పరీక్షల కొరకైన ప్రార్ధన

1) ఫ్రారనః దయగల ప్రభువా! విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుచున్నవి. అనేకమంది మాకు ఉత్తరములు వ్రాస్తున్నారు. వారిని దీవించుము. వారికి ఏ దృష్టిని దయచేయుమని అడుగుచున్నాము, ప్రార్థించండని మమ్మును కోరినట్లు వారు నిన్ను ప్రార్థించే ప్రేరేపణ దయచేయుము. వారికి విద్యయందు పాటుపడే శ్రధ్ధ, సమయము, వీలు, జ్ఞాపకశక్తి, ఆటంకముల నివారణ ఇవన్నీ దయచేయుము. మాకు ఉత్తరములు వ్రాసిన విద్యార్ధులనందరికి పరిపూర్ణ జయము దయచేయుము. వారు పరీక్షలలో జయము పొందినపుడు, ఒకానొక సమయమందు కొందరు స్వహత్య చేసికొనుటకు ప్రయత్నిస్తారు. దయగల ప్రభువా! వారు క్రైస్తవ పిల్లలు, అయి అన్యుల పిల్లలును మాకు వ్రాస్తున్నారు. సంతోషమే, వారికిని నిరీక్షణగలదు. అయితే పరీక్షలలో ఫెయిల్ అయితే ప్రార్ధన నెరవేరలేదని నిరాశపడుదురు. గనుక అందరిని కరుణించుమని వారి ప్రార్ధన, మా ప్రార్ధన నెరవేర్చుమని వేడుకొంటున్నాము.

ఓ ప్రభువా!మా కొరకు ప్రార్థించండి అని ఎందరు మాకు వ్రాసినారో వారందరియొక్క కోరికలు నెరవేర్చుము. ఇప్పుడు ఇదివరకు వ్రాసిన కోరికల ఉత్తరములు నీయెుక్క సన్నిధానమున పెట్టుచునాన్నాము. కృప దయచేయుము. ‘మా కొరకు ప్రార్ధించండి’ అని బేతేలు గృహమునకు ఎవరు వ్రాసిరో, వ్రాస్తారో వారియొక్క కోరికలు నెరవేరునట్లు ఆశీర్వదించుము. ఎవరియెుక్క కోరికలు నెరవేరవని నీకు తెలుసునో, వారియెుద్ద నుంచి ఉత్తరములు రాకుండా చేయుము. తీరా వచ్చిన తరువాత మొదట ప్రార్ధన చేయవలెను గనుక రెండవ ప్రార్ధన ఇటువంటి రెండవ ప్రార్ధన ఆలకించుమని వేడుకొంటున్నాము. ప్రార్ధనలు చేయుట ఎందుకు ప్రభువా! నెరవేరుటకే గదా! నెరవేరని ప్రార్ధనలు నా దగ్గరకు రానీయకుము, ఎందుకంటే, లోకములో ఉన్న అన్ని మతములకంటే, అన్ఫి మిషనులకంటే బైబిలు మిషనుకు గొప్ప అంతస్తు ఇచ్చిన లాభమేమి? ప్రార్ధన నెరవేరకపోతే, కాబట్టి బైబిలు మిషనునకు అవమానము రాకుండునట్లు నీకు అపకీర్తి కలుగకుండునట్లు ఈ ప్రార్థనలకు, ఏర్పాటు కలుగునట్లు దీవించుము. ఆమేన్.