చిత్తప్రకారము నూతనముగా జతపరచబడే వారిని విడదీయకుండను నన్ను జాగ్రత్తగా కాపాడుము.

7. ఓ దయగల తండ్రీ! నీవు నా ప్రార్థనలు వినుచున్నావు అందుకు స్తోత్రములు. అనేకులు ప్రయాణికులను బాధపెట్టుచున్నారు. స్త్రీల నగలు దోచుకుంటున్నారు. చేలలో పంట దొంగిలించుచున్నారు. తోటలలో ఫలములు దొంగిలించుచున్నారు. అందరు నిద్రపోవుచుండగా కన్నములు వేయుచున్బారు. సంతలలో, బజారులలో తక్కువ ఖరీదుగల వాటిని ఎక్కువ లాభమునకు అమ్ముచున్నారు. అట్టివారి నిమిత్తము వర్తకులందరి నిమిత్తము ప్రార్థించుచున్నాము. ఓ తండ్రీ ! నేను నాది కాని ఇతురులదగు దేనినైనను టక్కరి వల్లనైనను, కుయుక్తి వల్లనైనను దొంగిలించకుండ నీవు నాకిచ్చిన సమస్తమును, సమయముమ జాగ్రత్తగా వాడుకొనగల నేర్పు నాకు అనుగ్రహింపుము. ఓ ప్రభువా! పరువు నష్టము తెచ్ఛేవారు, ఒకరి మంచిపేరు చెడకొట్టేవారు రహస్య సంగతులు బయటికి తెచ్ఛేవారు. ఒకరిమీద లేనిపోని చెడ్దనేరములు గొప్పవారు ఋజువుపరచిన మాట్లాడక ఊరకుండుటయు నా ఇరుగుపొరుగు వారిమీద అబద్ధసాక్ష్యము పలుకకుండ నా నోటిని భద్రపరుచుము. ఓ ప్రభువా! నేను సత్యముగా బ్రతుకుచు సత్యము కొరకు పోరాడుచు, చివరకు సత్యము కొరకే హతసాక్షులైన వారి జీవితము నాకు దయచేయుము.

9. దురాశ దుఃఖమునకు చేటు. పొరుగువానిది ఏమియు ఆశింపకూడదు. మాకున్న దానితోనే త్ఫప్తిపొందవలయును కొందరు ఏదిచూస్తే అది అడుగుదురు. మసస్సులోనైన ఆశించుదురు. ఇట్టి వాటికి నన్ను దూరపరచుము. నీవు నాకు అనుగ్రహించిన పవిత్రమైన మనస్సాక్షిని నా అపవిత్ర ప్రవర్తన ద్వారా అపవిత్రపరచి, నీవు ఏర్పరచిన ఉద్ధేశ్యమునకు వ్యతిరిక్తముగా నడుచుచుండగా నీవు క్షమించి, శుద్దిచేసి క్రమపంచి, నీకు లోబడి గౌరవపరచు స్ఠితి నా మనస్సాక్షికి దయచేయుము.

ఓ తండ్రీ! నేను ప్రార్ధించవలసిస విషయములు అనేకములున్నవి పసిపిల్లలు తమ తల్లులు బయటకు వెళ్ళితే, పొలములోనికి వెళ్ళితే వారు మంచము మీద నుండి, ఊయలలో నుండి పడి అపాయములకు లోనగుదురు కొందరు మరణించుచుందురు. పసిపిల్లలను, యౌవనులను, వృద్ధులను కాపాడుము. వారు చెడ్డ అలవాటులలో పడకుండా విద్యాబుద్ధులను నేర్చుకొనునట్లు నీ కృప దయచేయుము కూలీలను కాపాడుము. మిల్లులలో పనిచేయు వారిని, బొగ్గుగనులలో పనిచేతువారిని, యుద్దములో పనిచేయువారిని, మేడలు, గోపురములు, సత్రములు కట్టేవారిని, భిక్షకులను, కుమ్మరిపని చేయువారిని, అడవిలో పనిచేయువారిని, పుస్తకములు వ్రాయువారిని, అచ్చు ఆఫీసులో పనిచేయు వారిని, వైద్య శాలలో పనిచేయువారిని, కార్థానాలలో పవిచేయువారిని మేడలు, గోపురముల, సత్రములు కట్టేవారిని, భిక్షకులను, కుమ్మరిపని చేయువారిని కృప దయచేయుము. వర్షముల వలన హూం వలన మరణించువారు, అడవి జంతువుల వలన హానినుండి వారిని తప్పించుము మనుష్యులందరికి సువార్త .సువార్తఅన్నిభాషలలోమ అందరికి వ్యాపింపజేయుమని వేడుకౌనుచున్నాను. ఆమేన్‌

కష్టకాల ప్రార్థన
దేవుని ప్రార్థించిన యెడల ఇప్పుడు ప్రవేశించిన జ్వరాలు అంతరించును ప్రార్థన:

1. దేవా! ఆకాశమును, భూమిని కలుగజేసిన సృష్టికర్తా! మమ్మును కలుగజేసిన తండ్రీ! నీకు అనేక నమస్కారములు;

2. మా పాపములు క్షమించుము.

౩. ఇకమీదట మాకు తెలిసిన ఏ పాపము చేయకుండ మాకు శక్తీ దయచేయుము.

4 మా జబ్బు తీసివేయుము.

5. మాకు ఫూర్ణారోగ్యము అసుగ్రహించుము.

6. మమ్మును లోకములోవి వారందరిని దీవిరించుము.

7. నీ విషయములు, నీ పద్ధతులు, నీ భోధలు, నీ ప్రేమను తెలిసికొనగల

జ్ఞానశక్తీని మాలో పుట్టించుము.

& దేవా! నిన్ను తప్ప ఎవరిని ఆరాధింపము. నిన్నే తలంచుకొని, నిన్నే

,మ్రొక్కి నిన్నే ప్రార్థించుచు, నిన్నే నమ్ముకొందుము. ఆమేన్.

దేవుని ఎట్లు స్తుతించిన యెడల మన కష్టములు తీరునో ఆ సంగతులు ఈ ప్రార్ధనలో ఉన్నవి.
“వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక” ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురు గాక! (దావీదు కీర్తనలు 107:22). ఈ స్తుతి అత్యధిక సంతోషముతో చేయవలెను :

1. ఓ దేవా! నా పాపశ్థితిని నిర్మూలము చేయుటకై ఒక పనిముట్టగా ఈ కష్టమును రానిచ్చుచున్నావు. గనుక ఈ మేలు నిమిత్తము నీకు వందనములు.

2. ఈ కష్టమున్నంత కాలము నేను నీ తట్టు తిరిగి యుండునట్లు చేయుటకై, ఈ కష్టకాలము రానిచ్చుచుంటివి. కాబట్టి నీకు వందనములు.

౩. నేను నిన్ను నమ్ముకొని, విశ్వాసమును అభ్యసించుటకై ఈ కష్టము నింకమ ఉంచినావు గనుక వందనములు.

4. కష్టములో ఓపికను నేర్చుకొనుటకై దీనినింకను ఉంచినాపు. గనుక వందనములు.

5. నా ఆత్మీయ జీవితములో అవసరమైన వాక్యపఠనము, ప్రార్ధనాభ్యాసము, వాక్యప్రకటన మొదలగు వాటి మీద మరింత గొప్ప ఆశ కలిగిరిచుటకై ఈ కష్టకాలములను ఇంకా ఉంచినాపు గనుక వందనములు.

6. నీ సహవాస భాగ్యము నాకు బాగుగా లభించుటకై కష్టములు రప్పించినావు గనుక నీకు వందనములు.

7. నేను పరలోక మహిమకై సిద్ధపడుటకు, ఈ కష్టమును రప్పించుచుంటివి. గనుక వందనములు.

8. సుఖకాలమందు నమ్ముకొనుట మాత్రమేగాక, కష్టకాలమందు కూడా మెచ్ఛుకొసుటకై ఈ కష్టమును కల్పించుచుంటివి. గనుక వందనములు.

9. సదా నిన్ను నస్తుతించుచు నిన్ను నమ్ముకొని యుండుట, తరచుగా నీ గ్రంథములో మాటలు వినుట, నిన్ను గురించి సదా ఆనందించుట మొదలగు ఈ చర్యల వలన ఈ కష్టస్దితిని సంపూర్ణముగా నేను
జయించుటకు. దీనినింకా ఉండనిచ్చుచున్నావు. గనుక సో1తములు,

మెట్ల ప్రార్థన
(దేవునినెట్లు ప్రార్థించిన యెడల మన కోరికలు నెరవేరును ఆ సంఘతులు ఈ పత్రికలో ఉన్నవి)

మానవ సహకారులారా! మీరు ఏకాంత స్థలమున చేరి, ఈ క్రింది మెట్ల ప్రకారము ప్రార్థించి మేలు పొందండి

1. దేవుడు మీ ఎదుట ఉన్నాడని అనుకొని నమస్కారము చేయండి. ఇది మొదటి మెట్టు. ఇక ప్రార్థించండి:-
2. దేవా! నా పాపములు క్షమించుము. నాకు తెలిసిన ఏ పొరపాటులోను పడకుండ నన్ను కాపాడుము.
3. దేవా! నా శక్తికొలది చెడుగును విసర్జింతును. నా తలంపులో గాని, చూపులో గాని, వినుటలో గాని, మాటలో గాని, ప్రయత్నములో గాని, క్రియలో గాని ఏ దుర్భుధ్ధి చేరకుండా జాగ్రత్తగా ఉందును.
4. దేవా! నా శరీరమును, నా ప్రాణమును, నా ఆత్మను, నా జ్ఙానమును, నా మనస్సాక్షిని, నా ఇంటిని నాకు కలిగి ఉన్న సమస్తమును కాపుదల నిమిత్తమై నీ వశము చేయుచున్నాను.
5. సృష్టికర్తవైన దేవా! నీవు ఆది అంతము లేనివాడవు, అంత గొప్పదేవుడవు అయినప్పటికిని, నీవు మా తండ్రివి, మా ప్రార్థనలు విందువు. గనుక నీకు వందనములు. నీవు జీవము గలవాడవు, ప్రేమ గలవాడవు, న్Yఆయము గలవాడవు, శక్తి గలవాడవు,
పాపములేని పరిశుధ్ధత గలవాడవు నీవు అంతటను ఉన్నావు నా దగ్గర కూడా ఉన్నావ్. గనుక నీకు వందనములు. నీలో ఉన్న ఈ మంచి గుణములు నాలో కూడా పెట్టిన్నావు. గనుక వందనములు.

దేవా! తండ్రీ! నాకు కలిగిన ఎన్నో కష్టములు తీసివేసినాపు. గనుక వందనములు. కష్టములు తొలగించుట మాత్రమే గాక ఎన్నో ఉపకారములు చేసినాపు. గనుక వందనములు. నేను నిన్ని ప్రార్థించినను ప్రొర్థించక పోయినను కాపాడినావు. గనుక నీకు వందనములు.

దేవా! ప్రభువా! నేను నిన్ను కోరినను, కోరకపోయినను అనేక మేళ్ళు చేసినావు. గనుక వందనములు.

దయగల తండ్రీ! నాకు ఏవి అవసరమో అవి దయచేయుము. పోషణ, ఆరోగ్యము దయచేయుము.

9. దేవా! నీవే నా తండ్రివి, నా పోషకుడవు, నా వైద్యుడవు, నాకు విద్యాబుద్ధులు నేర్పు దేవుడవు. నేను ఎల్లప్పుడును నీయందు భక్తి నిలుపగల శక్తిని అమగ్రహించుము. సమస్తమును అనుగ్రహింప సమర్థుడవు. నన్ను మాత్రమే గాక నీవు కలుగజేసిస సమస్తమును దీవించుము. మనుష్యులందరిని రక్షించుము. నిన్ను నమ్ము వారందరిని మోక్షములోనికి చేర్చుకొనుము. నమ్మని వారికి జ్ఞానము నేర్పును. నమ్మిక కలిగించుము. వారిని కూడ మోక్షములోనికి చేర్చుకొనుము

10. దేవా! నాకు మనుష్య రూపముతో దర్శనములో గాని, స్వప్నములో కనబడుము. నాతో మాట్లాడుము. నేను నిన్ను ఏమైన అడిగిన జవాబు చెప్పుము. ఆమేన్.

11. ఇప్పుడేమియు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండి, దేవుడు మీకు చెప్పునో వినుటకై కనిపెట్టండి. అప్పుడాయన మీకు నిశ్చయముగా కనబడి మాట్లాదును.

గమనిక:ఈ పదకొండు మెట్లు ఎక్కునప్పటికి మీకు గొప్ప స్థితి వచ్చును. ఈ ప్రార్ధన మీ ఇష్టము వచ్చినట్లు చేసికొనవచ్ఛును. అందరికి నేర్పవచ్చును. ఈ ప్రార్థన వలన భూతములు పారిపోవును. చేతబడి తగలదు. శాపము రాదు. శత్రువులు స్నేహితులగుదురు. పాపములు పరిహారమగును. వ్యాధులు కుదురును. పేదరికముండదు. బిడ్డలు లేనివారికి బిడ్డలు కలుగుదురు. అప్పులు తీరును, పొలములు పండును, పశువులు బాగుగా పాలు ఇచ్చును. పురుగు ముట్టదు. ముట్టినను మీ ప్రార్థన వలన విషము విరిగిపోవును. మీరు తలంచుకున్నదంతయు నెరవేరును. భయపడకుడి. దేవుని తలంచుకొని సంతోషముగా ఉండండి. ఎక్కడికి వెళ్ళినను ఏమి చేసినను దేవుని తలంపుమీదనే ఉ౦డ౦డి. ఇది అన్ని మతముల వారికి అనుగుణ్యముగా ఉండునట్లు వ్రాయబడిన ప్రార్ధన. అందరు అరిగీకరింపవలసినదే. దీని ప్రకారము చేసి మేలు పొందవలసినదే. మీకు జయము కలుగునుగాక, మీరు అన్నిటిలో వర్దిల్లుదురు గాక! ఆమేన్. అప్పశేడు భూలోకము మోక్షమువలె మీకు కనబడును. విచారము గాని, దిగులు గాని, అపనమ్మికము గాని మీ మనస్సులోనికి రానియవ్వకండి. అవన్నియు దయ్యపు చేష్టలు మీ బ్రతుకంతటిలో దేవుని చేష్టలు, దేవుని క్రియలు, దేవుని పనులు మాత్రమే ఉండవలెను గాని, ఇతరమైనవి ఉండకూడదు. మీకు శుభము కలుగును గాక! ఆమేన్.

