అంతరంగ శోధన

మత్తయి 4:5-7; లూకా 4:5-8.

 ప్రార్థన :- మా నిమిత్తమై సైతానుచే శోధించబడిన తండ్రీ! నీకెదురైన అన్ని శోధనలను నా నిమిత్తమై జయించినావు. నీకు స్తోత్రములు. * మేమును ఎంతగా శోధింపబడిననూ నీ తట్టుచూచి జయము పొందుటకు మమ్మును నీ సిలువ తట్టు ఆకర్షించుము. ఆమేన్. bible mission

          మొదటి శోధన అరణ్యములో జరిగినది. ఈ రెండవ శోధన పట్టణములో కనబడుచున్నది. మొదటి శోధనలో ఓడిపోయినవానికి అనగా సైతానుకు సిగ్గులేదు. దిగులు లేదు, నిరాశ లేదు. మన మతనివలన గొప్ప పాఠము నేర్చుకొనవలెను. అతడు దుష్టుడైనను అతనికి నిరాశ లేదు. మనుష్యులలో ఎవ్వరును అంతటి దుష్టులు లేరు. ప్రభువుకు ఈ వేళ శోధనలు ఎదురైనవి. ఆయనను పరిశుద్ధ పట్టణమునకు తీసికొని వెళ్లినారు. ఆయన దేవుడును, నిజమైన మనిషియునై యుండి సాతాను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లుట, ఎంత అవమానకరమో చెప్పుటకు వీలులేదు.

     ఇట్టి సంగతియే గురువారము రాత్రి, మరియు శుక్రవారము పగలు జరిగింది. గురువారము తిన్నగా ఊరిలోనికి చేతులు కట్టి తీసికొని వెళ్లినారు. ఎక్కడి కంటే చర్చి కౌన్సిల్ లోనికి తీసికొనివెళ్ళిరి, అయన వారిని ఆటంకపెట్టక వారు ఎక్కడకు తీసికొని వెళ్తే అక్కడకు వెళ్లెను. గనుక వారు ఆయనను అక్కడ నుండి కోర్టునకు తీసికొనివెళ్లినారు. ఇక్కడ ఏమియు లేదు. అక్కడనుండి గవర్నమెంటు కోర్టుకు తీసికొని వెళ్లి, అక్కడనుండి కల్వరి కొండకు తీసికొని వెళ్లినారు. ‘నేను రాను అని అంటే వారేమి చేస్తారు. ఏమి చేయలేరు గాని ఆయన అలా అనలేదు. ఆయన శోధింపబడుటకు, శ్రమపడుటకు, అవమానము పొందుటకు, తీర్పు పొందుటకు, మరణము పొందుటకు వచ్చారు గనుక ఆయన ఏమియు అనలేదు. మన సంగతి కూడా అంతే. శ్రమలు పొందుటకే మనము సంఘములో ఉన్నది. యేసుప్రభువును పరిశుద్ధ దేశములోనికి, పరిశుద్ధ పట్టణములోనికి అనగా యెరూషలేముకు తీసికొని వెళ్లినారు. ‘పరిశుద్ధ పట్టణమనే’ మాట మత్తయి వ్రాసిన మాట గనుక యేసుప్రభువును సైతాను పరిశుద్ధ పట్టణమునకు తీసికొని వెళ్లి శోధించెను. అది మరీ గొప్ప శోధన.

అరణ్యములో మనుష్యులు లేరు, శుభ్రత లేదు, ఇండ్లు లేవు. ఈ పరిశుద్ధ పట్టణములోనైతే ఇండ్లు, మసుష్యులు, శుభ్రత ఉన్నది. ముందు శోధనలో పరిశుద్ధమైన అడవి అనిలేదు. అది వట్టి అడవే. మార్కు – అది అడవి మృగములతో నిండిన అడవి అనియు, వాటి మధ్య ప్రభువు ఉన్నారనియు వ్రాసెను, ఇప్పుడు మనుష్యులున్న స్థలములో శోధన. పరిశుద్ధమైన స్థలములో శోధన. గనుక ఏది ఎక్కువ బాధ చెప్పండి? మనుష్యులు లేని దగ్గర, ఎవరికి తెలియని దగ్గర శోధింపబడుట ఎంతబాధ! అన్నీ ఉన్న పట్టణములో శోధింపబడుట ఎంత బాధ?

