కనిపెట్టు గంట

(కనిపెట్టు గంట అనగా దేవుని సన్నిధిలో మోకాళ్ళూని కనిపెట్టవలసిన సమయము)

మనమొక అధికారియొద్ధకు వెళ్లి, ‘ఐదు రూపాయలు దయచేయండి’ అని అడిగినయెదల ఆయన ఇచ్చుననిగాని, ఇయ్యడనిగాని తెలియక ముందు వచ్చివేయముగదా! ఆవిధముగానే మనము దేవుని సన్నిధికి వెళ్ళి మనకు కావలసినవి దయచేయుమని ప్రార్థించి,ఆయన మన మనసులో ఏదైన ఒక తలంపు కలిగించువరకు, మోకాళ్లమీదనే : ఉండపలెను గాని ఆమేన్‌ అని పచ్చివేయుట మర్యాదకాదు. “సత్యమనగా ఏమిటని” పిలాతు యేసుక్రీస్తు ప్రభువును ఒక ప్రశ్న అడిగెను.ఆ ప్రశ్నకు ప్రభువు జవాబియ్యకముందే ఆయన ఇంటిలోనికి వెళ్ళిపోయెను. : జడ్జిగారింకను కనిపెట్టుకొనియున్న యెడల, ప్రభువేమి జవాబిచ్చునో అది సువార్తికులు వ్రాసియుందురు. మనము తెలిసికొని యుందుము. అవతలివారు పలుకువరకు మనము పిలుచుచునే యుందుముగదా!కనిపెట్టుకొనియే యుందుముగదా! పలికిన వెంటనే పిలుచుట మానివేయుదుము. పూర్వీకులైన ప్రవక్తలు దేపుని సన్నిధిలో ఎంతోసేపు కనిపెట్టియుందురు! వారట్లు కనిపెట్టబట్టియే గొష్ప గొష్ప ప్రవచన గ్రంథములు వ్రాయగలిగిరి, దేవుని అభిప్రాయములు తెలిపికొనగలిగిరి. తమ అభిప్రాయములలో పొరబాట్లుండునుగదా! కనిపెట్టిన పిమ్మట పార్థించినామను సంతోష్మేగాక, దేవుడు జవాబిచ్ఛినాడను సంతోషముకూడ మనకు కలుగును. ప్రార్ధనలో కనిపెట్టువాడుక సంఘములో సంఘనాయకులు ప్రవేశపెట్టలేదు. ఇది గొప్పలోపము. అక్కడక్కడ కొంతమంది విశ్వాసులకు మాత్రమే ఈ వాడుక గలదు. కాని సంఘమంతటికిలేదు, ఇప్పుడైనను సంఘమంతట ఈ వాడుకను ప్రవేశపెట్టినయెడల సంఘముయెుక్క విశ్వాసమును, ఆనందమును ఎంతో వృద్ధియగును. కనిపెట్టు గంటలో అన్నియు పరిష్కారమగును. నీ కఠిన ప్రశ్నలన్నిటికి జవాబు దొరుకును. ఏదైన ఒక సంగతిమీద ‘దేవునికొరకు కనిపెట్టవలయునను’ విషయము బైబిలులోగలదు. కనిపెట్టుటను గురించి బైబిలులోయున్న వాక్యములు చదివినయెడల ఇది తేలును. మన మనసులోనున్న సంగతి నెరవేరు వరకు కనిపెల్టవలసిన కాలము ఒక గంటమాత్రమే అయ్యుండదుగదా! మరియు అది ఒక అరగంటకూడ అయ్యుండవచ్ఛును గదా!

“ఈ కీడు యెహొవాచేత కలుగుచున్నది. నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టెయుండ్వలెనని” ఒక అవిశ్వాసి పలికినట్లు మనమును పలుకకుందుముగాక! (రాజులు 6:33). ఇదివరకునున్న మతాచారవిధులే మేము నెరవేర్చలేకపోవుచుండగా, మీరీ క్రొత్త ఆచారమొకటి తెచ్చిపెట్టినారు. ఇదెట్లు నెరవేర్ప వీలుండునని ఎదురు చెప్పువారికి మేమేమి చెప్పగలము? చేసి చూడండని మాత్రమే చెప్పగలముగాని వాగ్వాద ప్రశ్నలకెట్లు సమాధానము చెప్పగలము? ఎంత చెప్పినను వంకలు తెచ్చువారు ఉండకపోరు అయినను అవి వినక, ‘కనిపెట్టువేళ నీ నిమిత్తమై కనిపెట్టుకొని యున్నట్లు భావించుకొని, కనిపెట్టు చోటికి వెళ్ళుము. ప్రభువు రాకడ మిగుల సమానమని నమ్నువారు కసిధ్ధపడుటకు కనిపెట్టు సమయమొక గొప్ప సాధనమని మా తాత్ఫర్యము. కనిపెట్టుగంట సర్వమతముల వారికిని, నాస్తికులకును, భక్తులకును, మానపజన్మమెత్తిన ప్రతివారికిని ఉపయోగమే