పరీక్షల కొరకైన ప్రార్ధన

1) ఫ్రారనః దయగల ప్రభువా! విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుచున్నవి. అనేకమంది మాకు ఉత్తరములు వ్రాస్తున్నారు. వారిని దీవించుము. వారికి ఏ దృష్టిని దయచేయుమని అడుగుచున్నాము, ప్రార్థించండని మమ్మును కోరినట్లు వారు నిన్ను ప్రార్థించే ప్రేరేపణ దయచేయుము. వారికి విద్యయందు పాటుపడే శ్రధ్ధ, సమయము, వీలు, జ్ఞాపకశక్తి, ఆటంకముల నివారణ ఇవన్నీ దయచేయుము. మాకు ఉత్తరములు వ్రాసిన విద్యార్ధులనందరికి పరిపూర్ణ జయము దయచేయుము. వారు పరీక్షలలో జయము పొందినపుడు, ఒకానొక సమయమందు కొందరు స్వహత్య చేసికొనుటకు ప్రయత్నిస్తారు. దయగల ప్రభువా! వారు క్రైస్తవ పిల్లలు, అయి అన్యుల పిల్లలును మాకు వ్రాస్తున్నారు. సంతోషమే, వారికిని నిరీక్షణగలదు. అయితే పరీక్షలలో ఫెయిల్ అయితే ప్రార్ధన నెరవేరలేదని నిరాశపడుదురు. గనుక అందరిని కరుణించుమని వారి ప్రార్ధన, మా ప్రార్ధన నెరవేర్చుమని వేడుకొంటున్నాము.

ఓ ప్రభువా!మా కొరకు ప్రార్థించండి అని ఎందరు మాకు వ్రాసినారో వారందరియొక్క కోరికలు నెరవేర్చుము. ఇప్పుడు ఇదివరకు వ్రాసిన కోరికల ఉత్తరములు నీయెుక్క సన్నిధానమున పెట్టుచునాన్నాము. కృప దయచేయుము. ‘మా కొరకు ప్రార్ధించండి’ అని బేతేలు గృహమునకు ఎవరు వ్రాసిరో, వ్రాస్తారో వారియొక్క కోరికలు నెరవేరునట్లు ఆశీర్వదించుము. ఎవరియెుక్క కోరికలు నెరవేరవని నీకు తెలుసునో, వారియెుద్ద నుంచి ఉత్తరములు రాకుండా చేయుము. తీరా వచ్చిన తరువాత మొదట ప్రార్ధన చేయవలెను గనుక రెండవ ప్రార్ధన ఇటువంటి రెండవ ప్రార్ధన ఆలకించుమని వేడుకొంటున్నాము. ప్రార్ధనలు చేయుట ఎందుకు ప్రభువా! నెరవేరుటకే గదా! నెరవేరని ప్రార్ధనలు నా దగ్గరకు రానీయకుము, ఎందుకంటే, లోకములో ఉన్న అన్ని మతములకంటే, అన్ఫి మిషనులకంటే బైబిలు మిషనుకు గొప్ప అంతస్తు ఇచ్చిన లాభమేమి? ప్రార్ధన నెరవేరకపోతే, కాబట్టి బైబిలు మిషనునకు అవమానము రాకుండునట్లు నీకు అపకీర్తి కలుగకుండునట్లు ఈ ప్రార్థనలకు, ఏర్పాటు కలుగునట్లు దీవించుము. ఆమేన్.

తెగెంపు ప్రార్ధన

ఓ ప్రభువా! నేను విసర్జించవలసిన వన్నియు విసర్జించే తెగింపు నాకు దయచేయుము.

ఓ ప్రభువా! నీవు నాకు చేసే సహాయము పూర్తిగా పొందే విశ్వాస స్తోత్ర కృతజ్ఞత కలిగియుండవలెనని కోరుచున్నాను.

ఓ ప్రభువా! నా భక్తిలో ఏ మాత్రమైన తగ్గింపులేకుండా చేయుము.

ఓ ప్రభువా! నిన్నును, నీ భక్తులను, నీ ఆజ్ఞలను, నీ పదాలను సమానముగా (పీమిరిచునట్లు పక్షపాతములేని మససుఎ నాకు దయచేయుము.

ఓ ప్రభువా! నేను వారి ప్రార్ధన మీదను, వీరి ప్రార్ధనమీదను ఆనుకొనక నా ప్రార్టనమీదను, పరిశుద్ధాత్మ ప్రార్ధన సహాయము మీదను అనుకొనే ధైర్యము దయచేయుమని తండ్రీ! అని నిన్ను కోరి ప్రార్థించుచున్నాను ఆమేన్.

(ఇది ఆదివార ఆరాధనలోను, ఇతర సమయములోను వాడుకొనవచ్చును)

1. పాపపు ఒప్పుదళ: ఓ దేవా! నేను నిన్ను తలంచుటకైనను, నీ పేరెత్తుటకైనను, నిన్ను ప్రకటించుటకైనను యోగ్యుడను కాను. జన్మవలన తలంపు, మాట, చూపు, వినికి, ప్రయత్నము, క్రియ, నైజమువీటన్నిట; బట్టి నేను పాపినైయున్నాను, నీ ఉచితార్థమైన క్బపగల ఉపకారములకు లేశమైనను పాత్రుడను కాను. ఇది ప్రభువునుబట్టి అంగీకరించుము. ఆమేన్‌

2. విశ్వాస ప్రమాణము: ఓ దేవా! మహాప్రభావముగల తండ్రీ నీ అధికమైన ప్రేమనుబట్టి నన్ను అంగీకరించుచున్నావని నముశ్రీచున్నాసు నా నిమిత్తమే భూమి, ఆకాశములను, మోక్షమును, అనుదినము నేను అనుభవించువాటిని కలుగజేసియున్నావని నమ్ముచున్నాను. మరియు నాకే అన్ని విషయములలోను సహాయము చేయగల పరిశుద్ధులైన దేవదూతలను కూడ నా నిమిత్తమే కలుగజేపినావని నమ్ముచున్నాను. నీ ప్రియకుమారుని ద్వారా అనుగ్రహించు రక్షణభాగ్యము నా నిమిత్తమే అని నముచ్చున్నాను. ప్రేమ, శక్తీ, జ్ఞానము, న్యాయము, విశ్వాస్యత, పరిశుధ్ధత, సర్వవ్యాపకత్వము, అదృశ్యము, జీవము, అనంతము, అనాది, నిర్వికారము మొదలగు పరిశుధ్ధ లక్షణములతో నీవు ప్రకాశించుచున్నావని నమ్ముచున్నాసు. ఇట్టి గొష్ఫవాడవైన నీవు నా దేవుడవు, నా రక్షకుడవు, నా తండ్రిని, నా సహకారివి, నా వైద్యుడపు నా దాతవు, నా హఎదయవాసివి, నాసర్వము అని హృదయ పూర్వకముగా నముచ్చున్నాను.

నీవు నా పాపములను ఎప్పటికప్పుడే క్షమించియున్నావనియు నామీదికి కష్టములు వచ్చుటవల్ల నాకు వివిధములైన ఉపకారములను వాటివలన చేయుచున్నావనియు, ననన్ను నాశనమునకు అష్పగించవనియు నమ్ముతున్నాను. నీవు పరలోకములోను, ఇతర స్థలములలోను మాత్రము కాక నాలో నిత్యము ఉన్నావనియు పరిపూర్ణముగా నమ్ముచున్నాను.

నా ఆత్మీయ జీవనాభివృద్ధికై సంఘమును ఏర్పాటు చేసినావనియు నమ్ముచున్నాను. తుదకు నన్నుబట్టి కాదుగాని నీకుమారునిబట్టి నా ప్రార్థనలన్ని ఆలకింతువనియు, నిత్య మోక్షిములోనికి నన్ను చేర్పుకొందువనియు
నమ్ముచున్నాను. ఈ నా పూర్ణ విశ్వాసమును యేసుప్రభువు ద్వారా ఆలకించుము ఆమేన్.

3. ప్రార్ధన:ఓ దయగల తండ్రి! నీవు ప్రార్ధనలు వినువాడవగుట వలన నీ సన్నిధికి వచ్చి ఏదైనను, చెప్పుకొనవచ్చుననియు, అడుగకొనవచ్ఛుననియు తెలిసి నిన్ను స్తుతించుచున్నాసు. నాకు కావలసినవి నీకు ముందుగానే తెలిసినసు అడుగుడి మీకియ్యబడుసని చెప్పెనావు. గాన నా మనవులన్నియు నీయెదుట సమర్పించుకొనుచున్నాను.

ఓ తండృఇ! నాకు ఏమి ఇయ్యవలెనవి నీకు ఉన్నదో అదే దయచేయుము. నేను ఎల్లప్పుడు నీ సన్నిధిలో “స్వేచ్ఛగా సరిచరింపగల బిడ్డనుగా నన్ను స్ధిరపరచుచుండుము. కష్టకాలములోను, సంగతులు అర్ధముకాని కాలములోను నేను నీ పక్షముగా నిలువబడగల ధైర్యము దయచేయుము. నిన్ను గూర్ఛి నాకు గల మరిచి అభిప్రాయమును మారనీయకుము. పాపము నుండియు, పాప ఫలితమునుండియు నన్ను కాపాడుచుండుము. ప్రతి పర్యాయము నీ వాక్యము నాకు భోధపరచుచుండుము. నా ఆత్మలో సదా మాట్లాడుచుండుము, మరియు ఏ విషయమై కృతజ్ఞతతో కష్టపడి పనిచేయగల సేవకునిగా నన్నీ స్టిరపరచుచుండుము. నన్నీ పెండ్లికుమార్తె వంశమునుండి విడిపోనీయకుము. నీకిష్టములేనిదే నేను అడుగ తలంచునప్పుడు అవి ప్రార్థన వాలులోనికి రాకుండా తప్పింపుము. మరియు ఒక అంశమును గురించి ప్రొర్థింపవలసిన గడియ దాటిపోనీయకుము. నాకు ప్రార్థన వాలు దయచేయుము. సర్వజనులకు నీవాక్య వార్త అందింపగల బోధకులు పంపుము. వాక్యముపదేశించు ఏర్ఫాటులన్నిటిని వృధ్ధిచేయుము. పాపులకు, బాధితులకు, బీదలకు, అన్యాయము పొందుచున్నవారికి తోడైయుండి, నా పక్షమున జరుగవలసిన సత్యకార్యములను వృద్దిచేయుము. ఈ ప్రార్థన , కుమారుని ముఖముచూచి ఆలకించుము. ఆమేన్.

4. సమర్పణః ఓ దేవా! నీవు నాకు ఇచ్చినవన్నియు నీక సమర్పించు చున్నాను. మరియు నా శరీరమును, నా ఆత్మను, నాక కలిగియున్న సమస్తమును, నా జీవిత కాలములోని గత కాలమును నేటికాలమును, రాభోవుచున్న కాలమును నీకు సమర్పించుచున్నాను. నీ చిత్తము ఏదో అదే నా చిత్తమైయున్నది, నీ చిత్తము అనేక మారులు నాక ఇష్టముగా నుండక పోయినను, నేనది ఇష్టడునట్లు సహాయపడగోరుచున్నాను. ఏది నేను చేయలేక పోపుచున్నానో ఆ మంచి కార్యమును, నాకుగాని నీకుగాని ఇష్టములేనిది ఏది చేయుచున్నావో ఆ కార్యమును నీకు అప్పగించుచున్నావు. మా బంధువులను, స్నేహితులను, అధికారులను, నేనంటే ఇష్టములేనివారిని, మాకు ఇష్ణములేని వారిని, శత్రువులను నీకప్పగించుచున్నాము. మమ్మును బాధపెట్టు పురుగులు, జంతువులు, పక్షులు మొదలైన వాటిని నీకు సమర్పించు చున్నాను. ఆలాగే మాకు బాధకరముగానున్న దయ్యములను, సైతానును, తత్ సంబంధమైన వాటినన్నిటిని నీ వశము చేసికొనుచున్నాను. మేము బాధ తెచ్చుకొన వృక్షాదులు, శిలలు నీకు అర్ఫించుచున్నాను. మాకు హానికరము కలుగునట్టి పంచభూతములను నీకు అర్ఫించుచున్నాను. ఈ అర్పణ నీ కుమారుని పరిముఖముచూచి అంగీకరించుము. ఆమేన్.

5. రాకడ ప్రార్థన:ఒక గ్రామములో అందరు కలహములతో నుండిరి. ఒక దినమున తన జ్వరముగానున్న కుమార్తెను చూడవచ్చిన తల భయంకరమైన కలహముల సంగతి విని, తన కుమార్తెను తన ఇంటికి తీసికొనిపోయెను. ఈ లోకము గత్తరలోకము, విషపురుగుల లోకము, నిరీక్షణ లేనిలోకము, మరణలోకము, దయ్యాల లోకము, దయ్యాలకు లోబడిన మనుష్యులున్న లోకము, కాబట్టి మన తండ్రియైన దేవుడు మనలను ఇచ్చట నుండకుండ మోక్షమందిరమునకు తీసికొని వెళ్ళు. ఆయన శీఘ్రముగా వచ్చును. ఇదే రెండవ రాకడ. తండ్రి కుమార్తెను తీసికొని వెళ్లునప్పుడూ ‘రాను’ అని చెప్పదు. మనముకూడ మేఘములోనికె “రాను’ అని చెష్పకూడదు. ప్రభువా! తండ్రీ! సిద్ధముగానున్నాము అని చెష్పవలెను. ఓ ప్రభువా! మేమట్లు చెప్పగల కృప దయచేయుము. ఆమేన్.

6. స్తుతిః సర్వ సద్గుణ నామధారివైన ఓ ప్రభువా! నా సృష్టికర్తా! నీ స్ధితినిబట్టి నీకు వందనములు. నేను ఏ విషయములో నిన్ను న్తుతించుట మానగలను? నా మనస్సులోనికి తెచ్చు కొనగల సర్వాంశములు నీ స్తుతియై యున్నవి. నేనుకూడ వీ స్తుతియై యుండగోరుచున్నాను. నా బ్రతుకంతటిలో నిన్ను స్తుతింతుముగాక! దేవదూతలు పరిశుద్ధులగుటచేత, పాపినైన నేను వారివలె స్తుతించలేకపోవుచున్నాను. గాని న్తుతించవలెనని నాకు ఉన్నది. నా హృదయములోని నా స్తుతి, రాత్రంతయు వెలిగే కాగడావలె ఉండవలెనని కోరుచున్నాను. నేను పొందుచున్న ఉపకారము వలవను, కష్టమువలనను, నా సేవ వలనను నీకు కీర్తి కలుగును గాక! ప్రార్థనవాలు దయచేయుమని అడిగిన నేను, నస్తుతిగానము కూడ దయచేయుమని వేడుకొనుచున్నాను. ఈ నా బలహీనమైన స్తుతి ప్రభువైన యేసునిబట్టె అందుకొనుము. ఆమేన్‌, ఆమేన్‌, ఆమేన్.

సృష్టికొరకైన ప్రార్ధన

1. తండ్రీ! నీవు కలుగజేసిమ సృష్టిలో ప్రతిజీవిని, ప్రతి వన్తువును ప్రతి నిమిషము దీవించుచుండుము (యెషయా 27:3).

2. తండ్రీ! నీవు కలుగజేసిన సృష్టి అంతటికి నరవాక్కునిచ్ఛి క్రీస్తు ప్రభువుని గరింరిచిన సమాచారము, భూలోకములోనున్న ఒక్కొకరికి స్వప్నములోనో, దర్శనములోనో అందించుము.

