హృదయ పశ్చాత్తాపము

 లూకా. 23:39-49

 ప్రార్ధన:మా ప్రియమైన యేసూ! నీవు మా నిమిత్తము పొందు శ్రమలను  ధ్యానించుటకై వచ్చినాము. మాకు ధ్యానము కుదురునట్లు చేయుము.  సిలువనుండి వచ్చు భాగ్యములన్నీ మాకు దయచేయుము. ఆమేన్.

గెత్సేమనే తోటలో ప్రభువు సాష్టాంగపడి, నేలమీద ప్రార్ధించినారు. ఆయన మోకాళ్ళక్రింద దిండులేదు. ఆనుకొనుటకు కుర్చీలేదు, వట్టి నేలమీద నుండి ఆయన ప్రార్థించినారు.

 యూదా పశ్చాత్తాపడెను. అయ్యో! నేను ప్రభువుని అప్పగించితినని విచారించెను గాని అతనిది నిజమైన భారమైతే అతడు ప్రభువు దగ్గరకు వెళ్ళి, పశ్చాత్తాప పడును గనుక అతని విచారము ఫలితములేని విచారము అయినది. గనుక లాభములేదు. అది ప్రభువు దగ్గర తప్పు ఒప్పుకొనని విచారము, ప్రభువు దగ్గరకు వెళ్ళని విచారమునై యున్నది. కుట్రదారులయొద్ధకు వెళ్ళినాడు గాని ప్రభువు దగ్గరకు వెళ్ళలేదు. కనుక మీరు ఈలాగు ఉన్నారేమో పరిక్షించుకొనండి. యూదావలె యుండకూడదు ప్రభువు దగ్గరకు వెళ్ళవలెను. యూదా ఇస్కరియోతు ప్రభువు ప్రేమను మూడున్నర స౦ల నుండి గ్రహించలేదు. గ్రహించినట్లైతే తప్పు ఒప్పుకొనును, అత్తరుపోసిన స్త్రీ పాపములు, ప్రభువు క్షమించుట చూచినాడు గాని గ్రహించగల్గిన మనస్సు లేనందున అతడు ప్రభువుయెుద్దకు రావలెనని, ప్రభువు నా పాపము క్షమించునని అనుకొనలేక పోయినాడు.ఆలాగు అనుకొనలేకపోవుట కూడా పాపమే. నా బ్రతుకువల్ల ఏమి ప్రయోజనము లేదని అనుకొనుట పాపము. గనుక మనము ప్రభువు క్షమించునని నమ్మి, ప్రార్థించి, క్షమాపణకోరి పొందినయెడల ధన్యులమగుదుము. గనుక మనము కూడా ఏడ్చి దుఃఖించి క్షమాపణ పొందవలెను. నేను విషము త్రాగి చనిపోతే మంచిది అని విసికిన యెడల అదికూడా యూదా లైనే (వరుసే). గనుక యూదా మార్గములోబడి వెళ్ళవద్ధు. ‘నాకు ఈ కష్టము పోవును, ఏదో ఒక కృప వచ్చునని స్తుతించుట’ అనేది మనమును కలిగియుండవలెను. అలాగుననే ఎన్ని కష్టములు వచ్చినను, అవన్నీ మేలుకొరకై వచ్చుచున్నవి అని స్తుతించడమే కృప. నిరాశ అనేది మనిషికి రాకూడదు దానివల్ల నష్టమే కాని క్షేమము లేదు. యూదా పాపము ఏదనగా, నిరాశ పాపము యూదా స్వభావము పిరికితనము. యూదా జ్ఞానము యేసుప్రభువు యెుక్క  ప్రేమలోతును తెలిసికొనకపోవుటయే.

మనిషి గర్వము అణగగొట్టబడవలెనంటే యేసు ప్రభువుయెుక్క సిలువను  ధ్యానించవలెను. ప్రభువుయొక్క ప్రేమను గ్రహించకపోవడము యూదా రెండవ తప్పు). ‘తాను చనిపోయి కీడు తప్పించుకొనవలెను’ అని అనుకొని ఉరిపెట్టుకొని గొప్ప కీడు  తెచ్చుకొనెను, ఆలాగే మనకు కష్టములు, కీడులు వచ్చినప్పుడు ఇతరులను  చావమనడము, చావవలెనని విసుగుకొనటము మొదలగునవన్నీ పిశాచి పుట్టించు  తలంపులే. అవి యూదా మార్గములోనికి వెళ్ళుటే. విశ్వాసులైతే ప్రతి కష్టము నా మేలుకొరకే వచ్చేనని, కష్టము అనుభవిస్తే గొప్ప మహిమను పొందగలను అని సంతోషించుదురు. యూదా పాపము నిరాశ అనే పాపము, పిరికియూదా యేసు  ప్రేమయెుక్క లోతును గ్రహించకపోయెను.

 శ్రమలుపడు కష్టముకంటెను, నాకు కృతజ్ఞత లేకపోవుటే ఆయనకు మరీ కష్టము, ఆయన కష్టములలో యుండగా స్తుతిస్తే, ఆయనకు ఆదరణ కలిగి చిరునవ్వు నవ్వును.  యేసుప్రభువా! నీ శ్రమ, నీ దయ, నీ ప్రేమ, నీ జయము నిజముగా మేము గ్రహించవలెను. నిన్ను స్తుతించుటకు, సిలువమీద నీవు చేసిన బోధనుబట్టి నిన్ను చూచిన యూదులు స్తుతిస్తే ఎంత బాగుండును! నిన్ను గ్రహించుటకు మాకు నేర్పించినందుకు వందనములు, నమస్కారములు, ముద్ధులు. బల్లెముతో పొడుచుట ఆయనకు శ్రమకాదు గాని మన పాపములు గ్రహించక పోవడమే ఆయనకు గొప్ప శ్రమ. సిలువ దగ్గర మేము స్తుతిస్తే సైతాను సిగ్గుపడును. నీవు చాలా సంతోషిస్తావు.ఈ స్తుతులు అంగీకరించుము. ఆయన సిలువమ్రానుమీద మన కొరకు చేసిన పని, మనము గ్రహించడమే ఆయనకు కావలసిన ఆరాధన. అందనిపండ్లు అందుకొనుటకు నిచ్చెన ఎక్కుట సహజమైయున్నది, దూరముగా నున్నవారిని చూచుటకు గుట్టెక్కుట సహజమైన సంగతి, నిచ్చెన ఎక్కుట మరియు గుట్ట ఎక్కుటలో భేధమున్నది.