ఈ శోధనలో 2 భాగములున్నవి. ఒకటి దేవాలయములో జరిగే శోధన. అనగా ఆయనను దేవాలయమునకు తీసికొని వెళ్లుట. రెండవది పరిశుద్ధ పట్టణములో జరిగే శోధన. దేవాలయములో జరిగే శోధన, పట్టణములో జరిగే శోధన; ఈ రెంటిలోను ఏదిగొప్పది? ప్రభువుకు కలిగే తలంపు ఏదనగా, ఈ పరిశుద్ధ పట్టణములోను నేను కట్టించిన దేవాలయములోను నాకు శోధన వచ్చినదనే చింత రావలసింది గాని రాలేదు. అవి రప్పించుటకే ఆ స్థలాలకు సాతాను ఆయనను తీసికువెళ్లినాడు గాని ప్రభువు మనస్సు ఏమియు చెదరలేదు,

వాడు ఆయనను దేవాలయ శిఖరానికి తీసికొని వెళ్లినాడు.

1) పరిశుద్ధ పట్టణము.

2) పరిశుద్ధ దేవాలయము.

3) దేవాలయ శిఖరము.

ఇక్కడికి వాడు ఆయను తీసికొని వెళ్లెను. ఒక దానికంటే ఒకటి శోధన ఎక్కువగా యున్నది. అలాగే క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ కుటుంబానికి శోధనలు ఒకదానికంటే ఒకటి ఎక్కువ వచ్చును.

రాజమండ్రిలో ఒకరికి జైలు శిక్ష పడగా, కానిస్టేబుల్ వచ్చి తీసికొనివెళ్తూ ఉండగా; ప్రజలు వచ్చి ఆ మనిషిని, ఆ సంకెళ్లను చూస్తూ ఉంటే ఆ నేరస్తునికి ఎంత చింత. ఆ మనిషి క్రిందికే చూస్తూవెళ్తూ ఉండగా ఒకరు ఇలా అన్నారు: ‘ఏమయ్యా నీవు ఏమి నేరము చేసావని తీసికొని వెళ్తున్నారు? దిగాలుగా ఉన్నావు. ఏమి నేరము చేసావని ముఖము వంచావు? ముఖము ఎత్తుకొని పో ‘ అన్నాడట, అలాగే మనముకూడా మా యేసుప్రభువులోను, మా సంఘములోను ఏమి నేరమున్నదని అనవలెను. యేసుప్రభుపు చెప్పినట్టు మా సంఘాన్ని వృద్ధిచేస్తున్నాము. నీకెందుకు అని సైతానుతో అనవలెను.

మా ప్రభువును అక్కడకు, ఇక్కడకు, ఆ కొండకు, ఈ కొండకు త్రిప్పుచున్నావు గాని ఆయనలో ఏమియు నేరములేదు అని అనవలెను.

  నేరమున్న వానిని శిక్షించుటకంటే నేరము లేని వానిని శిక్షించుట వల్ల శిక్షింపబడుచున్న వానికి ఘనత. గనుక యేసుప్రభువునకు పరిశుద్ధ పట్టణములో, పరిశుద్ధ దేవాలయములో, దేవాలయ శిఖరముమీద సాతాను వలన శోధింపబడుట ఆయనకు ఘనతే. నేర ముంటే, అవును నేరమువల్ల శిక్షింపబడినారంటారు. నేరములేకుండగనే శిక్షింపబడితే అయనకు ఘనతే.

