శ్రమకాల గుడారము.

లూకా 18:31-34

 ప్రార్థన:-దయగలప్రభువా! నీ కుమారునిద్వారా చరిత్ర జరిగింది, యది మాకు వ్రాసిపెట్టినందులకు వందనములు. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును నిత్యస్తోత్రమని చెప్పు విశ్వాసులకు కలుగు శ్రమలు, ఆనందకరముగ జేయుమని ‘ ” శ్రమల గుడారములో ప్రవేశించిన యేసు ప్రభువు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్.

     ప్రియులారా! మనము శ్రమలయెుక్క గుడారములో ప్రవేశించినాము. ఈ నలుబది దినములలో ప్రభువు యెుక్కకుడిప్రక్కను యెడమప్రక్కను ఎకడైనను శ్రమయే కనబడును. మనము క్రీస్తుయెుక్క శ్రమలను ధ్యానించునపుడు మన శ్రమలు జ్ఞాపకమునకు వచ్చును గాని ఆయన శ్రమల యెదుటనవి యావగింజంత మాత్రమే కనబడుచున్నవి. క్రీస్తు ప్రభువునకు జయముతో శ్రమలు ముగిసినవి. భక్తులైనవారు పూర్వకాలమందు ప్రభువు యెుక్క చరిత్ర పరీక్షించినారు. అందు క్రిస్మస్ చరిత్ర, ఆయన బోధ ఆయన య ద్బు తములు, ఆయన శ్రమలు ఉన్నవని గ్రహించినారు. అందు క్రీస్తు యెుక్క పునరుత్థానమున్నదనియు, రాకడున్నదనియు గ్రహించినారు. గాని క్రిస్మస్ కంటే, బోధ కంటే, అద్భుతముల కంటే, ఆరోహణము కంటే, క్రీస్తు యెుక్క శ్రమలే మహా ముఖ్యమైనవని, పెద్దలు యీ నలుబది దినములు ధ్యానముగా  నేర్పరచినారు. ఈ నలుబది దినములు శ్రమలను గూర్చి ధ్యానించవలెను. క్రిస్మస్ పండుగను ధ్యానిరిచుటకు ఒక్కరోజు మాత్రమే, ఈస్టరు పండుగను ధ్యానించుటకు ఒక్కరోజు మాత్రమే, ఆలాగుననే ఆరోహణ పండుగను ధ్యానించుటకు కూడ ఒక్కరోజు మాత్రమే గాని క్రీస్తు శ్రమలను గూర్చి ధ్యానించుటకు యెక్కువ సమయము కావలయునని పెద్దలనుకొని, నలుబది దినము లేర్పరచుకొన్నారు. మార్చి నెలయంతయు, ఇంకా ఏప్రిల్ నెలలో కూడా ధ్యానింతురు. ఇన్నిదినములెందుకని కొందరనుకొనవచ్ఛును. అయితే ఇవి మనము ధ్యానింపదగినవే. రేపు బుధవారము కదా! ఈ నలుబది దినములు ధ్యానించు టకు, భైబిలులో ననేకమైన వాక్యములు గలవు. అవన్నియు యిక్కడుపయోగింపక వాటి అన్వయ వాక్యములు మన ధ్యానముకొఱకు చెప్పెదను, మీరు చదువుకొంటే 1పేతురు 1:19-21 వరకని చెప్పుదును, అప్పుడు మీరు అధ్యాయమంతయు చదువుకొనెదరు. నిజమైన విశ్వాసి ఈ బుధవారమున క్రీస్తుయెుక్క సన్నిధానమునకు వెళ్ళి, మహావినయముతో “ప్రభువా! నేను బూడిదనై యున్నాను, ధూళినైయున్నానని చెప్పగలుగును. అందరును చెప్పలేరు. గుడిలోను, మీటింగులలోను, యిండ్లలో మాత్రము కాదు, హృదయములో అబ్రహామువలె చెప్పగలవారుగా ఉండవలెను. అబ్రాహాము విశ్వాసులకు జనకుడు, ఆయనే ‘ధూళి’నంటే, మనమే మనగలము. నేను ధూళికంటే ధూళిని, బూడిదకంటే బూడిదనని చెప్పవలెను. అలాగు యెవరందురో వారే శ్రమకాలపు గుడారములోనికి చేరగలరు.” (ఆది 18:27)

యోబు కూడ అలాగు చెప్పెను. (యోబు 30: 19) విశ్వాసి (1) నేను పాపిని, (2) నేను అయోగ్యుడను, (3) నేనశక్తుడనై యున్నాను అని చెప్పవలెను. మీరు యింటికి వెళ్ళి, యీ మూడు ఒప్పుకొనవలెమ, అప్పుడు శ్రమకాల ధ్యానములో ప్రవేశింతురు. మీరు ఇంటివద్ద, గుడిలోకంటె ఎక్కువగా ధ్యానించగలరు, చదువగలరు.