3. తండ్రీ! నీవు మా అన్ని ప్రార్ధనలు విన్నందుకు నీకు సోత్రములు. నీ లక్షణ స్తోత్రములతో పాటు సృస్టి యావత్తుఛేత స్తుతి మోత మ్రోగించుము. ఆమేన్.

ధైవలక్షణములను గురించి స్తుతులు. ఇది అన్ని మతములవారు చేయదగిన స్తుతి.

సృష్టికర్తవైవ మా తండ్రీ! మా దేవా! మేము పుట్టకముందే మా మేలు నిమిత్తమై ఆకాశమండలమును దాని లోని నమస్తమును, భూమండలమును దానిలోని సమస్తమును కలుగజేసీన ప్రభువా! నీకు అనేక నమస్కారములు. పిమ్మట మమ్మును కలుగజేసిస తండ్రీ! నీకు అనేక నమస్కారములు.

ఆదిగాని, అంతముగాని లేని శాశ్వతుడవైన దేవా! నీకు అనేక నమస్కారములు.

జీవమైయున్న నా దేవా! మేము సుఖముగా జీవించుటకు మాకు జీవమిచ్ఛినావనియు, మరణ సమయము రాగా మరణమును తప్పించి జీవమును సాగించుచున్నావనియు, మాకు నిత్యజీవనము కూడ ఇచ్చెదవనియు నిన్ను నమస్కరించుచున్నాము.

జ్ఞానవంతుడవైన దేవా! మేము మా కష్ణసుఖములు నీకు చెప్పక పోయినను నీవు జ్ఞానివైయున్నందున నీవు తెలిసికొని మా కోరికలు నెరవేర్తువని నిన్ను నమస్కరించుచున్నాము.

ప్రేరూపివైన దేవా! మేము ఎంతగొప్ప పాపులమైనను నీవు ప్రేమవైయున్నందున మమ్ములను క్షమింతువని నిన్ను నమస్కరించు చున్నాము.

న్యాయవంతుడవైన దేవా! మేము ఎంత గొప్ప అవిధేయత గలవారమైనను నీవు న్యాయమైనందున మమ్మును దిద్ధుటకు శిక్షింతువని నిన్ను నమస్కరించుచున్నాము`

శక్తిమంతుడవైన దేవా! మేము పాపమును విసర్జించుటకు గాని, భక్తిగా నడచుటకు గాని, తగిన శక్తి లేనివారమైనను నీవు శక్తిమంతుడవై యున్నందున మా పనులు చేయుటకు శక్తిని దయచేయుదువని నిన్ను నమస్కరించుచున్నాము.

కి. పరిశుద్ధుడవైన దేవా! మేము పాపులమైయున్నందున అపరిశుద్దత గలవారమై యున్నాము, నీవు పరిశుద్ధుడవై యున్నందున మమ్మును శుద్దిచేయుదువని నిన్ను నమస్కరించుచున్నాము.

9. సర్వవ్యాప్తివైన దేవా! మేము ఎక్కడ ఉన్నను నీవు ను అక్కడనే ఉండి మమ్మును కాపాడుదువని నిన్ను నమస్కరించుచున్నాము.

10. అదృశ్యుడవైన దేవా! మా శరీర నేత్రములకు నీవు కసబడకపోయినను మేంఉ నిన్ను చూచుటకు ఆత్మనేత్రమను గ్రహింతువని నిన్ను నమస్కరించుచున్నాము.

11. స్వతంత్రుడవైన దేవా! నీవు మాకు ఇచ్చిన వాటిని స్వేచ్చగా వాడుకొనలేని వారమైనను నీవు స్వతంత్రుడవైయున్నందున నీ స్వతంత్రత మీద ఆధారపడి మా స్వతంత్రతను సద్వినియోగ పరచునట్టి స్వాతంత్ర్య బుద్ధి అనుగ్రహింతువని నిన్ను నమస్కరించుచున్నాము.

12. ఆకాశమును, భూమిని మేము అనుదినము చూచుటవలన నీవు ఉన్నావని మేము తెలిసికొనగల జ్ఞానమును, మా విషయములో నీవు చేయు సమస్త కార్యములను సమ్మతించునట్లు మనస్సాక్షిని మాలో అమర్ఛినావని నిన్ను సమస్కరించుచున్నాము.

13. అత్బుతకరుడవైన దేవా! ఆకాశమును, భూమిని మేము చూచుట వలననే కాక ఇంకను అనేకమైన ఇతర వస్తువులను, చరిత్రలను చూచుట వలన కూడ నీ విషయములు మాకు అర్ధము కాగల వీలు కలిగించుచున్నావని నిన్ను నమస్కరించుచున్నాము. ఈ మా స్తుతులను, అనుదినము మేము నీ వలన అనుభవించుచున్న ఉపకారముల విషయమై చేయవలసిన కృతజ్ఞతా స్తుతులను, నీ మహోన్నత స్థితిని బట్టి ఆలకించుమని నిన్ను వేడుకొను చున్నాము,

14. దేవా! తేజోమయమగు లక్షణములలో ఒక్క లక్షణము ద్వారా మాకు ఉపకారము చేయునప్పఫ్డు దానితోపాటు తక్కిన లక్షణములన్నియు ఆ కార్యమునే చేయుచుండునంత ఏక లక్షణముగా ఉన్నట్లు, మేము భావించుకొని నిన్ను నమస్కరించుచున్నాము. తధాస్తు.

11. సృష్టికర్తకు చేయు ప్రార్ధన: (ఈ దిగువనున్న ప్రార్ధన అన్ని మతముల వారు చేయదగిన ప్రార్థన. ) ఇది క్రీసు ప్రభువు నేర్పిన ప్రార్ధన. దీనిలో క్రీసు పేరుగాని, ఏ అవతార పురుషుని పేరుగాని, ఏ మనుష్యుని పేరుగాని లేదు. అందుచేత 189౩వ సంవత్సరము చికాగో పట్టణములో అన్ని మతములవారు సమావేశమైన మహాసభలో ఇది ఉపయోగించిరి. దీనిలో పరలోకపు తండ్రీ! యని మనందరి తండ్రిని సంబోధించుచున్నాము ఆ ప్రార్థన ఏదనగా.

పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుధ్ధపరచబడును గాక! నీ రాజ్యము మాకు వచ్చును గాక! నీ చిత్తము పరలోకమునందు నెరవేరుచుస్నట్లు భూమియందును నెరవేరునుగాక! మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా యెడల అపరాధములు చేసినవారిని మేము క్షమించియున్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక కీడునుండి తప్పించుము. రాజ్యము, బలము, మహిమ, నిరంతరము నీవియైయున్నవి. ఆమేన్‌. (మత్తయి 6:10-15).

బైబిలు పండితులు వ్రాసిన దీనిలోని ఏడు మనవుల వివరముగా చూడగా దీనిలో మానవుల కోరికలన్నియు గలవవి కసబడుచున్నది. మొదటి పంక్తియు, చివరి పంక్తీయు, స్తుతి పంక్తులైయున్నవి.

ఈఈఈ. మరియొక ప్రార్ధన – దేవా! నాకు కసబడుము, అందరికె కనబడుము, దేవా! నాతో మాట్లాడుము. అందరితో మాట్లాడుమ. తధాస్తు.

ఈ పత్రికలోని స్తుతులు అన్నిటికంటెను, అందరికంటెను గొప్పవాడైన దేవుని లక్షణములను, గురించిన న్తుతులౌటచేత, ఈ ప్రార్థనలు అన్నిటికంటెసు, అందరికంటెను గొప్పవాడైన దేవునికి చేయు ప్రార్ధనలగుటచేత ఇవి తరచుగా వాడు వారు ధస్యులు, మహా సౌఖ్యవంతులు, నిత్వజీవమోక్షార్హులు.

వర్ష ప్రార్థన:
నా నామమునుబట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేతునని ఆయన సెలవిచ్చెను. యోహాను 14:14
అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. యాకోబు 5:18

మింటి దృష్టిగల సహకారులారా! చలవ చలవ!
1. దేవా! నీవు మాకు ఉచితముగా ఇచ్చుచ్చున్న దానములలో ఒకటియగు వర్షదానము నేడు కొదువుగాయున్నది. గనుక ఈ కొదువను తీర్చుమని వేడుకొనుచున్నాము. తండ్రీ! నీ ఆజ్ఞలు నెరవేర్చునప్పుడు “మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని దాని కాలమున కురిపించెదను” అని వాగ్ధానము చేసినావు. నీ వాగ్ధానమును నెరవేర్చుము(ద్వితి 11:14). గాలి తుఫాను వలనగాని, అధిక వర్షము వలనగాని, హాని రానీయకుము. మాకు ఎంత వర్షము అగత్యమో అంత వర్షము కురిపించుము. ధాన్యాదులు సమృద్ధిగా పండించుము ఆమేన్. అనాది దేవా! సృష్ట్యాది నుండి నేటివరకు లోకమునకు వర్షమును ధర్మము చేయుచున్న నీకు అనేక స్తోత్రములు. ఆమేన్.
2. (i)సృష్టికర్తవైన తండ్రీ! గతకాల ఉపకారములకు నీకనేక వందనములు. మాకును జీవరాసులకును దాహశాంతి కలుగునట్లు పొలములు, చెరువులు, తోటలు, ఇతర స్థలములలోని వృక్షములు ఫలించునట్లును, వేడిమి తగ్గునట్లును, చెరువులు, బావులు, నదులు, నిండునట్లును వర్షమును పంపించుము. సమృద్ధిగల వర్షమును పంపుము. ఎక్కడ అవసరమో అక్కడను, ఎంత అవసరమో అంతయును, ఎప్పుడు అవసరమో అప్పుడును, కురిపించుము. (ii) అధిక వర్షమువల్ల మనుష్యలకు, ఇండ్లకు, పశ్వాదులకు, పంట భూములకు, నౌకాదులకు హాని కలుగుచున్నది. కనుక కావలినంత వాన మాత్రమే రప్పించుము. (iii) మేము ప్రార్థించకపోయినను వర్షదానమును గ్రహించుచున్న నీవు, ఇప్పుడు ప్రార్థించుచున్న ఈ సమయమున మా పాపములు క్షమించి, నిశ్చయముగా వర్షదానముననుగ్రహింతువని నమ్ముచున్నాము. తథాస్తు (ఆమేన్).
3. దేవా! మానవులకు ప్రత్యక్షము కవలెనని నరజన్మమెత్తి వచ్చిన దేవా! వచ్చి యేసుక్రీస్తను నామము ధరించుకుని సమస్తొపకారములు చెసిన యేసుక్రీస్తు ప్రభువా! నీకనేక వందనములు. మాకు కావలసిన బోధలు వినిపించి యున్నందుకు, అవి వ్రాయించినందుకు పాపులకు క్షమాపణ, రోగులకు స్వస్థత, మృతులకు పునర్జీవము, భూత పీడితులకు విముక్తి, ఆకలిగలవారికి అద్భుతాహారము, ఆపదలోనున్నవారికి విమోచన అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు. నీవు ఎంత దేవుడువైనప్పటికిని, మా మీదగల ప్రేమచేత మా నరుల మధ్య సంచరించి, వారితో కలిసి మెలిసియుండి, మంచి మాదిరి కనుపరిచిన నీ అద్భుత చర్య నిమిత్తమై నీకు కృతజ్ఞతా స్తోత్రములు. శ్రమ మరణము మూలముగా కూడ, మహూపకారము చేయవలెనని తలంచినావు. గనుక శత్రువులు నిన్ను చంపినప్పుడు సహించుకున్నావు. అయినప్పటికిని, నీవు దేవుడవు గనుక సమాధిలో నుండి లేచి వచ్చి, భక్తులకు నలువది దినములు దర్శనమిచ్చావు. అప్పుడు మహిమ శరీరముతో మోక్షలోకమునకు వెళ్ళినావు. మరల సజీవ భక్తులను తీసుకొని వెళ్ళుటకై, త్వరలోవచ్చి నీ వాగ్ధానము నెరవేర్చుకొందువు స్తోత్రము. మమ్ములను సిద్ధపర్చుము. మాకిప్పుడు వర్షము మిగుల అవసరుముగానున్నది, కురియించుము. తథాస్తు (ఆమేన్).
4. యేసు ప్రభువా! నీవు లేకుండా ఏమియు కలుగలేదని బైబిలులో వ్రాయించిన తండ్రీ! నా నామమందు మీరేమి అడిగినను చేతునని వాక్కిచ్చిన దేవా! ఆకాశము నుండి భూమిమీదకు వర్షమును కుమ్మరించుమని వేడుకొనుచున్నాము. నీకనేక స్తోత్రములు. ఆమేన్
5. అనాది దేవా! సృష్ట్యాది నుండి నేటివరకు లోకమునకు వర్షమును ధర్మము చేయుచున్న నీకు అనేక స్తోత్రములు. దేవా! సమస్తమును మమ్మును కలుగజేసిన తండ్రీ! మాకిప్పుడు వర్షము మిగుల అవసరముగా ఉన్నది కురియించుము ఆమేన్.
గమనిక: (i)ఉన్నటువంటి ప్రార్థనలు చేయ వీలులేనివారు, దినమునకొకసారి కొతసేపైనను ఏకాంతముగా కూర్చుని, వర్షము వచ్చునట్లు ఏమి చేయవలెనని, జ్ఞానశక్తితో ఆలోచించుట యుక్తమైనది. ఏమి చేయవలెనో అప్పుడు, మనస్సక్షికి అనుగుణ్యమైన జ్ఞానమునకు బైలుపడును. ఆలోచించుట వలన మనుష్యులెంత గొప్ప పనులు చేయుచున్నారో జ్ఞాపకము చేసికొండి. ప్రియులారా! ఈ ప్రార్థనలు భోజన సమయమందు అనుదినమును చేసిచూడండి ఇదియే మా మనవి. దేవా! అని ప్రార్థించువారికి యేసుక్రీస్తు ప్రభువు బైలుపడును.
(ii) నెరవేర్పు కలుగువరకు ప్రతి కుటుంబములోను, అనుదినము ఇట్టి ప్రార్థనలు చేయండి,ఆలోచించండి. మేమిదివరకు ఇట్టి పత్రికలు అచ్చువేసి పంచినప్పుడు వెంటనే వర్షము అద్భుతముగా కురిసినది. మరియొకప్పుడు ప్రచురింపక ముందే వర్షము వచ్చినది దేవునుకు కృతజ్ఞతార్పణములు. మీకు శుభము కలుగును గాక! ఆమేన్.