1. భోధవినుట అనిష్టము: సద్భోధ వినుటకు నీకిష్టము లేకపోవచ్ఛును ఇది ఒక దుర్బుద్ధి. ఇది దుర్బుద్ధి అని తెలినిసను ప్రార్థనలో కనిపెట్టుట మానవద్ధు. దేవుడిచ్చిన రోజులోని 24 గ౦టలలో, ఒక 1 గంటయైనను కనిపెట్టుట యందు గడపలేవా? కనిపెట్జగా కనిపెట్టగా భోధయందు ఇష్టము కలుగును. కనిపెట్టుటవలన వీ బ్రతుకు ఎంత శుభకరముగా వర్దిల్లునో తెలిసికొనగలవు.

2. పాపములు ఒప్పుకొనుట అనిష్టము:- నీది తప్ప అని తెలిసికొనినను, తప్పు ఒప్పుకొనుటకు ఇష్టపడపు. ఇదియెుక దుర్బుద్ధి. ఇ౦త పాపము పెట్టుకొని, తగుదునని ఎట్లు కనిపెట్టు స్థలమునకు వెళ్ళగలనని అనుకొనవద్ధు. వెళ్ళుము, మోకరించుము, కనిపెట్టుము అప్పుడు పాపములు ఒప్పుకొనుటకు నీకిష్టమ కలుగును.

3. పాపములు విసర్ణిరిచుట అనిష్టము : వీపు వదలజాలని పాపమేదోయొకటి నీలోనుండవచ్చును, ఎన్ని పావములైనను విసర్జింవగలవు గాని అది విసర్జించలేవు దానిని విసర్టించుట నీకిష్టమై యుండదు. ఇది నీమీద ఏలుబడిచేయు పాపమైయుండును. అది నిన్ను చిక్కులుపెట్టు పాపము. అయినను ఉదయముననే లేచి, శరీరశుద్ది గావించుకొని, పాసములేనివానివలె దైవసన్నిధిలోనికి పరుగెత్తుము, కనిపెట్టుము. ఆ నీ పాపముమీద అప్పుడు నీకు అసహ్యత కలుగును. నీకది బానిసయగుమ. నీవే దానిని ఏలుబడిచేయుదుపు.

4. పాపమును గెలువలేని బలహీనత : పాపమున్నది. దానిని విసర్జించుట నీకు ఇప్టమే. గెలువవలెనని ఎన్నోమారులు ప్రయత్నించినావు. ఎంతోమందిచేత ప్రార్ధన చేయించుకొన్నావు. అయినను గెలువలేకపోవు చున్నావు. దిగులుపడకుము కనిపెట్టు సమయములో వీపు బాగుపడుదువు. ‘పాపము గెలువలేవి నీకెందుకు ఇక కనిపెట్టుటని’, నిన్నెరిగినవారందురు. అయిననూ, బెదిరిపోవద్ధు: సన్నిధిలోనికి వెళ్ళుము; కనిపెట్టుము, అపుడు కనిపెట్టుఫలమును పొందుదుపు.

5. బైబిలు చదువుట అనిష్టము : ఒకానొక సమయమందు బైబిలు చదువుటకు నీకిష్టము కలుగదు. ఇదియెుక దుర్బుద్ధి. ఇది దుర్భుద్ధియని నీవు నమ్మినను కనిపెట్టుగంట మరచిపోవద్దు వెళ్ళుము, ఒక గంటసేపు దేవుని సన్నిధిలో మోకాళ్ళమీదనే కనిపెట్టుము, తుదకు బైబిలు చదువుటయందు నీకిష్టము కలుగును.