  1. నేను సాపినైయున్నాను :‘నేను అక్రమకారుడనని’ మనయపరాధములు మంచి శుక్రవారమువరకు ఈ విధముగా నొప్పుకొనవలెను. శ్రమకాల చరిత్ర రెండువైపుల కనబడుచుండగా, తండ్రీ! నేను పాపినైయున్నాను, అయినప్పటికిని నా కొరకు నీవు పాపికంటె యెక్కువ శిక్షననుభవించినావని యనండి.

  1. అయోగ్యుడను:ఒకవేళ, పూర్తిగా క్షమింపబడినవారు, పూర్తిగా పాపము విడిచి పెట్టినవారును ఉండవచ్చును. అయితే అయోగ్యుడను అంటే ‘నేను పాపిని కాదు, నీ శ్రమల ద్వారా పొందవలసిన భాగ్యమునకు నేను తగనని’ యర్దము. నీవు నాకు, నీ శ్రమల ద్వారా అందించే దీవెన నేను అందుకొనలేనని యర్ధము. ఆహా! నా అయోగ్యత యెంత చెడ్దది. ప్రభువా! అయినప్పటికిని నీ శ్రమల ధ్యానము ద్వారా నన్ను యోగ్యునిగా చేయుము.

  1. అశక్తుడను :అనగా శ్రమ చరిత్ర వల్ల నీవు యెన్ని దీవెనలిచ్చెదవో, వాటిననింటిని అందుకొనే శక్తి నాకు లేదు. నీవైతే యెన్నైనను యిచ్చెదవు, నీవు పడిన శ్రమలు చూడగా యెుకటి కాదు, ననేకమైనవి అనుభవించితివి. గనుక అనేకమైన దీవెన లి య్యగలవు. ఐదువేల మంది కాహారమియ్యగా, 12 గంపల రొట్టెముక్కలు మిగులునని తెలిసినను, మిగిలి పోయేట్లు అద్భుత కార్యక్రమము చేసినావు కాదా! అట్లే నీ శ్రమలన్నిటి ద్వారా వచ్చు దీవెనలన్నీ మేము అందుకొనలేమని తెలిసినప్పటికిని, నీవు శ్రమల ననుభవించినావు గనుక నీకు వందనములు.

ఇప్పుడు నేను శ్రమ చరిత్ర వినిపించెదను. ఇంతవరకు మన చరిత్ర వివరించినాను. అనగా పాపియెుక్క చరిత్ర, అయోగ్య చరిత్ర, అశక్త చరిత్ర. పాపి తన చరిత్ర తెలిసికొని దేవునికి వందనములు చెల్లించిన యెడల అదియెంత మంచిది! ప్రభువా నేను అయోగ్యుడను, అశక్తుడను, నా మీద నీకింత ప్రేమా! యని అనిన యెడల అది యెంత మేలు. అట్టి చరిత్ర ధ్యానించుటకు ప్రభువు ఆత్మ మీకు తోడైయుండును గాక.

  1. శ్రమ చరిత్ర మొదటి భాగము, ప్రవచనములు చరిత్ర భాగము
  2. శ్రమ చరిత్ర రెండవ భాగము, నాలుగు సువార్తలలో గల చరిత్ర భాగము
  3. శ్రమ చరిత్ర మూడవ భాగము, పత్రికలలోని జ్ఞాపకము తెచ్చుకొనే భాగము
  4. శ్రమ చరిత్ర నాల్గవ భాగము, ప్రకటనలోని రాబోయే రాకడ కాల భాగము

      పై నాలుగు భాగము లెక్కడెక్కడున్నవో మీరు వ్రాసికొని, యీ నలుబది దినములు ధ్యానించండి. ప్రతిరోజూ భస్మ బుధవారము, మంచి శుక్రవారము, పరిశుధ్ధవారమని యనుకొంటూ ధ్యానించువారే పరిశుద్ధులు. ఎందుకంటే పాపములను, అయోగ్యతను, అశక్తిని శుభ్రము చేసికొని యున్నారు గనుక వారే ధ్యానపరులు. వారే దుఃఖించుచున్న రక్షకుని నవ్వించే ప్రియబిడ్డలు.