ప్రభువు సిలువ ఎక్కుట ఎందుకు? ఫలము అనే జయము కొరకు. తన శ్రమలద్వారా ప్రభువునకు జయము వచ్చినది. ఇది తలంచుచు స్తుతించుకొనవలెను. రెండవది: ప్రభువు జన్మించి 2004 సంలైనందున నీవు సంతోషమొందవలెను. ఈ కాలములో లోకాంతమువరకు ఎందరు జన్మించిరో వారందరి పాపముల కొరకు ఆయన సిలువ ఎక్కెను, ఆయన కాలములో పుట్టినవారు మాత్రమేగాక ఆదాము మొదలు లోకాంతము వరకు పుట్టిన వారి పాపములు తెలుసుకొనుటకు ఆయన తెలివితో సిలువ ఎక్కెను. అనేకమందిలో నుండి సిలువ స్తోత్రములు వచ్చునట్లు చేసినందుకు స్త్రోతములు. లోకములో ఎందరు స్తుతులు చెల్లించుచున్నారో, ఆ స్తుతులతో మా స్తుతులు కలుపవలెనని కోరుచున్నాము. వధ్యస్తంభము అనగా యేసుక్రీస్తువారు వధించబడిన స్తంభము, సిలువ స్తంభము, ఆ స్తంభమును చూచుటకు ఎవరు విశ్వాసమును గట్టి పరచుకొందురో వారే  ధన్యులు. నేను గొప్ప, నన్నే అందరు మెచ్చుకొనవలెను అను అహంభావమును, బడాయి,గర్వము, ఇతరులను లెక్కచేయని తనము ఇవన్నీ కలిగినవారు సిలువవైపుకు చూస్తే ఇవన్నీపోవును, విశ్వాసము గట్టిపడుసు. అట్టి గర్వము అప్పుడప్పుడు వస్తూయుంటుంది గనుక కనిపెట్టి చూచుకొనవలెను. :

1) ‘తెలివిగలదానను, తెలివిగలవాడను’ నేనే అనే స్వభావముండకూడదు, నా తండ్రి ధనికుడు, నాకంటె అధిక సౌందర్యవంతుడు, తెలివిగలవాడు గనుక నాకంటే  గొప్పవాడు మరియెుకడుండునని తలంచవలెను. ఎవడైనను గర్వించితే ఇద్దరు ముగ్గురు  క్రిందపడవేసి కొట్టి, వాని గర్వము అణచుదురు.

2) గర్విష్టుని మాటలచేత నోరెత్తకుండా అణగగొట్టుదురు.

3) గర్విష్టుని, దేవుడే నీ గర్వము నణగ దొక్కునని అందురు.

అట్టి  వానికి ఏ వర్తకములోనో నష్టము వచ్చును. సిలువ మ్రానుమీద మన గర్వమంతా  అణగ ద్రొక్క బడెను . ఆయన మన పాపముకొరకు పాపమాయెను (II కొరింథీ. 5:2) ఆయనను నేలమీద పడుకోబెట్టి, సిలువకు అంటకొట్టి, అప్పుడు సిలువను నిలువబెట్టిరి , మన గర్వమును, బడాయిని, అణగ గొట్టుటకు ఆయన సిలువమీద అంటగొట్టబడెను మన నిమిత్తమే ఆయన కొట్టబడెను. ఓ ప్రభువా! మా గర్వము, అతిశయించుట అనే  పాపము, అవిశ్వాసము ఇవన్నియు నిన్ను సిలువకు అంటగొట్టెను. ఇవన్నీ మా పాపములే వాటన్నిటినీ మా నిమిత్తమై నీవు సహించుకొన్నందుకు నీకు వందనములు.

జాన్‌ బన్యన్‌ అనే పరమ భక్తుడు ఉండెడివాడు. ఆయన వ్రాసిన పుస్తకము ‘యాత్రికుని ప్రయాణము’ బైబిలు తరువాత గొప్పగా నెంచబడిన పుస్తకములలో అది ఒకటి. యాత్రికుడు ప్రయాణమై పోవుచు, తన వీపుమీద బరువుమూటతో, నాశన పురమునుండి సీయోను పురములోని సిలువ దగ్గరకు రాగా, వీపుమీది పాపపుమూట పడిపోయెను. మనము సిలువ దగ్గరకు రావడము మన పాపములు పోగొట్టుకొనుటకే

అట్టి ధన్యత సిలువనాధుడైన క్రీస్తు ప్రభువు నేడు మీకు దయచేయును గాక! ఆమేన్.

కీర్తన : “నా నేరములు యేసు-పైన వేసికొన్న-నీ నెనరునకు స్తోత్రము =నీకు నేను చూపు ప్రేమ – నీ ప్రాణార్పన ప్రేమ – నిధి ఎదుట ఏ మాత్రము”        “మూడు“

bible mission, bible mission gooty, bible mission kakani, bible mission guntur, devadas ayyagaru

 

Share this now. Choose your platform