నీటి కొరకైన ప్రార్థన:దయగల ప్రభువా! మాకిప్పుడు ( మీ గ్రామము (ఊరు) పట్టణము పేరు) నీటి ఇబ్బంది ఉన్నది. హాగరుకు నీటి ఇబ్బంది ఉన్నది. హాగరుకు నీటి ఇబ్బంది కలుగగా ఎలుగెత్తి ఏడ్చినది. అదే పరిస్థితి మా గుంటూరుకు వచ్చినది. నీరు దొరుకు చున్నది గాని సరియైన నీరు దొరుకుటలేదు. హాగరుకు దొరికిన నీరు దొరుకుట లేదు చిన్నపిల్లల మొర ఆకాశమునకు వినబడునన్నావు. ఎవరైనా నీ సృష్టే. హాగరు నీ బిడ్ద గనుక నీవు నీళ్ల ఊట చూసావు. మేమును నీ బిడ్దలమే. గనుక మాకును అటువంటి నీటి ఊటలమ చూపుము. అయితే హాగరు ఎలుగెత్తి ఏడ్చివది. మేము ఏడ్చుటలేదు. నీటి ఇబ్బందినిగూర్చిన ప్రార్ధన అని ఒక పత్రికను వ్రాసినాము. దీవించుము. ఒక పిల్ల మొరను వినియున్నావని ఉన్నది. అలాగే మా మొరనుకూడ వింటావు మమ్మును రక్షెంచు నిమిత్తమై మా మొర ఆలకించుము. అందరు నీ బిడ్డలు అనగా ఏర్పాటుటు బిడ్డలు కాదుగాని సృష్టినిబట్టి నీ బిడ్దలే. గనుక దీవించుము. ఆమేన్.

గొలుసు ప్రార్ధన

“మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి” యాకోబు 5:1 6.

ఈ ప్రార్థన వేకువఝామున సుమారు మూడుగంటల సమయము లేచి మోకాళ్ళమీద ఉండి పది నిమిషములు స్తుతిచేసి, ఆ మీదట ఈ ప్రార్థన చేసిన యెడల శరీరమంతటికి, అవయములన్నింటికకి ఆత్మసంబంధమైస ధైర్యం శౌర్యము అలుముకొని, అనారోగ్యము అంతరించి ఆరోగ్యము అభివృపొందును. నానాటికీ శరీరములో ఉన్న క్షయమైన స్థితి లయమై అక్షయమై స్తితి అలుముకొని ఆరోహణమునకు సిధ్ధపడగలరు. రాకడ విశ్వాసము వృద్ది చెందును. పెండ్లీకుమార్తె ధరించు ఆభరణములచేత అలంకరింపబడుదురు.

ప్రార్థనలు: 1. దేవా! నాకు కనబడుము. నాతో మాట్లాడుము. అందరికి కనబడుము. అందరితోను మాట్లాడుము ఆమేన్. ప్రభువైన యేసూ! త్వరగా రమ్ము. మరనాత. దేవునికి స్తోత్రము.

2. దేవా! నాయందు శుద్ధహృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్తిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నాయెుద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము. సమ్మతిగల మనసును కలుగజేసి నన్ను ధృఢపరచుమ. అప్పుడు అతిక్రమమ చేయువారికి నీ త్రోవలను భోధించెదను. పాపులును నీ తట్టు తిరుగుదురు.

౩. ఓ తండ్రీ! గర్వహృదయము, అహంకార దృష్టి, కల్లలాడు నాలుక, అబధ్ధములాడు పెదవులు, నీకు హేయములు, గనుక వాటిని నాలోనుండి తీపిక్ట్‌సి, వాటి పాపములను శుద్ధీకరించి, ఆ పాపములలో వినయము, సాత్వికము, సత్యము, నీతిని అమర్చి స్ధిరపరచుమని వేడుకొమచున్నాము.

4. తండ్రీ! నేను నిత్య జీవమునకు వారసుడనగునట్లు, నిత్యము నాలో సంతోషము, సమాధానము, ఆనందము సమృద్ధియైన ధవవిధిగా నింపుమని యేసుప్రభువు వారిద్వారా వేడుకొనుచున్నాము.

5. ఓ నాయనా! మీరు పరలోకమునుండి పంపించే పావన వర్తమానములమ నేను అవలీలగా అందుకొని అర్ధము చేసికోగల ఏకాంత స్థితి సనుగ్రహించుమని యేసుప్రభువు వారిద్వారా వేడుకొనుచున్నాను.

6. ప్రభువా! సాత్వికము, సహనము, సహింపు అను మూడు ‘ఆయుధములను నా విశ్వాస హస్తములలో అమర్ఛిపెట్టండి. ఈ మూడు ఆభరణములను నా నిరీక్షణ కంఠమునకు ధరింపచేయండి. ఈ మూడు పదార్ధములతో నా బలహీన హృదయమును బలపరచి విశాలపరచండి. ఈ మూడు సుగంధములతో నా హృదయ కాఠిన్యమును, నా మనసు మాలిన్యమును, నా బుద్దిమాంద్యముసు, నా గుణహేనతను శుద్దీకరించమని వేడుకొనుచున్నాను.

7. ఓ తండ్రీ! నాకు మౌనమును, విషయమును, దీనమనస్సును, ధృఢమైన మనస్సును, స్థిరమైన మనస్సును, సమ్మతిగల మనస్సును దయచేయుమ. దయచేసి నేను మాట్లాడునప్పుడు నెమ్మదిగాను, మితముగాను మాట్లాడగలిగిన దివ్యమైన స్థితి దయచేయుమని యేసుప్రభువు వారిద్వారా వేడుకొనుచున్నాను.

& ఓ యేసూ, తండ్రీ! మీ సత్యమే నా జీవము, మీ జీవమే నా ప్రాణము, మీ శరీరమే శాకాహారము, మీ రక్తమే నా పాపము, మీ పాదమే నా శరణము, మీ సన్నిధే నాకాశ్రయము, మీ వాక్యమే నాకద్దము.

9. సైతానా! దేవుడగు యేసుక్రీస్తు నాలో నివసించుచున్నారు. నీకు చోటులేదు. మరణమా! జీవముగల యేసుక్రీస్తు నాలో నివసించుచున్నారు. నీకు చోటులేదు. లోకమా! వాక్యమగు యేసుప్రభుపు నాలో నివసించుచున్నారు. నీకు చోటులేదు.

1ఒ. త్రియేకుడవైన తండ్రీ! మీరు దయచేసిన ధన్యగుణములను నేను పొందుటకును, మీరు అనుగ్రహించిన కృపావరములు పొందుటకును, మీరు దాచియుంచిన ఆత్మఫలములు నేను ఫలించుటకును, లోకనాధులను ఎదిరించుటకును, అంధకార శక్తులను బంధించుటకును, చీకటి శక్తులను పారద్రోలుటకును, మాటయందు తప్పని స్థితి కలిగియుండుటకును నన్ను అర్హునిగా చేయండి. మీరిచ్చు సమస్తము పరిఫూర్ణముగా పుచ్చుకొనుటకు అర్హునిగా చేయండి. పొందిన దానిని పోగొట్టుకొనకుండ ఉండే వరము దయచేయండి. పొందుటకున్న ఆటంకములు ఛేధించి, అనర్హతలను తీసివేసి త్రియేకుడవైన తండ్రీ మీరే నా లోపల స్థిరనివాసము చేయుచూ, నన్ను నడిపించి ఏలండి. మీలోపల నాకు స్థిర నివాకసము ఏర్పరచి నన్ను మరుగుపరచి మీరే నా కార్యక్రమములన్నింటిలో ఘనత, కీర్తి, మహిమ పొందుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.

అనుదినము చేయవలసిన ప్రార్థన

1. సర్వశక్తీగల దేవా! అనేకమంది రోగులను బాగుచేసినాపు మమ్ములను కూడ బాగుచేయుము.

2. అనేకమంది అనారోగ్య వంతులకు ఆరోగ్యమిచ్చినావు మాకు కూడా ఆరోగ్యము దయచేయుము.

౩. అనేకమందికి వ్యాధి లేకుండ చేసినావు. మాకు కూడా వ్యాధి లేకుండ చేయుము

4. అనేకమందికి నీ వాక్యము వినిపించినావు. మాకును నీ వాక్యము వినిపించుము, బోధించుము.

5. అనేకమందికి నీ వాక్యప్రకారము నడుచుకొను శక్తీ ఇచ్చినావు. మాకు కూడా అట్టే శక్తీ ఇమ్ము.

6. అనేకమరింకి ఏదో ఒక వరమిచ్ఛినాపు. మాకు కూడా నీకిష్టము వచ్చిన వరము ఇమ్ము.

7. అనేకమరింకె నీ సేవచేయు సమయము, శక్తీ ఇచ్ఛినావు. మాకు కూడా అట్టే సమయము శక్తీ ఇమ్ము.

8. అనేకమరింకి నీ సన్నిధిలో సమస్త అంశముల ప్రార్ధనలను చేసే సమయమునిచ్చినావు. మాకు కూడా అట్టి తరుణము దయచేయుము.

9. అనేకమంది ద్వారా నీవు కీర్తి పొందినావు మా ద్వారా కూడా కీర్తి పొందుము

10. అనేకమందికి శత్రుబాధ తొలగించినావు. మాకు కూడ శత్రు బాధ తొలగింపుము.

11. అనేకమరింని విష సంబంధమైన పురుగులనుండి, దుష్ట మృ గములనురిడి ఏప్పిరిచినావు మమ్ములను కూడ వాటి నుండి తప్పించుము.

12 అనేకమందిని అవమానము నుండి తప్పించినావు. మమ్ములను కూడ తప్పించుము.

13 అనేకమందిని శీతోష్నాది బేధముల నుండి తష్పించినావు. మమ్ములను కూడ తప్పించుము

14 మమ్మును ఏ ఉద్దేశ్యముతో కలుగజేసినావో ఆ ఉద్ధేశ్యమును నెరవేర్చు వరకు మమ్ములను విడిచి పెట్టకుము.

15.అనేకమందికి ఉన్న ఆటంకములను తొలగించినావు, మాకుకూడ ఉన్న ఆటంకములను తొలగించుము.

16.మాలో ఎవరికి మరణము అవసరమో వారికి నెమ్మదిగల మరణమిమ్ము.

17. మాలో ఎవరు రెండవరాకడకు సిద్ధపడవలెనో వారిని సిద్ధపర్చుము.

18. మా దర్ధునములన్నియు నెరవేర్చుము. మా మంచి ఊహలు, కోర్కెలు నెరవేర్చుము.

19. మా జీవిత కాలమంతయు నీ తలంపుతో నింపుము.

21. మేము మా సాధనలో ఏవి విడిచిపెట్టినామో, అవికూడ నీకు సమర్పించుచున్నాము.

22. మరియు మమ్ములను, సర్వజనులను, మృగాదులను, పక్షులను, వృక్షాదులను, నీ సర్వసృష్టిని కాపాడుము.

23. ఎప్పటికప్పుడే సాతాను యొక్క క్రియలను లయము చేయుము.

24. మా జీవిత కాలమంతయు, నీ దేవదూతల యొక్క సహాయమును అగ్రహింపుము.

25. మా అజ్ఞానము, మా అయోగ్యత, మా పాప స్థితి ఎప్పటికప్పుడే తొలగించుము. పరిశుద్ధ స్ధితిలో స్ధిరపర్చుము.

26. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుడవైన నీవు, మాకు ఇచ్చిన వాటిలో ఏమియు పోగొట్టుకొనకుండ కాపాడుము.

27. అన్ని మంచి విషయములలో మాకు సమృద్ది కలుగజేయుము.

28. మేము భూలోకములో ఉన్నప్పటికిని మా పేర్లు పరలోకములో నీ కుమారుని ద్వారా రిజిష్టరు చేయుము.

29. ఆయన ద్వారా నీకు అది స్తుతి, మధ్య స్తుతి, జీవాంత స్తుతి, కష్టకాల స్తుతి, ఆనందకాల స్తుతి, ఏమియు తెలియక తోచకయుండు కాలమందలి స్తుతియు, మా ఘటముయొక్క స్తుతియు, మా జన్మము మొదలుకొని కడవరి భూలోక నిమిషము వరకు ఋణపడే స్తుతియు, పరలోక స్తుతియు, అంగీకరించుమని మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము. ఆమేన్.

ప్రేమగల తంద్రీ! మా మీదనుండి గడిచిపోయిన రాత్రికాల విపత్తులనుండి కాపాడి, ఈ ఉదయమున మమ్ములను లేపి, మరియొక దినము అనుగ్రహించనందుకు నీకు వందనములు. ఆమేన్.

సృష్టికర్తవైన తండ్రీ! నేటి దినమున నేను చేయవలసిన పనులలో నాకు తోడైయుండుటకు నీవు కూడ నాతో కలిసి పనిచేయు తండ్రివైయుండుము. ఆమేన్.

ప్రభువా! మా ప్రవర్తన వలన నేటి దినమును పరిశుద్ధ దినముగా బైలుపరచుకొను ప్రవర్తనా శక్తీ కలిగించుము. ఆమేన్.

దేవా! ఈ దినమున నీవు నాకు ఏమి చెప్పనైయున్నానో అది నాతో చెప్పుము. ఆమేన్.

రక్షకుడవైన దేవా! ఈ దినమందు మమ్ములను వేటినుం రక్షింపవలెనో వాటినుండి రక్షింపుము. ఆమేన్.

మా కాపరివైన ప్రభువా! మమ్మును యే దారిని నడిపింప దలచుకున్నావో ఆ దారిని నడిపింపుము. ఆమేన్.

దానకర్తవైన ప్రభువా! మేము అనుభవించుటకు ఈ వేళ మాకు ఏమి అందించెదవో, అవి అందుకొనే సమర్ధత దయచేయుము. ఆమేన్.

ఓ దేవా! కుటుంబమున చాలామందికి బిడ్డలను ఇచ్చినావు. సంతోషమే, కాని వారికి మంచి లక్షణములు ఇమ్మని వేడుకొనుచున్నాము. వారిని భక్తి మార్గములో పెంచుటకు తల్లిదండ్రులకు శక్తీకూడా ఇమ్మని వేడుకొనుచున్నాము. పిల్లలు సరియైన స్ధితిలో లేనప్పుడు వారిని ఎట్లు మళ్ళింపవలెనో నేర్పుము. బాగా ఉన్నప్పుడు నడిపించుట సుళువే. అప్పుడు తల్లిదండ్రులకు అంత పని ఉండదు. పిల్లలు తప్పుదారి నడిచేటప్పుడు వారిని మళ్ళించే గొప్ప పని ఉండును. తల్లిదండ్రుల భక్తి, జ్ఞానము, మనస్సాక్షి, శరీరబలము, సమయము వాడుకొనుటకు అదే మంచి సమయము. కాబట్టి అందరికి అట్టి తరుణము దయచేయుము. అబ్రహాము ఎవ్వరిమీద కోప్పడినట్లు లేదు, అతనితో ఉన్నవారు సరిగా ఉన్నారు, గనుక కోప్పడవలసిన అవసరము లేదు దిద్దవలసిన అవసరము లేదు. నేటికాలపు పిల్లలు క్రమము తప్పినారు. తల్లిదండ్రులు వారిని మళ్ళించుటకు ఎక్కువ కష్టపడవలెను అది వారికి దయచేయుము పిల్లలు “చెప్పిన మాట వినరు” అని నీ వాక్యములో (2 తిమోతి 3:2) పౌలుచేత వ్రాయించినావు గదా! అది ఇప్పుడు నెరవేరు చున్నది. గనుక బాగుచేయుట కూడ నెరవేరవలెను. పిల్లల విషయములో ఫూచి తల్లిదరిడ్రులే గనుక తమ విధి తామే నెరవేర్ఫుకొనవలెను. శక్తిగల ప్రభువా! ఓ ఎల్ షధ్ధాయ్‌! వారికి శక్తీ దయచేయుము. నడుపుటకు, నడుచుటకు ఈ రెండు శక్తులు దయచేయుము. ఆమేన్.