  పరిశుద్ధ పట్టణమునకు అరణ్యమునుండి తీసికొని వెళ్లుట. ఇది రెండవది. ఇందాక ఆ నేరస్థుని జైలుకు తీసికొని వెళ్లుట ఒక శిక్ష. ఇంటివద్దనుండి నడిపించుకొని వెళ్లుట మరొక శిక్ష. దేవాలయములోనికి తీసికొని వెళ్లుట మూడవ శిక్ష. ఆ దేవాలయములోనికే యేసుప్రభువు వెళ్లి అనేక సార్లు ప్రసంగించిరి. ఆ దేవాలయములోనే విధవరాలు కానుకనుగూర్చి మెచ్చుకొన్నారు. ఆయన ఇదివరకు మసలిన (తిరిగిన) పట్టణానికి,ఇది వరకు ప్రసంగించిన దేవాలయనికి, తీసికొని వెళ్లి శోధించుట ఎంత కష్టము? ఎంత అవమానకరము? పరిశుద్ధ పట్టణము, దేవాలయము, శిఖరము. ‘శిఖరమున ఆగు……. అని ఆయనను నిలువ బెట్టుట, ఆజ్ఞ ఇచ్చి నిలువబెట్టుట మరింత భారము. ఆయన అలాగే నిలువబడెను.

           యూదులు పిలాతు దగ్గరకు తీసికొని వెళ్లుచున్నప్పుడును, ఆయన అలాగే నిలువబడిరి. ఏలాగంటే, (యాకోబు మేనమామ దగ్గర నుండి పారిపోతూ ఉంటే) వెనుక మామగారు తరుముతూ రావడము ఒక ముంగుర్తు. ఏలాగంటే, యాకోబుకు 12 మంది కొడుకులు. వారిలోనుండి 6 లక్షలు వచ్చిరి. ఆ 6 లక్షల మంది సముద్రములో నుండి పరుగెత్తుతూ ఉంటే మామగారు తరిమే దానికి ముంగుర్తు. అలాగే యేసుప్రభువు వారికి కలిగే శోధనలన్నియు ఇకముందుకు జరుగబోయే కార్యానికి ముంగుర్తు.

        ఈ నలుబది దినములలోను మీకు కలిగే  శోధనలన్నిటిలోను ప్రభువువలె జయము పొందుదురు గాక!

కీర్తన: “లేని నేరములు నీ – పైన దుష్టులు వేయగాను క్షమించితివా = నీకు – ఈ నేరములు గూడ యెంతో భారంబాయె ఇది రెండవ సిలువాయెనా” 

                                               “మూడు“ 

మండల కాల సందేశములకు ఇక్కడ నొక్కండి – Click here to read LENT related sermons  

bible mission, bible mission kakani, bible mission gooty

Subscribe our channel on YouTube: Bible Mission Karimnagar

bible mission churchbible mission audio songsbible mission audiobible mission aradhanabible mission audio patalubible mission abdul kumarbible and missionbible and mission pdfthe bible missionthe bible mission episodethe bible mission songsthe bible mission storethe bible mission gootybible mission booksbible mission bramptonbible mission bowmanvillebible mission bible missionbible mission bangalorebible mission bhimavarambible mission cathedralbible mission church gootybible mission christian songsbible mission church rajahmundry andhra pradeshbible mission calendarbible mission devadas ayyagaru photosbible mission devadas songsbible mission devadas songs downloadbible mission dancebible mission downloadbible mission devadas ayyagaru patalubible mission david songse bible missionbible mission faithbible mission founderbible mission facebookbible mission fatherbible mission full songsbible mission gooty video songsbible mission guntur songsbible mission guntur 2019bible mission gooty audio songsbible mission gooty photosbible mission hospitalbible mission hyderabadbible mission historybible mission head officebible mission hd video songsbible mission imagesbible mission in gunturbible mission indiabible mission in telugubible mission in chennaibible in missionbible mission songs in telugubible mission jesus songbible mission jayanagarbible mission jesus telugu songsbible mission jesus songs downloadbible mission gooty jesus songsbible mission kadapa

 

Share this now. Choose your platform