(1) ప్రవచన భాగము:- దీనిలో (ఆది 3:15)యున్నది. ఇందులో, యేసుప్రభువు లోకమునకు వచ్చి సాతాను వలన శ్రమపడునని యున్నది.

(2) అబ్రాహాము దేవునితో అనిన మాట ‘నేను ధూళిని బూడిదను’ (ఆది 18:27), కొందరు మారుమనస్సు పొందినయెడల రక్షింపవా! యని అబ్రాహాము యడిగెను.

(3) యోబు (30:19) నేను ధూళినై యున్నానని అబ్రాహామువలె యోబు కూడ తగ్గించుకొనెను.

4. (దా.కీ. 22) ఈ అధ్యాయమంతయు సిలువ మరణమును గూర్చి యున్నది. నా దేవా! నా దేవా! నన్నెందుకు చెయ్యి విడిచినావని మొదటే యున్నది. ఆ మాట ప్రభువు సిలువమీద పలికినాడు. ఎంత శ్రమలేకపోతే _ నా తండ్రీ! నా తండ్రీ! అనలేదు గాని నా దేవా! నా దేవా! అన్నారు. ఎందుకు చెయ్యి విడిచినావని మనిషి అంటాడు గాని యింకొకరనరు గదా! వారు నా బట్టలు తీసుకొని చీట్లు వేసికొన్నారని యీ కీర్తనలో యున్నది. ప్రభువు మరణ సమయములో రాణువవారు ఆయన యంగీని చీట్లు వేసికొనిరి. నా పాదములు, నా చేతులు, వారు పొడిచినారని యున్నది. నేను జ్ఞాపకము చేయుచున్నాను గనుక ఇంటికి వెళ్ళి చదవండి.

5. (యెష 53 అధ్యా.) ఈ అధ్యాయములో మీరెరిగిన మూడు ఆంశములున్నవి. (ఎ) మన శ్రమలు తనమీద వేసికొనినా డు, (బి) మన వ్యాధులు తనమీద వేసికొనినాడు. (సి) మన శిక్షలు ఆయన మీద వేసికొనినాడు. నిజముగా కొయ్యకఱ్ఱ తన భుజముల మీద వేసికొనినాడు. మనమీదకు వచ్చే శాపములు అన్నియు తనమీద వేసికొనినాడు. పెంతెకోస్తు కాలమందు ఆత్మ కుమ్మరింపబడకముందే, మన శాపములను సిలువమీద వేసికొన్నాడు. ఇది అంతయు కంఠత చేస్తే మంచిది.

6. విలాప వాక్యములు : యిర్మియా వ్రాసిన ఈ గ్రంథములో ఒక భక్తుడు ఉన్నాడని, ఆయనకు శ్రమలని, ఆయన యెంత ప్రార్ధన చేసిన వినలేదని, ఈటె తీసుకొని ఆయనను పొడిచినారని వ్రాయబడి యున్నది. ఈ ఐదు అధ్యాయములు బాగుగా చదువుకొనండి. యేసుప్రభువు గెత్సేమనే తోటలో ఏమన్నారు! ఈ శ్రమల గిన్నె నా యెుద్దనుండి తొలగించమన్నారు అయితే తండ్రీ విన్నారా? యింత శ్రమ భరించుట యెలాగు? పరిశుద్ధ పట్టణమునకు శ్రమ, నాకు శ్రమ, సీయోనుకు శ్రమయని విలాప వాక్యములలో శ్రమ చరిత్ర యంతయున్నది, ఇప్పుడు సువార్తలలో చూద్దాము,