6. ప్రార్ధనచేయుట నీకు అనిష్టము : ప్రార్ధన చేయుటకు ఒకానొకప్పుడు ఏమియు ఇష్టముండదు. బలవంతముగా చేయబోయినను మాటలే రావు. ఇదియెుక బలహీనత. అయినను ఒకగంట కనిపెట్టుట మానవద్ధు. ‘అయ్యో! ప్రార్థనమీద ఇష్టము లేకపోవుచున్నది. ఎట్లు కనిపెట్టగలవని’ అందువేమో! ఫరవాలేదు. వెళ్ళి కనిపెట్టుము అప్పుడు నీకు ప్రార్థనయందు ఇష్టము కలుగును.

7. సువార్త ప్రకటించుట అనిష్టము : నీకు సువార్త తెలుసును. నీ హృదయము సరిగానే యున్నది. ఎందుచేతనోగాని సువార్త ప్రకటించుట నీకిష్టములేదు. ‘వారికె సువార్త ప్రకటించిన, విందురా’ అని అందుపు. ఇదియు దుర్భుద్దియే. సువార్తవలన మేలుపొందిన నీవు ఇతరులు మేలు పొందుటకు ఇష్టపడనియెడల అది దుర్భుద్ధికాక మరేమిబుద్ది? అయినను నీగదిలోనికి వెళ్ళుము. కనిపెట్టుటయను గొప్ప కార్యమును చేయుము. అప్పుడు సువార్త బోధించుటకు నీకిష్టమగును.

8. విశ్వాసములేని స్థితి : ఒకానొకప్పుడు దైవ విషయములయందు ఏమియు విశ్వాసము గలుగదు. ఏ మతమును నిజముకాదని తోచుసు: ‘దేవుడున్నట్టు, మోక్షమున్నట్టు, నరకమున్నట్టు ఎవరు చూచినారు? క్రీస్తు వచ్చినట్టు చూచినవారేరి? అనుచు అవిశ్వాస ప్రశ్నలు మనసులో పుట్టును. ఇట్టి ప్రశ్నలతోనే కనిపెట్టు స్ధలమునకు వేళ్ళుము. సందేహింపకుము. కనిపెట్టుము, కనిపెట్టగా నీ ప్రశ్నలన్నియు అరితరించిపోవును. స్థిర విశ్వాసము కలుగును.

9. నిరాశ: నీ కథలు తెలిసిన ఒక బోధకుడు నీకు దారిలో కనబడి, ‘ఓ దురంతకుడా! దేవుడు నీకు రక్షణ అనుగ్రహించనప్పుడు నీవెక్కడికి వెళ్ళుదువు? నీవు రక్షణను నిర్లక్ష్యపెట్టుచున్నావు. నీకు మారుమనస్ఫు కలుగుట దుర్లభము, అని పలుకును. అప్పుడు వీ ముఖములో కళ తగ్గును. నీ గుండె కొట్టుకొనును. రాత్రులు నీ స్వప్నములలో దయ్యములు కసబడును. చావుపెట్టె కనబడును; నరకము, నరకము అను శబ్దము వినబడును. వెర్రికేకలు వేయుదువు; అంతలో మెళుకువ వచ్చును. ఏమి చేయుదువు? నిరాశపడుదువు గదా? ఆ బోధకుని మాటలను, దుష్టస్వప్నములను మందలింవు క్రింద లెక్కకట్టుకొనుము: వెళ్ళుము, కనిపెట్టు గదిలో ఉండుము విశ్వాసము వచ్ఛువరకు. అప్పుడు నీ మనస్సులో ధైర్యము, సంతోషము కలుగును.

10. విసుగుదల : “నేను ఒకసంగతిని గూర్చి ఎన్నో రోజులనుండి ప్రార్థించుచున్నాను, విశ్వాసముతో అడుగుచున్నాను. నాకు తెలిసినంత మట్టుకు నాలో ఏ అడ్డములేదు. అయినను దేవుడు నా ప్రార్ధన ఆలకించుట లేదు; ఎందుకో తెలియదు. దేవుని వాగ్ధావములు చూడగా నోరూరుచున్నదని” ఈ రీతిగా దేవునిమీద విసుగుకొనుచున్నావుగదా! ఇది ఒక నీరస బుద్ది. కనిపెట్టుచోటునకు వెళ్ళుము. నీ మనసుకు శాంతి కలుగును. దేవుని యెడల నీకు మంచి అభిప్రాయములు పుట్టును.