ఒక ఇంటిలోనికి వ్యతిరేకమైన శక్తి వచ్చునప్పుడు దానిని ఎదిరించుటకు పరలోకము నుండి, ఎల్ షద్ధాయ్‌ నుండి శక్తీ రాకమానదు.

1. దయగల తండ్రి! కుటుంబములో పిల్లలు ఒక శాఖకు స౦బ౦ధి౦చి యున్నారు. ఆ శాఖ పేరు సర్వస్వతంత్ర శాఖ. అందుచేత తల్లిదండ్రులు చెప్పిన మాట వినక, తమకు తోచిన ప్రకారము చేస్తారు. అందుచేత తల్లిదండ్రులకు బాధ. ఇది అనేక పర్యాయములు జరుగుచుస్నది. ఈ కుటుంబములలో అట్టిది జరగకుండా చేయుమని మా ప్రార్థన. అబద్ధము నిజము వలె ఎరితో నిజముగా ఉన్నట్లు ద్బఢముగా చెప్పెదురు ఇది పరిహరింపుము.

3 ఇంటిపట్టున ఉండక తమకు ఇష్టమైన చోట్లకు వెళ్ళుదురు. ఇది కూడ పరిహరింపుము.

4’ “బడికి వెళ్ళవలపినది” అని చెప్పి పంపించగా, ఎక్కడికో వెళ్ళి “ఇప్పుడే బడి అయిపోయినది” అని చెప్పుదురు. ఈ దుర్దుణమును పరిహరింపుము.

5. బడిలో పాఠములు సరిగా నేర్చుకొనక ఫెయిల్ అయితే నిన్ను దూషింతురు. ఇది కూడ పరిహరింపుము.

6. ఇంటిలో ఏదైన ఎత్తుకొనిపోయి అమ్ముకొందురు. స్నేహితులకు పంచి పెట్టుదురు. పొరుగూరు వెళ్ళుదురు. ఎందుకు ఈలాగు చేసితిరని అడిగితే మాకు “వెళ్ళుమని” స్వరము వినబడినది అందుచేత వెళ్ళినాము అని అందురు. వినబడటం నిజమే కాని, అది దురాత్మ చెప్పెనని వారికి తెలియదు. అది వారికి తెలియజెప్పుము.

7. వారిని తల్లిదండ్రులు శిక్షించితే మరింత మొద్ధుబారుదురు. ఈ మొండితనము పరిహరించుము.

& ప్రార్ధనలో యుండవలెను. బైబిలు చదువవలెను కీర్తనలు పాడవలయునని చెప్పితే “నీవు చెప్పినట్లు చేయు బుద్ది మాకు కలుగుట లేదు” అని అరిదురు. ఈ దుర్గుణమును గూడ పరిహరింపుము.

9. మీలో దుర్మార్దత ఉన్నది అని చెప్పితే, ఏ మాత్రము నమ్మరు. ఓ ప్రభువా! ఈ కాలమందు సాతాను కొందరికి మతి చాంచల్యము కలిగించు వున్నాడు. కొందరిని ఎక్కడికో తీసికొని వెళ్లి అక్కడ పరుండబెట్టుచున్నాడు. వారికి తెలియదు. మరియు పిశాచి భిక్షకుని వలె కనబడి, కొంతమందికి మాయ మాటలు చెప్పిన క్రైస్తవులు యేసుప్రభువే అని భ్రమపడుదురు, పరీక్షింపకుండా భిక్షము చేయకూడదు. మరియు అనవసరముగా అతడు భయము పుట్టించును. జాగ్రత్తగా ఉండవలెను.

ఆరుదినములు పనిచేసి ఏడవ దినమున విశ్రమించిన సృష్టికర్తవైన నా దేవా! నీకు స్తోత్రములు. మాకుకూడ ఈ లోకములో విశ్రాంతి ఏర్పరచినావు పగలు అంతయు పనిమీదనున్న మాకు విశ్రాంతి కలుగునట్లు రాత్రి సమయమును ఇచ్చినాపు. ఇప్పుడు పరుండబోవుచున్నాము. సుఖనిద్ర కలిగించుము. ఆమేన్.

లోకములో మా జీవితకాలమంతా పనిచేసిన తరువాత పరలోకమందు మాకు నిత్య విశ్రాంతి నియమించినావు. అది తలంచుకొని అది కడవరి తలంపుగా తలంచుకొని పరుండబోవుచున్నాము. ఆలకించుము ఆమేన్. దీవించుము. ఆమేన్.

నా ప్రియుడవైన తండ్రీ! నా శరీరము, నా ఆత్మ, నాకు కలిగిన సమస్తము నీకు అప్పగించి నేను నిద్రపోవుటకు వెళ్ళిపోవుచున్నాను, అంతయు నీవే చూచుకొనుము ఆమేన్.

సర్వజన జనకుడా! నేను, మా వారు నిద్రమీద నున్నప్పుడు నీ పరిశుద్ధ దూతలను మా చుట్టు కావలిగాయుంచుము. ఆమేన్.

ఓ తండ్రీ! నా తండ్రీ! నన్ను ప్రేమించే తండ్రీ! నేను మీకు ముద్దాయిగా ఉంటాను గనుక ఉదయమున నేను లేవకముందు నీవు వచ్చి నన్ను పరలోకమునకు తీసుకొని వెళ్ళిన అది నీ ప్రేమయే గనుక వందనములు ఆమేన్

కాపాడే తండ్రీ! విమోచకుడవైన తండ్రీ! చీమలు, దోమలు, ఈగలు, జెర్రిలు, తేళ్ళు, పాములు, జంతువులు, దొంగలు, మాకు హాని కలిగించే దయ్యములు, మాయెుద్దకు రాకుండ కాపాడుము. ఆమేన్.

7. మేము మా కన్నులు మూసికొనియుండగా నీ కన్నులు తెరచి మమ్మును చూస్తూయుండే తండ్రి! నీకు స్తోత్రములు. ఆమేన్. మంచి ఆలోచనలు, మంచి కలలు, నీ చిత్తమైతే మంచి దర్శనములు మాకు సంభవించేటట్లు కృప దయదేయుము, ఉదయమున శ్రమతీరి సుఖముగా లేచుసట్లు కృప దయచేయుము. ఆమేన్.

1. మా పోషకుడవైన తండ్రీ! మేము జీవించువట్లు ఆహారమును ఒక్క పదార్ధముగా ఇచ్చినందున నీకు వందనములు మేము భోజనము భుజించుట వల్ల నీకు కీర్తి రావలయునని కోరుచున్నాము. ఆమేన్‌

2. పోషకుడవైన తండ్రీ! మేము ఆహారమును సంపాదించే శరీరము నీవు మాకు దయచేస్తే, నీవు ఏర్పరచిన ఆహార పదార్ధములు సంపాదించగలము. అవి మాకు సమృద్దిగా దొరికేటట్లు నీ దీవెన దయచేయుము. ఆమేన్.

3. పోషకుడవైన తండ్రీ! ఈ ఆహారము వల్ల రెండు మేళ్ళు దయచేయుము. మొదటిది అనారోగ్య నివారణ, రెండవది ఆరోగ్యార్ధమైన బలము, పుష్టి, జ్ఞానము, ఆయుష్షు: ఇవి దయచేయుమని వేడుకొనుచున్నాము ఆమేన్.

4. పోషకుడవైన తండ్రీ! ఈ శరీరాహారము భుజించునప్పుడు మా ఆత్మకు నీవు ఇచ్చుచున్న ఆత్మాహారము మాకు జ్ఞాపకము చేయుము. అప్పుడు మాకు రెండు సంతోషములు. ఆమేన్.

5. పోషకుడవైన తండ్రీ! వివాదము, భయము, దిగులు, అమమానము, అసహ్యము కలిగించు విషయములను భోజన సమయమందు మా మనస్సులోనికి రానీయకుము గాని సంతోషము కలిగించే సంగతులు మాత్రమే రానిమ్ము. ఆమేన్.

6. పోషకుడవైన తండ్రీ! లోకములో అనేకమంది బీదలున్నారు. వారికి ఆకలి తీర అన్నము దొరకదు. వారిని కనిపెట్టుము. అన్నదాన సమాజములను వర్ధిల్లచేయుము. ఆమేన్.

“నాకేమి కొదువ నాధుదుండ” అనే కీర్తన భోజన సమయమందు పాడుకొనవలయును. “పగవారల్ సిగ్గు” అనే చరణముకూడ పాడుకొను కృప మాకు దయచేయుము, ఆమేన్.

వేదపఠనము చేయ పూర్వము చేయవలసిన ప్రార్ధన

1. వాక్యమును వ్రాయించిన తండ్రీ! నేనిప్పుడది చదుపభోవుచున్నాను. దీనిలోనుండి నాతో మాటలాడుము. నీ మాట నాకు వినబడునట్లు చేయుము. ఆమేన్.

2.పరిశుద్ధుడవైన దేవా! నీ పరిశుద్ధ గ్రంథములో వ్రాయించిన వ్రాతలు నా హృదయములో కూడ వ్రాయించుము. ఆమేన్.

3. మంచి ఊహలు కలిగించే తండ్రీ ! నీ వరిశుధ్ధ గ్రంథము చదుపుకొనున్నప్పుడు లేనిపోని ఊహలు రానియ్యక నీవు ఉద్దేశించిన ఊహలు మాత్రమే రానిమ్ము. ఆమేన్.

4. మాకు కనబడవలెనని కోరే తండ్రీ! నీ వాక్యములో మాకు కనబడుము. నీ హృదయమును మా హృదయమునకు కనబరచుము. ఆమేన్.

5. జ్ఞాన స్వరూపివైన తండ్రీ! నీ పత్రములోనున్న విషయములు నేను చదివిన తరువాత వాటిని మరువకుండా నా హృదయమరిదు భద్రము చేసికొనే శక్తిని వృద్ది పొందించుము. ఆమేన్.

6. నిత్యుడవైన తండ్రీ! భూమ్యాకాశములు గతించినను నీ వాక్యము మాత్రము గతింపదు. అట్టి నీ వాక్యము అంతయు నా యొక్క (లేదా) మాయెుక్క జీవితములో సరుదుకొనునట్లు (ఆవరించునట్లు) వీ పరిశుద్ధాత్మ యొక్క వెలిగింపు కలిగింపుము. నీ వాక్యగ్రంథము నీ గ్రంథవాక్యము, నీ భక్తులకు ఉత్తమ లేఖనముగా వినిపించి వ్రాయించిన నీ పరిశుద్ధాత్మ నాలో కూడా అట్టి పని చేయునట్లు, విద్యార్ధులు వ్రాత పుస్తకములో సిద్దపరచురీతిగా, మా అంగీకార స్వభావమును కూడ సీద్దపరచుము. ఆమేన్.

7. పోషకుడవైన తండ్రీ! నీ వాక్యమును మానవ బోధకులు కలహ కారణమగు భేదాభేదములైన బోధనలుగా ఉపదేశించుచున్నారు. కాబట్టి సరియైన అర్ధము మాకు తెలుపుము. ఆమేన్.

1. ఓ దేవా! నా తండ్రీ! నేను ప్రార్థన చేసుకొనేటందుకు ఈ సమయమును దయచేసినందుకు అనేక వందనములు.

2. నీవే సమస్త కలుగజేసిన తండ్రివైయున్నాపు. నీవే మాకు అన్నవస్రాదులిచ్ఛి పోషించే కర్తవైయున్నావు. నీవే మా పాపములు పరిహారము చేసే రక్షకుడవైయున్నావు. నీవే నన్ను పాపములో పడకుండ కాపాడే కర్తవైయున్నావు. నీవే నాకు నీ వాక్యము నేర్పిరిచే, బోధించే బోధకుడవై యున్నావు. నీవే నన్ను చిక్కులలో నుండి తప్పించే ఆదరణకర్తవైయున్నావు. నీవే నా జబ్బులు బాగుచేసి ఆరోగ్యమిచ్ఛే వైద్యుడవైయున్నాపు. నీవే నాకు అన్నిటిలో ఆధారమైయున్నావు. నీవే నాకు మోక్షమిచ్చే శక్తిమంతుడవైయున్నావు. కాబట్టి నీకనేక నమస్కారములు చెల్లించుచున్నాము.

3. ఓ దయగల తండ్రీ! పన్నును, నా న్వజనులను దీవించుమని వేడుకొనుచున్నాము.

4. నా పాపములు క్షమించుము. నా తలంపులలో పాపములు లేకుండా చేయుము. నా చూపులో పాపము లేకుండా చేయుము. నా వినడములో పాపము లేకుండజేయుము. నా మాటలలో పాపములు లేకుండ చేయుము. నా క్రియలలో పాపములు లేకుండా చేయుము.

5. పాపములను విసర్థించే శక్తీ నాకు దయచేయుము.

6. నిన్ను గురించిన సంగతులు ఎవరిచేతనైనను, నాకు తరచుగా చెప్పించుచుండుము. అలాగే పుస్తకములలో నిన్ను గురించిన సంగతులు చదువుకొనే జ్ఞాన, హృదయము దయచేయుము,

7. నేను బ్రతికినంతకాలము నీ భక్తి మీద ఉండగల మనస్సు దయచేయుము.

8. ఈ లోకములో నేను బ్రతుకవలసిన బ్రతుకు అయిపోయినపిమ్మట నన్ను నీ యొద్దకు క్షేమముగా చేర్చుకొనుము. ఓ యేసు క్రీస్తు ప్రభువా! నీవే నాకు సర్వములోసర్వమైయున్నావు. గనుక నీకనేక స్త్రోత్రములు.

ఓ దేవా! పాపము నీవు కలుగచేయలేదు. దయ్యాలను నీవు పంపలేదు, జబ్బులు నీవు పంపలేదు. ఇబ్బందులు, కరువులు నీవు పంపలేదు,భూకంపము, పిడుగు ఇవి మసుష్యులకు కలుగడము నీకిష్టములేదు. సాతాను చేసిన పాపము వలననే ఇవన్నీ కలుగుచున్నవి. నీవు నాకు కీడుచేసే దేపుడవు కావు. నీకనేక వందనములు. ఓ యేసుప్రభువా! నేనెల్లప్పుడు నిన్నుబట్టి నిలువబడే కృప దయచేయుమని మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాను. ఆమేన్.

