ప్రార్థన: తండ్రీ! నీవు ఉపవాసముండి సాతానును జయించినావు. అట్టి శక్తీ నే సంఘమునకు ఇచ్చినావు.మేమును నీ సిలువధ్యాన ఉపవాసము ద్వారా శరీరమును, లోకమును, సాతానును జయించునట్లు నీ వర్తమానము ద్వారా బలపర్చుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్.
ఏలీయా ఒక పూట తిని 4O దినములు ప్రయాణం చేస్తున్నప్పుడు, దారిలో మృగముల తలంపుగాని, మరే తలంపుగాని రాలేదు, మోషేగారు 40 దినములు కూర్చొని ఉపవాసం చేసిరి. ఏలీయాగారు 40 దినములు ప్రయాణం చేస్తూ ఉపవాసము చేసిరి. ఈయన నడుస్తూ రాత్రింబగళ్లు ఉపవాసము చేయుట వలన దేవుని తలంపు కుదురుట కష్టము. ఏలీయాగారు ఒక పూట తిని 40 పగళ్లు, 40 రాత్రులు ఎండను, రాళ్లను, మృగములను, ఇసుకను, పాములను, దొంగలను, చీకటిని చూడలేదు. 40 దినములు ప్రభువును చూచి నడిచెను. అలాగే ప్రభువు 40 దినములు ఉపవాసము చేసెను. అక్కడ సైతాను హవ్వయొక్క చూపును త్రిప్పెను. హవ్వ దేవుడు చెప్పిన పండ్లు చూస్తూ ఉంటే, సైతాను వెళ్లి అసలు పండు తినకుండా చేసి, హవ్వ మనస్సును త్రిప్పివేసెను. అట్లు హవ్వ తప్పిపోయింది. హవ్వ త్రిత్వదేవుని చూడలేదు గాని బువ్వవంక చూచింది. మనమును అట్లే ఉందుము.
సన్నిధి కూటములో ‘మనోనిదానము కుదిరిందా’ అనగా లేదందురు. కుదిరిననూ, కుదరకపోయిననూ సైతానును జయించవలెను. ఒకరు అయ్యగారికి వేసిన ప్రశ్న: సైతాను యేసుప్రభువును దేవాలయమునకు, కొండమీదికి తీసికొని వెళ్లినప్పుడు దేవుడెందుకు వెళ్లాలి? సైతాను పిలిచిన స్థలమునకు ప్రభువు పోకపోయిన యేసయ్యకు జయమేది? అని అయ్యగారు జవాబిచ్చిరి. అప్పుడు వారు అది రమ్మన్న దగ్గరకు వెళ్లి జయము పొందడమేల? ఇక్కడుండి రానంటే జయముకాదా! ప్రభువు రాననగా, దానికి భయపడినట్లే. పాము ఉన్నప్పుడు కొట్టాలిగాని వట్టి స్థలములో కొట్టిన ఏమి లాభము? అని చెప్పిరి. శోధన స్థలానికి అనగా సైతాను శోధించే స్థలమునకు మనలను నడిపించేది ఎవరు? ప్రభువును నడిపించినది ఎవరు? ఆయనను ఆత్మ కొనిపోయింది. సైతాను శోధించవలెననగా, పరిశుద్ధాత్మ ఆ శోధన స్థలానికి మనలను నడిపించును. ఆత్మ నడిపించకపోతే శోధనరాదు. శోధన రాకపోతే జయము రాదు. బహుమానము రాదు. ఆత్మ నడిపించకుండా మనిషే నడిచి వెళ్ళునా? వెళ్లును. స్వంతాత్మ నడిపించుకొని వెళ్ళును. ఈ రెండునూ ఉన్నవి.
ఇప్పటికి శోధన ముగిసింది. మనలను స్వంతాత్మ లేక పరిశుద్ధాత్మ నడిపించినదని ఎట్లు తెలిసికొనగలము? మనిషికి స్వంతాత్మ ఉన్నది. ‘ఫలానిచోట అన్యులు పండుగ చేసికొంటున్నారు. నీవక్కడికి వెళ్లి వాక్యము బోధించు అది తప్పులేదు’ అని ఆత్మ నడిపించును. అక్కడకు వెళ్లి బోధ చేస్తాము. కొంతమంది వ్యతిరేకులు వస్తారు. అక్కడ కలహము వస్తుంది. అక్కడ ఇద్దరు గొడవపడినందున కలహము వస్తుంది. అది శోధన. ఆ శోధనలో పడతావని తెలిసి తన పనిమీద వెళ్లినపుడే పడతావు అని ఆత్మ ముందే హెచ్చరించును. అప్పుడు కోపపడకపోయినా జయిస్తావు. ఇంటిదగ్గర కోపపు తలంపు పుట్టినప్పుడు పడినావు. ఇప్పుడు వెళ్లావు. వెళ్లి సువార్త ప్రకటించినావు. వాళ్లు కోపపడిరి. కోపపడినందున, తిరిగి కోపపడినావు గనుక అక్కడ పాపము వచ్చినది.