11. అసూయ: ‘నేనెన్నోమారులు ప్రార్డించగా దేవుడు వినలేదు గాని, వీరు ప్రార్థింగానే విన్నాడు’ అని ఇతరులమమీద అసూయపడుదువు. దేవుడు పక్షపాతియని తలంతువు. ఇవియు దుర్బుద్ధులే. అయినను సన్నిధిలోనికి వెళ్ళుటకు జంకకుము; కనిపెట్టుము. ఈ దుర్గుణములు నివారణయగును.

12. వీలులేనిస్థితి: కనిపెట్టవలెననిన అన్నియు అడ్దములే. మనసు కుదరదు, స్థలము దొరకదు, స్థలము దొరికినను అందరి మాటలు వినబడుచుండును.శ్థలము దొరికిన సమయము దొరకదు: సమయము దొరికిన స్థలము దొరకదు. స్థలము, సమయము దొరికిన, నిద్ర నిద్ర అని అనుకౌందువేమో: విస్తారముగా ఆలోచించకుము. చొరవచేసికొని ఎక్కడో ఒకచోట ఇరుకుకొనుము. కనిపెట్టుము. కనిపెట్టుటయందు నీకిష్టమున్నదని నీ తండ్రికి తెలుసుగదా! నీ ఆశకు విలువగలదు. వీలులేకపోయినను బలవంతముగా వీలు కలుగజేసికొనుము. పనులకు వీలు కలుగజేసుకొనుచున్నావు గదా! కనిపెట్టుటకు వీలు కలిగించుకొనలేవా? ఇట్లు నీవు కనిపెట్టు అలవాటు కలిగియున్నయెడల క్రమేణ చెడుగంతయు ఒత్తిగిలిపోవును. మరిచి నీ జీవితములో ప్రవేశించును; దైవాత్మ నీకు సహాయము చేయును. నా సలహా ప్రకారము
వృధాగా’ గడిపిన సమయమని భావించుకొనవద్ధు. ఒకసారి కనిపెట్టగా నెమ్మది దొరకకపోయినయెడల, మరియెుకసారి కనిపెట్టుము అశ్రద్ధ చేయవద్దు.

13. కృపను లోకువకట్టు స్థితి : కనిపెట్టు గదియెుకటి ఉన్నది గదా! గనుక ఎన్ని పాపములైనను చేసికొనవచ్చును. (అలాగు పాపములు) చేసి కనిపెట్టు గదిలోనికె వెళ్ళినయెడల, పావములన్నియు, పరిహారమగునని అనుకొందువేమో! ఇట్లనుకొనుట దేవుని కృపను లోకువకట్టుతయైయున్నది. ఇది అపాయకరమైన శ్థితి. నేను నీకు సదుపాయము చూపించుచుండగా నీవట్లనుకొనకూడదు. కనిపెట్టు స్థలమునకు వెళ్ళుము; కనిపెట్టుము; మేలు కలుగకమానదు.

14. కనిపెట్టు సమయమున కలుగు భాగ్యము : కనిపెట్టు సమయములో ఒకరికి పాపములొప్పుకొను వాలుకలిగినది. ఒకరికి ప్రార్ధన ధోరణి కలిగినది. ఒకరికి స్తుతిచేయు ప్రవాహము వచ్చినది. ఒకరికి ‘దర్శనవధము లభించినది. ఈ ప్రకారముగా ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగ్యము’ కలిగినది. ఎన్ని భాగ్యములో వివరింపలేము. మేము వ్రాసినది తక్కువైనను ఎక్కువ గ్రహించుకొనవలెను. ఈ పత్రికలో మేము వ్రాసిన బలహీనతలు గలవారు మాత్రమేకాదు, లేనివారును ఈ కనిపెట్టు సమయమును ఉపయోగించుకొనవలెను. కీర్తనలు పాడుకొనుట, ప్రార్ధనలు చేసికొనుట, బైబిలు చదుపుకొనుట అనుపనులు, తర్పూర్వమే అనగా కనిపెట్టుకొనుటకు ముందుగానే ముగించుకొనుట మంచిది. తరువాతకూడ చేసికొనవచ్చును. ఎవరి వీలుకొలది వారు చేసికొనవచ్చుమ. కనిపెట్టు సమయములో దైవసహవాసానుభవము కలుగును. ఏలీయా తన ప్రార్ధన నెరవేరు వరకును, కర్మెలు కొండమీద కనిపెట్టుకొని ప్రార్థన సాగించుచూనే యుండెను. మొదటిమారు, ప్రార్ధనకు నెరవేర్పు కసబడనప్పుడు రెండవమారు ప్రార్థన చేసెను.ఈ ప్రకారముగా ఏడుమార్లు ప్రార్థన చేయుచునే, నెరవేర్పుకొరకు కనిపెట్టెను. తుదకు, నెరవేర్ఫు కలిగెను ( రాజులు 18అధ్యా).