ఓ దయగల తండ్రీ! లోకములోనున్న ప్రతివారియెుక్క జన్మదినము గొప్పదైయున్నది. నీవు ఏర్పాటు చేసిన వ్యక్తులు ఎప్పుడు జన్మించవలెనో, అప్పుడే వారిని జన్మింపజేసినాపు. ఒకరియెుక్క జన్మచరిత్ర బైబిలులో అద్భుతరీతిగా వ్రాయించినావు. యిర్మియా 1:4 ఆయనయెుక్క తల్లి గర్భములో ఉండగానే ‘నిన్ను ఏర్ఫర్చుకున్నాను’ అని అన్నావు. ఆ మాట ఎవరిని గురించి లేదు. పౌలు, పేతురులను గురించికూడ లేదు. గొప్ప ప్రవక్తయిన యెషయాను గురించికూడ లేదు. యెషయా గ్రంథము ముందు చదివి, ఆ తరువాత 4 సువార్తలు చదివినవారు తేడా లేదని ఆనందిస్తారు. అటువంటి ఆయనను గురించికూడ ఈ మాట చెప్పలేదు. దయగల ప్రభువా! నీ కుమార్తెను (లేక) నీ కుమారుని ఏ ఉద్దేశముతో ఈ లోకమునకు పంపి, బైబిలు మిషనులో చేర్చినావో ఆ నీ ఉద్దేశమును సంపూర్తిగా నెరవేర్చుకొనుము, నెరవేర్చుటవల్ల నీవు మహిమపొందుము. జన్మమున్న ప్రతివారికిని మరణమున్నది. ఉండి తీరాలి. అయితే ఈ కడవరి దినములలో రాకడకు ముందు అనేకమందికి మరణముండదు అని సువార్తవల్ల తెలుస్తున్నది. గనుక ఈ ణి కుమార్తెను, (లేక) నీ కుమారుని ఆ శాఖకు సిధ్ధపర్చుము. తన కుటుంబములో నున్న ప్రతివారిని దీవించుము. తవ కుటుంబములో మొలచిన సన్నిధికూటమును వృద్దిలోనికి తీసికొని రమ్ము. ఇంకను ఈమెవల్ల జరుగవలసిన వాక్యములు ఏమున్నవో అవన్ని జరిగించి మహిమపొందుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్.

త్రియేక దేపుడవైన తండ్రీ! ఎన్ని కోట్ల మంది ఎన్ని మనవులు చేసినను నీవు సుళువుగా నెరవేర్చగలవు. గనుక నీకు స్తోత్రములు. ఈ కూటములో ఎన్నో కోట్లమంది లేరు. ఎన్నో కోట్ల మనపులు లేవు. కొద్దిమంది, కొన్ని ప్రార్ధనలు ఉన్నవి, ఇవి నెరవేర్పలేవా! నెరవేర్చెదవని వమ్మితే నెరవేర్ప గలవు. కొంతమంది యొక్క హృదయములో వారిని విడిచిపెట్టని పాపములు గలవు. ప్రార్థిన్తున్నారు. వాటిని వదలించగలపు. నీకు స్తోత్రములు. ఆత్మ స్తితి యీలాగుండగా, కొందరికి శరీరములో అనారోగ్యము గలదు. అది వారిని వదిలిపెట్టకుండ నున్నది. నీవు వదలింపగలపు. నీకు స్తోత్రములు. కొందరి విషయములలో కొదువలు గలవు. అవి వారిని వదలకుండా నున్నవి. కాని నీవు వదిలింపగలవు గనుక నీకు స్తోత్రములు. ఇక్కడున్న వారిలో కొందరికి సంతానము లేదనే విచారమున్నది. అది వారిని వదలకుండా నున్నది. నీపు వదిలించగలపు. నీకు స్తోత్రములు. మరికొరిదరిని కొన్ని విషయములలో దురాత్మ పీడించుచున్నది. నీవు వదిలింపగలపు నీకు స్తోత్రములు. కొందరిలో రకరకములైన చిక్కులున్నవి అవి వారిని వదిలిపెట్టడములేదు. నీవు వదిలింపగలపు. కాబట్టి నీకు స్తోత్రములు. కొందరిలో తమ స్వజనుల యొక్క కష్టముల నివారణ కొరకైన ప్రార్ధసలున్నవి. నెరవేరనివి ఉన్నవి. అవి వారిని వేదించుచున్నవి. అవి వారిని వదలడములేదు. నీవు వదిలింపగలపు. నీకు స్తోత్రములు. కొందరిలో రక్షణను గురించియు, పెండ్లికుమార్తె వరుసను గురించియు, రాకడను గురించియు, అప్పుడప్పుడు సందేహములు వచచ్చి ముందుకు సాగి వెళ్ళుచున్న వారిని వెనుకకు లాగుచున్నవి. ఆలాగడమును వారు తప్పెంచుకొనలేకపోవుచున్నారు నీవు తప్పించగలపు. గనుక నీకు స్తోత్రములు.

ఇప్పుడు ఉదహరించినవి కాక ఇతర కష్టములు గలవారు కూడ గలరు. తృప్తిలేనివారు, సమాధానము లేనివారు, శాంతిలేనివారు, నెమ్మది లేనివారు, ఏమి చేయవలెనో తోచనివారు, ఎంత చెప్పినను నచ్చని వారు మొదలగు వారిని గురించికూడ ప్రార్థించుచున్నాము. వారిలొ నున్నవి విదిల్చివేసి శాంతి కలుగజేయగలవు. నీకు స్త్రోత్రములు ఎవరైతే స్వస్ధాసమునకు వెళ్ళవలసి ఉన్నారో వారికి దూతయొక్క సహాయముమ అసుగ్రహించి, సురక్షితముగా తీసికొని వెళ్ళుదువని నమ్ముచున్నాము, నీకు స్తోత్రములు. ఇక్కడ నేర్చుకొన్న విషయములు ఇతరులకు చెప్పి సరితోంరిపజేయుమని త్వరగా రానున్న ప్రభుపు ద్వారా ఈ ప్రార్ధనలు ఆలకించుమని వేడుకొనుచున్నాము ఆమేన్. ప్రార్థన: ఓ దయగల తండ్రీ! “నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నపుడే నిన్ను గూర్ఛి నాకు తెలియును” అని నతనయేలుతో యోహాను 1:50లో అన్నట్లు మమ్ములను గురించి నీకు తెలియును. మా ప్రార్ధన నెరవేరక ముందే నీకు స్తుతులు. ఈ గొప్ప విశ్వాసము, ఈ గొప్ప సహవాసము మాకు అనుగ్రహింపుము. నిన్ను కలిగిఉండే భాగ్యమే భాగ్యము. నిన్ను కలిగిఉండే స్దితే స్థితి. మేము పరలోకమునకు రాకముందే ఇక్కడ నీ స్థితి కలిగివుండే భాగ్యము అనుగ్రహింపుము. నీవు నాకుండగా లోకములో ఏదియు నాకక్కరలేదని కీర్తన 7౩:25లో వ్రాయించిపెట్టెనావు. ఎంత ఆశ్చర్యకరమైన అనుభవము. మేముకూడ అదే అనవలెసు. నీవు నాకుండగా లోకములో ఏది మాకు లేకపోయినా ఉన్నట్టేసని బైబిలులో వ్రాయబడినది గాని ఆయన అక్కరలేదన్నాడు. ఎంత గొప్ప విశ్వాసము! ఎంత లోతైన మర్మము! ఎంత ఆశ్చర్యము. లోకములో నున్నాము, లోకములోనుండి ఏది అక్కరలేదంటాడు. ఎవరంటారు? అక్కరలేదంటే ఏమి తింటాము? ఏమి కొరింము? ఏమీ అక్కరలేదు, ఎంత గొప్ప ఆశ్చర్యము! లోకములో నున్న ఐశ్వర్యమం తా చూడగా అంతా పెంటకుప్ప అన్నాడు పౌలు. అట్టి అనుభవము నాకుంటే ఎంత సంతోషము, లేదు, వినలేదు అంటాము. నీవు మోషేతో ,“ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల దు:ఖములు నాకు తెలిసినవి అని అన్నావు. ఇది బహువిచిత్రమైన వాక్యము. అది వారు విన్నప్పుడూ వారికి ఎంత సంతోషము. ప్రభువా! నా జబ్బు తీసివేయి అని ఒకరు అంటే, నాకు తెలుసును అన్నావు. మోషేతో కాదు, ఈ గదిలోనున్న మాతో ఒకటి ఉండి ఒకటి లేకపోతే ఆ మాట చెప్పినట్లు చేయుము. అక్కరలేదంటే ఉన్నవి అనవలెను. నీ వాక్యప్రకారము “వీపు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు” ప్రపంచములో అనేకమంది భక్తులు, (పరమ) విశ్వాసులు ఉన్నారు. అందులో ఎందరికి ఈ బైబిలు వాక్యము తెలుస్తుంది? నీ సర్వశక్తీని బట్టి భూలోకములో నున్న భక్తులందరు ఈ వాక్యము చదివితే ఈ అనుభవము మాకున్నదని చెప్పగలరు. మా అనుభవము అదే. మా తండ్రీ! మా ప్రభువు మా ప్రార్ధన వినలేదు. ఇది లేదు అది లేదు అని నిన్ను నిందించే అరుపులు ఎందుకు? లోకము పట్టజాలని ధన్యత బుడ్దినిండా ఉన్నది. లోకము పట్టదు. లోకము ఈయనేరని సమాధానము నేను మీకిచ్ఛినాను. ఇది తండ్రీ! ఎంత గొప్ప వాక్యము! ఎ) పెంటకుప్ప బి) సమాధానము, పి) అక్కరలేదు ఈ మూడు మాటలు మమ్మును సిగ్గుపరుఎచున్నవి. నీకృపాకార్యములు జ్ఞాపకము తెచ్చుకొంటే మా ముఖము చిన్నపోయింది అవి నీ వాక్యములో ఉన్నది, ఇంతగొప్పా పాపికై ఇంత గొప్ప భాగ్యమని చిన్నబుచ్చుకొన్నాడు. మేము తగము. ఎంత గొప్ప భాగ్యము. ఎంత గొప్ప ధన్యత. అయ్యా! మీ ప్రేమను మేము గ్రహింపజాలము. “ఎందుచేత యీ పాపిపై ఇంత ప్రేమ” మా ప్రభువా! స్థలాంతరము నుండి వచ్చినవారి హృదయములోనున్న కోరికలు నెరవేర్చి, నీ భక్తి, నీ ప్రేమ బయలుపర్చుము. ఓ తండ్రీ! ఆయా జిల్లాలలో గల మాకు సంబంధించిన విశ్వాసులు. మేమరిదరము ఎప్పవెడయినా కూడుకోగలిగితే ఎరిత సరితోషము! మహిమ సంగతులే మాట్లాదూకొనగలము. మేము అందరిని సమకూర్చుకొనలేకపోపుచున్నాము. విశాల స్థలములో, ఇదివరకు మాట్లాడుకొన్నవన్ని మాట్లాడుకొనే సమయము దయచేయుము. అందరము కూడుకొనే సమయముగా నీ సమయము మా సమయముగా అనుగ్రహించుము ఆమేన్.

ఓ ప్రభువా! మార్కు 16:17లో మీరు దయ్యములను వెళ్ళగొట్టుడని తెలియపర్ఛినావు వెళ్ళగొట్టుదురని ప్రవచించినావు గనుక మేము అడుగు చున్నాము మా మీదికి వచ్చిన దయ్యములను వెళ్ళగొట్టుము

2.“అపవాదిని ఎదిరిరిచుడి. అప్పుడు వాడు మీయెుద్ద నుండి పారిపోపును” అని యాకోబు 4: 7లో వ్రాయించినావు. గనుక ఎదిరించు శక్తిని అనుగ్రహించుము.

3. సాతానును శీఘ్రముగా మీ పాదములక్రింద త్రొక్కించెదనని కూడ రోమా 16:20లో వ్రాయించినావు గనుక అది ఇపుడు నెరవేర్చుము.

సన్నిధి కూటములు నీ సెలవు అడిగి వెళ్ళగొట్టేటట్లు ఏర్పరచుము. ఆమేన్.

Your Content Goes Here

ఎ) ఓ దేవా! లోకములోనికి పాపమును ప్రవేశపెట్టిన సాతానుకు మాపై ఏ అధికారము లేకుండా చేయుము. శత్రువుయొక్క బలమంతటిమీదను అధికారము ఇచ్ఛియున్నానని వ్రాయించిన దేవా! నీకు ప్తోత్రం. పిశాచిని ఎదిరించుడి, అప్పుడువాడు మీయెుద్ధనుండి పారిపోవునని వ్రాయించిన ప్రభువా! వాడిని, వాని అధికారమును పారదోలే విశ్వాసముసు అనుగ్రహించుము. అపవాది తనయొక్క బలమును, జ్ఞానోపాయమును, సర్వాధికారమును ఉపయోగించుచునప్పుడు నీవు వ్రాయించిన మాటలు మాకు జ్ఞాపకముచేసి మాకు ధైర్యము, బలము దయచేయుము. నీ వాక్యము ఎట్లు ఉపయోగించితే అతడు పారిపోవునో మాకు నేర్పుము. అతని అధికారమునకు మా హృదయములో ఏమాత్రమును ఇప్టాంగీకారము చూపకుండునట్లు నీ కృప దయచేయుము ఏ చిన్న విషయములోనైనా అతని అధికారమునకు ఒప్పుకొనకుండునట్లు మాకు పవిత్రమైన నిష్ట దయచేయుము. ఓ ప్రభువా! నీవు అపవాదిని జయించియున్నావు. గనుక అతని అధికారమునకు కూడ జయింపబడినదని గ్రహించుచున్నాము. నీకు వందనములు. అతడు ఎంతో అధికారమున్నట్లు చూపించేటప్పుడు సహితము, అతనికి అధికారము లేదనే తలంపు మాకు జ్ఞాపకము చేయుము అపవాది జయింపబడిన శత్రువని మేము మరువకుండునట్లు నీ కృప దయచేయుము అవవాది బందింపబదినవాడనియు, అపవాది క్రియలను లయము చేయుటకు, దేవుని కుమారుడు గప్రత్యక్షమాయెను అనే వాక్యము నీ గ్రంధములో నున్నదనియు, ఈ వాక్యమే మాకు అపవాది మీదను, అతని క్రియలమీదను’ మాకు జయమిచ్చినదనియు మాకు జ్ఞాపకము చేయుము. ‘అనేకమందిని అనగా గొప్ప గొప్ప వారిని సహితము మోసపర్చిన అతడు మమ్మును మాత్రము మోసపర్చడా?’ అనే తలంపు అతని రాజ్యము నుండి వచ్చిన తలంపే అని మాకు జ్ఞాపకము చేయుము. ఆమేన్. ‘

బి) ఓ దేవా! సైతాను కారణముచేత మానవులమైన మాలో ప్రవేశించిన నైజమునకు మామీద అధికారము లేకుండా చేయుము. అపవాది క్రియలకు లయము క్రీస్తు యేసు రక్తము, శరీరములకు జయము ‘ఈ శరీర నైజము, ఈ శరీర భూస్ధాపనైనప్పుడే పోవును. గాని మరియెప్పనడు సోదరీ అని లోకులు అనేమాట లెక్కచేయము. ఎందుకనగా మాకు నూతన సృష్టి దయచేయుదువని నీ వాక్యములోయున్నది. గనుక అది మాకు దయచేయుము.

