మహిమ ప్రభావములు గల తండ్రి ! మానవుని కొరకు సమస్త దానములు గల భూమి, ఆకాశములు కలుగజేసిన తండ్రి ! వందనములు.

మానవుడు తన జ్ఞానమును వినియోగించి నీవు కలుగజేసిన వాటిని వాడుకొని స్వస్థత నొందుటకు, సృష్టిలో నీ ప్రభావమును ఉంచిన తండ్రీ! నమస్కారములు. ‘నిన్ను స్వస్ధపరచు యెహూవాను నేనే’ అని పలికిన తండ్రీ ! నీ ప్రవక్తల ద్వారా అనేక రోగులను స్వస్ధపరచిన నీకు స్తుతులు.

కుమారుడవైన తండ్రీ! నీవే స్వయముగా నీ ప్రభావము చేత రోగులను స్వస్ధపరచిన నీకు స్తుతులు.

ప్రభువా! పక్షవాతరోగి నీయెుద్ధకు తేబడి నిన్ను అడుగకపోయినను, వాని హృదయములోనున్న కోరికనుబట్టి స్వస్ధపరచిన నీకు వందనములు.

దేవ మానవుడవైన ప్రభువా! సేన దయ్యములు పట్టినవాడు నిన్ను చూచి నమన్కరించిన చర్యనుబట్టి, అతనిలోని దయ్యములసు వెళ్ళగొట్టిన నీకు నమస్కారములు.

జీవమైన తండ్రీ! ఒక అధికారి వచ్చి “నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము. ఆమె బ్రతుకుసు” అనెను. అధికారి నిన్ను కోరిన వెంటనే వెళ్ళి ఆ చిన్న దానిని బ్రతికంచిన దేవా! నీకు ప్రణుతులు.

ఏర్పాటు రక్షకుడవైన ప్రభువా! కనాను స్త్రీ వచ్చి తన కుమార్తె స్వస్థతకొరకు ప్రాధేయపడి అడుగగా, ఆమె కుమార్తెను బాగుచేసిన నీకు వందనములు
పరిశుద్ధుడవైన తండ్రీ! పదిమంది కుమ్దరోగులు “మమ్మును కరుణించుమని” వేడుకొనగా వారి మనవి విని “మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకొనుడని” చెప్పిన నీ మాట ప్రకారము వారు వెళ్ళుచూ దారిలో బాగుపడిరి. ఈ విధముగా స్దలాంతరమువ బాగుచేసిన నీకు స్తోత్రములు.

“ప్రార్ధన చేయునపుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది యున్నారని నమ్ముడి. అప్పుడవి మీకు కలుగునని చెప్పుచున్నాను ” అని సెలవిచ్ఛిన ప్రభువా! మేము ప్రార్థించినవియు, ఆశించినవియు నెరవేరనప్పుడు నెరవేరివవని నమ్మగల గట్టి విశ్వాస పద్దతిని మాకు అలవరచిన నీకు వందనములు.

మా స్జితిని, గతిని ఎరిగిన తంద్రీ! మేమెంత ప్రార్ధించినా నెరవేరనప్పుడు, మా ప్రార్థనాంశము నీ దివ్యచిత్తమునకు సంపూర్థముగా సమర్పించి, నీ సహాయము కొరకు అబ్రాహాము వలె నిరీక్షింపగల కృప దయచేయుదువని నమ్ముచూ నీకు న్తుతులు చెల్లించుచున్నాను.

పరిశుద్ధాత్మవైన తండ్రీ! నీ సంఘమునకు నీ శక్తులను దయచేసి రెండువేల సరివత్సరములనుండి అనేకులను నీ ప్రభావముచే బాగుచేయుచున్న నీకు స్తోత్రములు.

మాకు కలిగిన …………… (జబ్బు పేరు) అను ఈ అస్వస్దతసు మీ పాదములయెుద్ద ఉంచి ప్రార్ధన చేస్తున్నాము. మీ ప్రభాపముచేత ఈ అస్వస్థతను తొలగించి స్వస్ధత దయచేయుమని విశ్వాసముతో వేడుకొనుచున్నాము. ఈ స్తుతులు త్వరగా రానైయున్న యేసుక్రీస్తు నామమున అంగీకరించుము. ఆమేన్!

Share this now. Choose your platform