2) సువార్త భాగము: మత్తయి 16-17 అధ్యాయములలో మరణ చరిత్రకు సంబంధించిన ప్రవచనములున్నవి, ఈ ప్రవచనములలో ప్రభువు తన చరిత్ర తానే చెప్పుకొన్నాడు. “ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు  పాపుల చేతి కప్పగింపబడి, శ్రమలపాలై, మరణము పొందునని” మూడు ప్రవచనములున్నవి శిమ్యలందరు ప్రవచనములన్నివిని దుఃఖించినారు. దీని యర్దము మాకు తెలియుట లేదు, ఈయనే దేవుడని యనుకొనుచున్నామని వారు భావించి, చివరకు పేతురు ప్రభువా! శ్రమలు నీకు దూరమగును గాక అని చేతులు పట్టుకొని బ్రతిమలాడినాడు. ప్రభువందుకు పేతురును సాతానా! నా వెనుకకు పొమ్మని గద్ధించినాడు. తరువాత శ్రమచరిత్ర వచ్చును, ఇది యసలు జరిగిన చరిత్రయైనను నేను చెప్పునదేమనగా, -రాబోయే ప్రభువుయెుక్క శ్రమచరిత్ర అంతయు నాలుగు సువార్తల యెుక్క చివర యధ్యాయములలో కలదు.

(౩) పత్రికల భాగము: ఆరోహణమై వెళ్ళిన తరువాత భక్తులు జరిగిన చరిత్రను తలంచుకొని ధ్యానించినారు. మనమాలాగే జరిగిన చరిత్రను భస్మ బుధవారము మొదలుకొని మంచి శుక్రవారము వరకు ధ్యానించెదము. 1 పేతురు 1,2 అధ్యాయములలో జ్ఞాపకము తెచ్చుకొనిన చరిత్ర ఉన్నది. పౌలు ఏమి వ్రాసినాడంటే ఆయన సిలువమీద పొందినది శ్రమ కాదు, ఆయన బ్రతుకు అంతయు శ్రమ చరిత్రే.  రోదనముతో, కన్నీళ్ళతో ఆయన కాలము గడిపెనని వ్రాసెను. ( హెబ్రీ5:7)లో ప్రభువు ఎప్పుడును యేడ్చుచునే యున్నారు అని పౌలు అన్నాడు. సంఘ చరిత్రలో భక్తులు యేసుప్రభువును గూర్ఛి యేమన్నారంటే యెప్పుడును దుఃఖముతో నుండేవాడనియు, కష్టములలో యున్నవారిని చూచి జాలిపడేవాడనియు వ్రాసిరి. ఎవరైతే ప్రభువును పొడిచినారో వారాయనను చూచి యేడ్చేదరు, ప్రధమ కుమారుడు చనిపోయిన యెడల తల్లిదండ్రులు ఎట్లేడ్చేదరో (జెకర్యా 12 అధ్యాయము) యట్లే ఏడ్చేదరు,

(4) ప్రకటనలోని భాగము: ప్రకటన 5వ అధ్యాయములో నొకాయన సింహాసనము మీద కూర్చున్నారు. ఆయన యెదుట వధింపబడిస గొఱ్ఱెపిల్ల నిలువబడి ఉన్నదని వ్రాయబడి యున్నది. ఇది యింకను జరుగలేదు. మనము యెత్తబడినపుడది చూస్తాము. ఇవన్నియు ఈ నలుబది దినములు తలంచుకొని, చదువుకొని, వీలైతే వ్రాసికొంటే. ప్రభువు మిమ్మును చూచి చిరునవ్వు నవ్వును. ఆలాగు మనము ప్రభువును ఆదరించెదము. ప్రభువు మనలను ఆదరించును. పాపము చేసిన తరువాత పేతురు సంతాపపడి యేడ్చినట్లు కాదు గాని ప్రభువా! యీ గొప్ప పాపినైన నా మీద నీకెందు కింత ప్రేమాయని మీరు జ్ఞాపకము చేసుకొని యీ కీర్తన పాడుకొనండి.

అట్టి  కృతజ్ఞతానంద  దీవెనలతో  వరుడు మిమ్ములను ఈ గుడారములోనికి నడిపించుకొనును గాక! ఆమేన్.

  కీర్తన :- “ఎందుచేత యీ పాపిపై _ యింత ప్రేమ యుండగలదో!= డెందము గ్రహింపలేదు _ వందన మిమ్మాను యే లా!”            ”నీకు“ 

bible mission, bible mission gooty, bible mission karimnagar, bible mission kakani, devadas ayyagaru, bible mission books

Share this now. Choose your platform