ఓ దేవా! నీవు ఒకప్పుడు భూమిమీద ఉన్నప్పుడు మనుప్యనైజము కల్గియున్నప్పటికెని నరునిలోని నరస్వభావమును కల్గియుండలేదు. నీకు స్తోత్రము. అయితే పవిత్రమైన నరస్వభావమే ధరించుకొన్నావు. స్తోత్రములు. అందుచేతనే నరస్వభావమును నీవు పరిహరింపగలపు. ఆది తల్లిదండ్రులకు నీవిచ్చిన పరిశుద్ధత, నరస్వభావము మాకును ఇవ్వగలవు నీకు స్తోత్రము.

ఓ దేవా! మాలోని మానవ స్వభావమును నీవు తీసివేయుము. దీనిని నీకు అర్పించుచున్నాము. మరల ఈ స్వభావమును గూర్ఛి ఆలోచించుట వల్ల దీనిని మరల తీసివేసికొనము. ఈ నైజస్ధానమునందు నీ నైజమును స్దాపన చేయుము. అప్పు డు మా ననైజములోను మాకు మంచి తలంపులు, మంచి వినికిడీ, మంచి చూపు, మంచి పాటలు, మరిచి చర్యలు, మంచి క్రియలు, మంచి బ్రతుకు కల్గును. నీకు స్తోత్రము. ఓ ప్రభువా! నీ మానవ స్వభావమునకే మాలో అధికారముండును గాక! ఆమేన్.

సి) ఓ దేవా! ఆ విధముగానే మానవ నైజముయెుక్క సంబంధమైన వన్నియు హరించునట్లు చేయుము. మానవ నైజమును మా స్వంత ఇష్టముతో నీకు సమర్పించే మనస్సు దయచేయుము. దేవా! దేవా! మా పాతనైజము పోవుట మాత్రమేగాక అది మరలా రాకుండా చేయుము. మాకు నూతన నైజము వచ్చుట మాత్రమేగాక అది వెళ్లిపోకుండ చేయుము. ‘విత్తే వారిలోను, నీరు పోసే వానిలోను ఏమిలేదు. మొలిపించే దేవునిలో యున్నది’ అనే నీ వాక్యప్రకారము మేము యోచించిన యెడల; నీ కృవవల్లనే మేము రక్షింపబడుదుము, గాని వేరుకాదు. నా స్వనీతివల్ల నాకేమియు దొరుకదు. మేము మా కోరికమీదయైనను, మా పాటమీదనైనను ఆనుకొనము. నీ కృపమీద ఆనుకొంటాము. అయినప్పటికిని ప్రయత్నమును, పాటును, కల్గియుందుము నీ కృప దయచేయుము. ఓ దేవా! మా నైజము ఎట్టి నైజముగా ఉండుట నీకు ఇష్టమో, అట్టి నైజముగా మారుటకు నీ కృప దయచేయుము, స్థిరపర్చుము. ఓ దేవా! సైతానుగాని, పాపముగాని, వ్యాధిగాని, చావుగాని, నరకముగాని, తుదకు నైజముగాని మామీద అధికారము చేయనీయకుము. వాటికి మామీద అధికారములేదు. ‘అవి మమ్మును కలుగజేయలేదు, మాలో పరిశుద్ధ దీపము వెలిగించలేదు’ ఇట్లు అనే ధైర్యము మాకు దయచేయుము. ‘మా విషయమై రక్తము ధారపోయలేదు ఇట్లు అనే ధైర్యము మాకు దయచేయుము. కోపము, అసూయ, గర్వము, మందము, సాధించే మనస్సు, విసుగుదల, పహించలేని గుణం, భయపడుట, అవిశ్వాస పడుట, మూలుగుట, సణగుట, పరాకు, పరధావ్రసము, పట్టించుకొనుట, అత్యాశ, ఆతురత, అమితవ్యయం, బాధ్యత లేకుండుట, సోమరితనము, అజాగ్రత్త, నిర్లక్ష్యము గడిపివేయుట, మూర్కత్వరం, దుర్వాంచ, వృధాచేయుట, నిరాశ ఈ మొదలైన వాటిని ఓ దేవా! మాలోనుండి తీసివేయుము. మాలోపలి నుండి ఏమి వచ్ఛువో ఆ చెడుగును, శోధనను, ఆ కష్టముసు నీమీద వేసి అనగా మా యావత్తు వింత నీమీద వేసి నిర్భయముగా యుండే నైజము మాకు దయచేయుము మాకు ఏ కీడు వచ్చునో ఆ కీడును నీవు సద్వివియోగము పర్చుము. దానివలన ఏదో ఒక మేలును కూడ రప్పించగలపు. నీ కృప మా విషయములో ఎంతపనియైనను చేయగలదని నమ్ముచున్నాము. నీ చిత్తమైతే కీడున తొలగించగలవు. కీడు రాకుండ చేయగలవు. కీడు వచ్చిన పిమ్మట కీడుక మించిన మేలుకూడ అనుగ్రహించగలవు. నీవు సర్వశక్తీగల వాడవును జ్ఞానోపాయము గలవాడవును అగుటవల్ల పరిగతులను ఎటుబడితే అట త్రిప్పగలవని నమ్ముచున్నాము. ఓ దేవా! మేలు కలిగినపుడు మేమెంత సంతోష భరితులమౌదుమో, కీడు వచ్చినప్పుడును, ఆ రీతిగానే సరితోషించే ఆత్మను దయచేయుము కీడు మాకు వినబడినప్పుడు, ‘మా తండ్రి మాకు ఇదివరకు ఉన్న దీవెనకంటే గొప్ప దీవెన అనుగ్రహించే సమయము వచ్చినదని’ ఆనందించే ఉద్రేకము అనుగ్రహించుము. పిల్లవాడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమను బాగుగా తెలిసికొనును. ఆలాగుననే ఓ దేవా! కీడు వచ్చినప్పుడు నీ ప్రేమను మేము ఎక్కువగా తెలుసుకొనే జ్ఞానము దయచేయుము. ఏలియాకు నీళ్లు వచ్చే మార్గము, రొట్టెలు వచ్చే మార్గము మూయబడినప్పుడు అప్పములు వచ్చినవి. అరణ్యములోకంటె శ్రేష్ణమైనవి మరియొక విశాల మార్గము సిద్ధమై యుండెను. అట్లే ఓ తండ్రీ నీ బిడ్డలకు సహాయము ఒక విధముగా ఆగిన యెడల మరియొక విధముగా రప్పించెదపు. ఎందుకనగా అన్నీ నీ స్వాధీనములో ఉన్నవి. అన్ని నీకు లోబడును. ఓ దేవా! ఏదైన కీడు వచ్చేటప్పుడు దానికి మేముకారకులమైయున్న యెడల మాకు దిద్దుబాటు అనుగ్రహించుము. మంచి విషయములు కనబడనప్పుడు, మా నైజము స్థిరముగా కదలకుండూనట్లు కాపాడుము. ఓ ప్రభువా! వర్షింపకుండునట్లు మేఘములు బంధింపబడినపుడుసు, సూర్యరష్మి కనబడకుండునట్లు సూర్యుడు మరుగైనప్పుడును, గాలికి వృక్షములు స్థానము తప్పునప్పుడుమ, సమస్తము అంధకారముగా తోచినప్పుడును, నలుదిశలా కీడే తలెత్తి చూచినప్పుడు సహితము మేము నిరాశ చెందక, స్ధిరనైజమును, విశ్వాస నైజమును కలిగియుండే కృప దయచేయుము, ఆమేన్.

త్రియేక దేవుడవైన తండ్రీ! అన్నిటి తండ్రీ! అందరి తండ్రీ! ఆకాశమందున్న తండ్రీ! నీ నామమువ ప్రార్థించుచున్నాము. మేము నీ నామమునుబట్టి ప్రార్దించుచున్నాము. వేరొక నామమునుబట్టి ప్రార్థిస్తే మా ప్రార్ధనలు నెరవేరవు. కాబట్టి నీ నామమునుబట్టి ప్రార్థించుచున్నాము. ‘నా నామమునుబట్టి మీరు ఏది అడిగినను చేస్తానన్నావు’ వేడుకొనకముందు దయచేస్తానన్నావు. కాబట్టి నా మనస్సులో ఏమి ప్రార్ధనలు యున్నవో నీకు ముందుగానే తెలుసును. మరియు మేము మనవి చేయుచుండగా నీవు నెరవేరుస్తావు అని అనావు. కాబట్టి ఈ రెండు వాగ్ధానములు ప్రవచన వాక్యములనుబట్టి తగిన ప్రార్ధనలు చేయుచున్నాము. దేవునియెుక్క పిరిహాససము, జ్ఞాపకము తెచ్చుకొని సాష్ణాంగపడి పార్థించుచున్నాము ప్రార్థనలు ఆలకించుము. నీకు అనేక నమస్కారములు. ప్రభువా! నరవంశమును బట్టి మేము పాపులము. స్వజనము, మా ఫూర్వీకులనుబట్టి మా తల్లీదండ్రులను బట్టి మేము పాపులము పుట్టుటనుబట్టి పాపులము. నీ పేరు ఎత్తుటకైనను తగనివారము. అయినను నీవు మమ్ములను నీ సన్నిధికి రానిస్తూయున్నావు, నీకు వందనములు. మేము అయోగ్యులము గనుక వీ కృపను పొందుటకు తగనివారము. నీవు అంతగొప్ప దేవుడవు.

ఇంత గొప్ప పాపులమైన మాపై ఇంత గొప్ప కృప చూపించుచున్నావు. వేడ్కొనకముందే మీ ప్రార్థనలు ఆలకించినానవి మేము మనవి చేస్తుయుండగానే వినినావు. నీ యెదుట మా అయోగ్యతను ఒప్పుకొనుచున్నాము, తండ్రీ! మమ్మును శోధించుచున్నట్టు, ఈ పావములో పడవేయుచున్న సైతానుమ బంధించివేయుము. మేము ప్రతి ఇబ్బందివద్ద నలుగుచున్నాము. భూతములను బంధించియున్నట్టి నీవు ఇప్పుడు మా ఎదుట సైతానును బంధించుము. మరియు భూమిమీద మేము అతనిని బంధించు చున్నాము. వాగ్ధానము చేసియున్నావు గనుక మత్తయి 18:18 బట్టి వేడుకొనుచున్నాము. మా ప్రభువా! అతనిని ఇదివరకే బంధించియుంటే, ఇప్పుడు మా జోలికి రాకపోవును. ఎలాగు చెలరేగుచున్నాడో చూచుచున్నావు కదా! అతనికి నీవిచ్ఛిన స్వాతంత్ర్యమును, నీవు మాకిచ్చిన సెలవు, స్వాతంత్రముతో బంధించుచున్నాము. పరలోకములోకూడ బంధించుము. అప్పుడు అతడు మా జోలికిరాడు. మా మిషను పనిద్వారా వాడి నివారణ చేసుకొనగలము. మమ్ములను నీ సన్నిధికి రానిచుచున్నాపు. ప్రభువా అపవాది యొక్క క్రియలను నాశనముచేయుటకే దేవుని కుమారుని ప్రత్యక్షపరచినందుకు నీకు వందనములు. పిశాచిని బంధింపవలెను అని ఇప్పుడే మనవి చేసియున్నాము. అతని క్రియలు, ఆలోచనలు, పన్నాగములను, ప్రయత్నములను, విషసంబంధమైవ నడతలను బంధించుము. వాడి దండును నాశనము చేయుము.

తండ్రీ! అపవాదిని ఎదిరించుడి అప్పుడు అతడు పారిపోవును అని వ్రాయించినావు గనుక మాకు సైతాను ఎదిరించే సింహపు గుండె దయచేయుమని వ్రాసికొన్నాము, ఆ మనవి నీపు అంగీకరించుము. మేము ఈ ప్రార్ధనలు చేసినప్పటికిని, అతడు మొండితనముగా మాయెుద్దకు వచ్చును, గనుక వాడిని నిత్యము ఎదిరించు సీంహపుబలము దయచేయుము. అతడు వచ్ఛునప్పుడెల్లా మా గద్దింపు విని పారిపోవునట్లు నీ వాగ్ధాన బలము, ధైర్యము మాకు దయచేయుము. ఆమేన్.

1) దేవా! మాకు కలిగే శ్రమలు మా మేలు నిమిత్తమై ఉపయోగించుము. ఇశ్రాయేలీయులకు ఐగుప్తులో కలిగిన శ్రమల ద్వారా వారిని ఒక రాజ్యమునకు ప్రత్యేక జనముగా యుండుటకు సిధ్ధపర్చిన రీతిగా మమ్మునుకూడ సిద్దపర్చుము

2) దేవా! వెనుక ఉన్న శత్రువుల వల్లగాని, ఎదుట ఉన్న నీళ్లవల్లగావి హాని కలుగకుండ అద్భుతమైన రీతిగా నీ జనులను కాపాడిన విధముగా మమ్ములనుకూడ సైతాను, లోకము, శరీరము అను శత్రువులనుండి కాపాడి ఆటంకములనుండి విడిపించుమని వేడుకొనుచున్నాము.

3) దేవా! నలుబది ఏండ్లు ఇశ్రాయేలీయులందరకు ఆహారమిచ్చిన పోషకుడవుగాను, ఆజ్ఞలు బోధించు బోధకుడవుగాను, అరణ్యములో నడిపించిన మార్గదర్శివిగాను ఉన్న విధముగా మములనుకూడ ఈలోకారణ్యములో పోషించుచు , ఈ బోధ చూపించుచు, చిక్కుదారులనుండి క్షేమముగా నడిపించుమని వేడుకొనుచున్నాము.

4) ఇశ్రాయేలీయులకు ప్రార్థన సమయమందు జయము కలిగినట్లు విసుగుదలలేని ప్రార్థనాశక్తిని అనుగ్రహించుము. ఈ ప్రార్థన చేతులు వాలకుండునట్లు మమ్మును బలపరుచుము. ఎప్పుడైనను, ఎక్కదైనను కొంచెమైనను సెతాను శోధనలోగాని, అజ్ఙానముమమాకు కలుగనీయకుము. “నీవే జయమును ప్రకటించుమని వేడుకొనుచున్నాము.

5) ఆనందకరమైన దేవా! చేదు నీళ్ళను మంచినీళ్లగాను, సామాన్య జలమును ద్రాక్షారసముగాను, మార్చిన నీవు మా కన్నీళ్లను ఆనంద భాష్పములుగా మార్చుమని వేడుకొనుచున్నాము. కృప మాకు తోడైయుండును గాక!

6) విడుదలైన తర్వాత ఓ యోచన కర్తా! మిరియాముకు స్తుతి కీర్తన నేర్పిన నీవు, పరలోకమునకు స్తుతి కీర్తన నేర్పిన నీవు, పరలోకమునకు వినబడే ఆ స్తుతి కీర్తన రాగమును మాకుకూడ నేర్పుమని వేడుకొనుచున్నాము.

7) నీ జనాంగమునకు అరణ్యములో ఆరాధన స్థలమును నియమించిన దేవా! నీ దానములు పొందే పనికంటెను, శత్రువులతో పోరాడే పనికంటెను, నీ సన్నిధిని కూర్చుండీ నిన్ను ఆరాధించే వని మహా శ్రేష్ట్మైనదని మాకు భోధించుము. నిన్ను ఆత్మతోను, సత్యముతోను ఆరాధించే హృదయాలను అనుగ్రహింపుము. ఆమేన్.