అయ్యగారి స్నేహితుడు ఒకరు బోధిస్తున్నపుడు ఆయనకు, ఆయన బోధ వినువారికి కలహము రేగింది. అప్పుడు అయ్యగారు పిల్లలను పాట ఎత్తమనగా కలహము ఆగింది. పిమ్మట అయ్యగారు అయ్యా! మీరాయనకు వేసిన ప్రశ్ననాకెయ్యండి అన్నారట. సంగతి అదని చెప్పగా వారు అయ్యగారు చెప్పినట్లుగా ఆయన చెప్పలేదు అన్నారు, అయ్యగారి స్నేహితుడు మళ్లీ వాదమునకు వెళ్లిరి. ముందు వచ్చినవారే వచ్చిరి గాని ఈ సారి వారు అయ్యా మీరే చెప్పండన్నారు, గనుక మనకు శోధన వచ్చిన కో పపడరాదు. దేవుడు సైతాను మీద కోపపడలేదు. అది వచ్చే వారము చెబుతాను. (దేవుని మాటవల్లే మనము బ్రతికేది గనుక కోపపడరాదు.)
1) సందేహము పుట్టించే ప్రశ్నలు,2) పాపములు, 3) దేవుని మీద తిరుగుబాటు, 4) ఈలాగు చేయుట నీకు తగునా! అని అనుట మరి పాపము. ఇవి మనలో ఉన్న యెడల రాకడకు సిద్ధపడలేము గనుక దేవుని మీద ఈ ప్రశ్నలు వేయరాదు.
అలాగే రొట్టెలవలె ఉన్నవాళ్లు ఎదురుగా పెట్టి, ప్రభువు మనోనిదానము త్రిప్పాలని చూచింది, ఆయన మనస్సు రొట్టెలవైపు గాని, రాళ్ళ వైపు గాని పోలేదు గాని ద్వితి. 6వ అధ్యాయంలో ఉన్న మాట మీదికి పోయింది. మనిషి బ్రతుకుట దేవుని మాటవల్లగాని, రొట్టెవలన కాదు అన్నాడు. ఓ సైతానా! నేనొక సలహా ఇస్తాను: ‘రొట్టెవల్లకాదు గాని దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాటవల్ల మానవుడు జీవించును’ అని ప్రభువు అన్నారు.
అక్కడ హవ్వమ్మకూడ అట్లే అనవలసిందిగాని అనలేదు. ఆమె చూపు పండుమీదికి పోయింది. నీవు దేవుని కుమారుడవైతే అనేది శ్రమ. ఏదెను తోటలో సైతాను ఒక్క పండు చూపలేదు, మొత్తం పండ్లు చూపింది. ఇక్కడ రాయి ఒక్కటి కాదు, రాళ్లు చూపింది. ఇక్కడ వాడి యుక్తి ఉన్నది. ఇది ప్రభువుకు తెలిసింది. ఆయన లోకమునకు వచ్చిన పిమ్మట కలిగిన మొదట శోధన ఇదే. ప్రభువునకు వచ్చింది. మంచి పిండివంటలు పెట్టి ఓటు వేయించుకొందురు. ఇక్కడ మాయ గాని జాలిగాదు. ప్రభువది గ్రహించి సైతానుకు లోబడక, రాళ్లు వైపుచూచి ‘దగా’ అన్నారు. రొట్టెలవైపు చూచి, ‘దగా’ అనుకున్నారు. సైతాను అక్కడ ప్రభువును పొగడింది. అయ్యా మీరు రాళ్లు రొట్టెలు చేయగలరన్నది. గట్టి రాయిని, నీవు మెత్తని రొట్టెగా చేస్తావన్నాడు, కొరకలేని రాతిని, కోరికే రొట్టెగా చేస్తావని పొగడింది. శోధనలోని మరొక శోధన; అక్కడ తోటలో తిండి, ఇక్కడ రొట్టెలు తెచ్చి తిండి. తోటలోను తిండి శోధన వచ్చినది గనుక ప్రభువు తిండికి ఇక్కడ లోబడలేదు. దేవుని మాటవల్ల మనుష్యుడు జీవిస్తాడు అని చెప్పిన వాక్యములోని మూడు మాటలు, మూడు జెండాలు.
లూథరుగిరిలో పాదిరిగారికి అయ్యగారు ఈ పాటమే చెప్పిరి. అక్కడ గ్రేపు దొరగారు అది విని అందరికి, వారు వెళ్లే వరకు చెప్పేవారు. మనము కూడా అది అర్థము చేసుకోవాలి. ఇది మీ మనస్సులో జ్ఞాపకమున్నప్పుడు మీకు జయమే. అక్కడ (ఏదెను తోటలో) తినగూడని పండు తినమనియు, ఇక్కడ అరణ్యములో తినదగని రాళ్లు తినవలసిన రొట్టెలని వాడు చెప్పినాడు గనుక అక్కడా, ఇక్కడా దగా. అంతా దగే.
ఓ దయగల ప్రభువా! నీవు జయించినట్లుగా మేముకూడ జయించే శక్తి దయచేయుమని వేడుకొంటున్నాము. ఆమేన్.
అట్టి శక్తితో వరుడు మిమ్మును అలంకరించును గాక! ఆమేన్.
కీర్తన :- 1) “ ఏమి కావలె నా – కేమి కావలె = యేసు సిలువ దీక్ష తప్ప ఏమి కావలె“
2) ఏమి కావలె నాకేమి కావలె = యేసు జయము తప్ప నా – కేమి కావలె ”
“ఎవరు కావలె“

Share this now. Choose your platform