ఓ దేవా! దయగల తండ్రీ! నీవు నీ కుమారునిద్వారా అపరిమితమైన ప్రేమచే మాకు రక్షణ సంతోషముకూడ అనుగ్రహించినావు, స్తోత్రము. నీ సహవాస సంతోషము కూడ దయచేసినావు గనుక స్తోత్రము. నీతో ఈ రె౦డు సంతోషములు నాకు కలుగుటకు నీ మంచి స్వభావమే కారణమైయున్నది. అది ఇంకొక సంతోషము. కాబట్టి ఈ మూడు సఓతోషముల నిమిత్తము నీకు వందనములు. ఈ సంతోషకములతో నా హృదయపు గిన్నెయును’ నా బ్రతుకు గిన్నెయుసు నిండి ప్రవహించునట్లు నీ కృప దయచేయుము. పవిత్రమైన స్వభావముగల ఓ తంద్రీ! ఈ మూడు పవిత్రములైన సంతోషములు మాకు ఈ లోక జీవనములోని అన్నిస్థితులలోను యుండేటట్లు చేయుము. మరియు ఓ తండ్రీ! నీయెుక్క రూపము, మాలో ఏర్పడే వరకు మేము ఈ సంతోషములను నిలుపుకొనుటకు పాటుపడే శక్తీ అసుగ్రహించి, ఇందుమూలముగా శక్తిని, మహిమను, ఘనతను అనుగ్రహమును పొందుమని వేడుకొనుచున్నాము. ఆమేన్.

దేవోక్తీ ప్రార్ధన

ఆదామునకు భాష నేర్పిన తండ్రీ! నీకు స్తోత్రము. మానవజాతికి భాష నేర్పిన తండ్రీ! నీకు స్తోత్రములు. లోకములో ఎన్నో లోకోక్తులున్నవి. సర్వోక్తులు, ఛలోక్తులు, సరసోక్తులు, అలంకారోక్తులు పలుకుట లోకమునకు అవసరము. జ్ఙనోక్తులు, జీవోక్తులు, థీయోక్తులు పలుకుట నీవశము అయితే తండ్రీ! నీ రాక కొరకు ఎదురు చూచుచు, లోకములో రాకడ వర్తమానము ప్రకటించుచు సిద్ధపడుచుస్న నీ బిడ్డలమైన మాకు నీ చిత్తమైతే దేవోక్తి దయచేయుము. ఆదికాలములో ప్రవక్తలద్వారా దేవోక్తులు మాట్లాడినాపు. అంత్యకాలము సమీపించగా ప్రవక్తలను పంపుదునని వాగ్ధానము చేసినావు.

యెషయా నోటిని ముట్టి, అగ్నిలో దహిరింనావు. ఈ రీతిగా నీ చిత్త ప్రకారముగా నా నోరును ముట్టి, పరిశుధ్ధాత్ముని అగ్నిలో దహించి, నీవే మాలోనుండి దేవోక్తులు మాట్లాడించుము, అవసరమైన దేవోక్తులు వాడుకొనునట్లు నీ కృప దయచేయుమని వేడుకొమచున్నాము. ఆమేన్.

ఓ దయగల ప్రభువా! సంఘము పూర్వకాలముకంటె ఈ కడవరి కాలములో బైబిలు గ్రంథము విప్పి ఎక్కడ చదుపుకొన్నను సరే, యే వచనము చదువుకొన్నను సరే ఆ వచనములో నుండి సంఘము యొక్క శరీరములోనికి
శక్తీ ఇంజక్షవ్‌వలె వెళ్ళేటట్లు వేయుము ఆమేన్.

ఓ ప్రభువా! బైబిలులో మాత్రమే కాక నీ భక్తులైనవారు ఆత్మ ప్రేరేపణతో చేసే ఉపన్యాసములుతోకూడా మాకు, సంఘమునకు మంచి ఇంజక్షనులు అయ్యేటట్లు మార్చుము. యేసుప్రభువా! అని మాత్రమే కాక సంఘమునకు కలిగే హింసలు కూడ మంచి ఇంజక్షనులుగా అయ్యేటట్లు మార్చుము. యేసుప్రభువా! ఈ వేళ కూడ మాకు క్రొత్త వర్తమానము దయచేయుము. అది కూడ ఒక ఇంజక్షను అవును గాక! నీకు మహిమ సంఘమునకు జయము. అపవాది క్రియలకు లయము. నీ రక్తము సంఘమునకు పట్టించుము. (సంస్కారము ద్వారా) నీ రక్తమే సంఘమునకు ఇంజక్షను చేయుము. ఆమేన్.

గమనిక: (అదివరకు చదివేది వేరు. ఈ కడవరి కాలములో ఒక్కసారి చదివేది వేరు. ఇప్పుడు అయ్యగారు చెప్పిన తరువాత చదివేది వేరు. కాగితాలు తిరగవేసి ఎక్కడ చదివినను సరే, ఆకాను, యూదా, అననీయ సప్పీరా కథ. కయీను కథ చదివినను సరే. సొదొమ వారి కథలు కంటబడితే ఇవి దుశ్శకునములా ఉన్నవని అనుకొనకుండ చదువుము. దేవుని వాక్యములో దుశ్శకునములు లేవు, అకస్మాత్తుగా చంపే ఇంజక్షన్లు లేవు. అన్ని బలహీనతలను తొలి, బలపరచే ఇంజక్షనులే ఉన్నవని సంతోషించండి.

1. తండ్రీ! బైబిలు మిషసును నీవే బయలుపరచియున్నానను సంగతి లోకమంతటికి నీవే స్వయముగా కనబడి చెప్పము . అనేకులు నమ్మరు. అయినను చెప్పుమని వేడుకొనుచున్నాము.

2. దేవా! బైబిలు మిషనును వీపు స్థాపించినావను సంగతి మేము కూడా ప్రకటింతుము. మా ప్రకటనలు దీవించుము. మాలో మెంబర్లుగా నుండియు, మా అభిప్రాయములకు దూరస్తులైయున్నవారికి అపరాధములను వారికి స్వప్నములో తెలియపర్చి దిద్ధుకొనుటకు వారికి శక్తీ దయచేయుము.

& దేవా! మా విరోధుల యొక్క మసస్సులను, అనగా మాలోనుంచి విడిపోయినవారి మనష్యులను, మాలోనేయుండి మాకు విరోధముగా నున్నవారి మనస్సులను, ఇతర మిషనులలోనున్న మా విరోధుల మసస్సులను మార్చివేయుము.

4. దేవా! మేము తప్పుగా సిద్ధాంతములను చెప్పకుండ ఆపుచేయుము.

5. దేవా! మేము వేసే పత్రికలు, పుస్తకములు మిషనుద్వారా వ్యాపింపచేయుము.

6. దేవా! మా మీటింగుల ద్వారా, స్వస్థత కూటముల ద్వారా పద్యములద్వారా, ఆరాధన క్రమము ద్వారా ఏ విషయములు అందరికి తెలుపుము.

7, దేవా! బైబిలు మిషను ద్వారా ఆలోచించుచున్న నీ ఆలోచనలన్నియు చెరవేర్చుము.

8. ఇష్టమైన వారిని మాత్రమే నీ బైబిలు మిషనులోనికి తీసికొని

9. దేవా! అయోగ్యులమైన మమ్మును బెబిలు మిషనులోనికి పిలిచినందుకు నీకు ప్రత్యేకమైన వందనములు.

10. దేవా ఏ ప్రత్యేకమైన ఉద్దేశ్యముతో నీవు బైబిలు మిషమను బయలుపరచినావో దానిని త్వరలో నెరవేర్చుము.

11. దేవా! మా బోధలకంటె, మా ప్రవర్తన వెల్లడిలోనికి వచ్చునట్లు తోడ్పడుము.

12. దేవా! ప్రస్తుతము మా మిషనులోనున్న అక్రమములన్నిటిని పరిహరించుము.

1౩. దేవా! మా అందరి బలహీనతలను తొలగించుము.

14. దేవా! మాకు పాఠశాలలు, వైద్యశాలలు, అనాధశాలలు, చేతిపసులశాలలు, ముద్రాక్షరశాలలు, పుస్తకశాలలు, గొప్ప దేవాలయములు, గొప్ప గ్రందములు, గొప్ప రాబడులు, జీతనాతములు, పొలములు, సమాధి దొడ్లు, క్రైస్తవ విదేశీ సహాయములు, మిషను స్థానములు మాకు లేవని ఇతర మిషనుల వారు హేళన చేయుచున్నారు. వారి తట్టు చూడుమని వేడుకొను చున్నాము.

15. దేవా! మా సిద్ధాంతములు విని, అనేకులు నవ్వుచున్నారు. వారివైపు కూడ చూడుము.

16. దేవా! మా మిషనులలోని పిల్లలను విద్యార్థులనుగాను, ఉద్యోగస్తులనుగాను చేయుము. పురుషులను స్త్రీలను, బీదలను, పాపులను చిక్కులలో ఉన్నవారిని ఇట్టి వారినందరిని ఆదరించుము.

17. దేవా! మా మిషసులో నున్నవారందరికి దర్శనవరము దయచేయుము.

18. దేవా! మేము దేవునిమీద ఆధారపడియున్నామని చెప్పుచు మనుష్యులమీదను, ఔషదములమీదను, చందాల మీదను, ఆధారపడుచున్నామని ఇతరులు మమ్మును హాస్యము చేయుచున్నారు దీనికి మేము చోటియ్యకుండునట్లు కృప దయచేయుము. మేము వారికి ఒక జవాబు ఇస్తున్నాము. ఏలియా కాకులమీద ఆధారపడలేదు
మోషేతల్లి ఫరోకుమార్తె మీద ఆధారపడలేదు ఈ ఏర్పాటుచేసిన నీ మీద ఆధారపడినామని జవాబు చెప్పుచున్నాము.

19, దేవా! బైబిలు మిషను నీవే బయలుపరచినావనేది ఒక్కటి మాత్రమె గొప్ప విషయమనియు, తక్కిన మా విషయములలో ఇతర మిషనులోనున్న బలహీనతలు మాకు కూడ యున్నవనియు మేము చెప్పుచున్నాము. ఈ మాట దీవించుము.

20. దేవా! ఓహో! ఇది కేవలము దేవుడు బైలుపరచిన మిషను అని నమ్మగల వారు అనుచు సంతోషింతురు. అలాగే మమ్మును చూచి కూడ ఓహో! వీరు దేవుని బైబిలు మిషసులో చేర్చుకొనబడిన వారు అని పలుకుచు సంతోషించునట్లు ఇతర మిషను విశ్వాసులను, అభిమానులను ప్రేరేపింపుమని వేడుకొనుచున్నాము.

21. దేవా! మాలో యేవైన బహిరంగమగు తప్పులు గాని, రహస్యమైన తప్పులుగాని యున్నయెడల మమ్మును పిశాచికి గాని, శత్రువులకుగాని, సజ్జనులకుగాని, అధికారులకుగాని, అప్పగింపక నీవే మమ్మును క్షమింపుము. దావీదు ఇట్లే కోరుకొనగా అతనికోరిక ప్రకారము చేసినావు కదా!

22. దేవా! తండ్రీ! ఈ ప్రార్థనలో ఇంకా ఏమైన చేర్చవలసినవి ఉన్నయెడల నీవే చేర్చుము. తీసివేయవలసినవి ఉన్నయెడల నీవే స్వయముగా తీసీవేయుము.

23. దేవా! నరుల జ్ఞాపకశక్తిలో నుండి మా పొరపాటును సమూలముగా పెరికివేయుము.

24. దేవా! మమ్మును రాకడకు సిద్ధపరచుము.

25. దేవా! రహస్య సన్యాసి అను రాకడకు ముందే పంపించుము. మొదటి రాకడలో చేసినట్లు మృతులను లేపుము. పక్షులతోను, మృగములతోను సువార్త చెప్పించుము. ఒక దినము లోకములోనున్న వారందరికి ఏకకాల స్వప్నములో నీవు కనబడి మాట్లాడుము

సర్వజమల యొక్క అధికారివైన దేవా! నన్ను మాత్రమే కాదు, అందరిని రక్షించుటకు నీకు ఇష్టం. నన్ను రక్షించినావు గనుక ఇతరులు రక్షింపబడేటట్లు, నాకును, సువార్త చెప్పుటకు సమయము దయచేయుము ఆమేన్.

నాయకుడవైన ప్రభువా! నేను ఎక్కడికి వెళ్ళవలెనో ఎవరి యెుద్దకు వెళ్ళవలెవో అక్కడకు నేను కాల పరిస్థితులను బట్టి వెళ్ళేటట్లు నా జ్ఞానమును ఉపయోగించే కృప దయచేయుము. ఆమేన్.

వాక్కునేర్పే తండ్రీ! మేము మనుష్యులతో మాటలాడేటప్పుడు మా ఇష్టము వచ్చిన మాటలు కాక మా సర్ధామాటలుకాక, వారి హృదయములకు తగిన మాటలే చెప్పేటట్టు మాకు వాక్కు దయచేయుము. ఆమేన్.

యుక్త సమయముల యందు, యుక్త వాక్యములు అందించే తండ్రీ! మేము నీ వాక్యము చెప్పేటప్పుడు కొందరిలో ఫలించదు. కొందరిలో ఫలించును “అయినను వాక్కు అందించుము. ఎందుకంటే మూర్కతనము గలవారికి అది శిక్షగా నిలువబడును, విధేయత గలవారికి పరమవిందుగా వినబడును. ఆమేన్.

ఓ సర్వజ్ఞాని ఎన్నడు నీ వాక్యముఖము ఎరుగని సజ్జనులున్నారు. అట్టి వారి యొద్దకు నన్ను పంపుము. వారి అజ్ఞానమును తొలగింపగల నీ వాక్య వివరణ ధోరణి నాలోనుంచి, ఆ వాక్యము యూటయై రప్పించుము. ఓ సర్వజ్ఞానీ! ఆమేన్.

జాగ్రతగా ఆలోచించే ఆత్మను దయచేసే తండ్రీ! కుప్పలు కుప్పలుగా మా వద్ద పడే చిక్కు ప్రశ్నలకు ఏమి జవాబు చెప్పవలెనో అది మాకు ఒక ఉపాధ్యాయునివలె మా ప్రక్కనుండి చెప్పించుము. స్తెఫను మాటలకు ఎవ్వరును ఎదురు చెప్పలేకపోయిరి. అంటే మా మాటలకు కూడ ఎదురు చెప్పక, ప్రశ్నల జవాబులు విని మసుష్యులులు ఆనందించేటట్లు మాకు, వారికి కృప దయచేయుము. ఆమేన్.

నీ వాక్యము తెలిసిసవారికి మేము నీ వాక్యము విడచెప్పేటప్పుడు’ వినేవారు తమ అజ్ఞానము, తెలిపికొన్నవారై; ఎమ్మాయి శిష్యులయెుక్క హృదయములో మంటపుట్టినట్లు, వారి హృదయములో కూడ మంటపుట్టె వారికి జ్ఞానోదయముగల్గు మార్గము సరాళము చేయుము. ఆమేన్

Share this now. Choose your platform