మాడు సంగతులు : 1) కనిపెట్టుగదిలో మనోనిదానము కలిగియుండుము; అనగా చెడు తలంపులు రానీయకుము, మంచి సంగతులుకూడ జ్ఞాపకము చేసికౌనకుము. తండ్రి, కుమార, పరిశుద్దాత్మలు నీ ఎదుట ఉన్నారను ఒక తలంపు మాత్రమే చివరవరకును ఉండవలెను. ఇదే నీవక్కడ చేయవలసిన ,గొప్ప పని. యత్నించుము. 2) ఎన్నో రోజులనుండి కనిపెట్టు గంటను వాడుకొనుచున్నాను. నాకేమియు అనుభవము కలుగలేదని అనుచున్నావు. అట్లు కనిపె ట్టుటయే నీకు కలిగిన మొదటి భాగ్యముకదా! 3) కనిపెట్టుగంట అభ్యాసము గలిగిన వారితో మాటలాడినయెడల కొన్ని సంగతులు నేర్సుకొనగలవు

1. నీకౌరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. (కీర్తన 25:3).

2. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము (కీర్తన 27:14).

3. యెహోవా ఎదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము (కీర్తన 37:7).

4. దేవా! సీయోనులో మౌనముగా నుండుట నీకు న్తుతి చెల్లించుటే (కీర్తన 65:1).

5. నా దేవునికొరకు కనిపెట్టుటచేత నా కన్నులు క్షీణించిపోయెను (కీర్తన 69:౩).

6. ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి. ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి (కీర్తన 1౦6:1౩).

7. యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజులవలె రెక్కలుచాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు (యెషయా 40:౩1).

8. తనకొరకు కనిపెట్టువాని విషయమై, నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేపునిని, ఎవడు నేకాలమున చూచియుండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసియురిడలేదు (యెష. 64:4).

9. ఆయన నాకు ఏమి సెలవిచ్చ్ నో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటక్లై నేను నా కావలి న్దలముమీదను,
గోపురముమాదను, కనిపెట్టుకొని యుందుననుకొనగా యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను ‘చదువువాడు పరుగెత్తుచు చదువవీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము, నీ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగుని, సమాప్తమగుటకై ఆతుర పడుచున్నది, అది తప్పక నెరనేరును. అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును (హెబ్రీ 2:1-3).
10. ఆయన వారిని కలిసికొని ఈలాగు ఆజ్ఞాపించెను ‘మీరు యెరూషలేమునుండి వెళ్ళక, నా వలన వినిన తండ్రియెుక్క వాగ్ధానము కొరకు కనిపెట్టుడి’ (అపో.కార్య. 1:4).
11. యెహోవా, నీ రక్షణకొరకు కనిపెట్టుచున్నాను (ఆదికా. 49:18).
12. ప్రభువా! సైన్యములకధిపతివగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకొనువారికి నావలన సిగ్గు కలుగనియ్యకుము (కీర్తన 69:6).
1౩. యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము. ఆయన మార్గము నసుసరించుము. భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదపు (క్రైస్తవ ౩7:౩4).
14. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయనవలవ నాకు రక్షణ కలుగును (కీర్తన 62:1).
15. నీవు దానిని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దానిని స్మరించి కనిపెట్టుచున్నాను (కీర్తన 52:9).
16. తగినకాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని, ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి (కీర్తన 104:27)
17. దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్టు, మనదేవుడైన యెహోవా మనలను కరుణించువరకు, మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి (కీర్తన 12౩౬2).

18. కీడునకు ప్రతికీడు చేసెదననుకొనవద్ధు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. ఆయన నిన్ను రక్షించును. (సామెతలు 20:22)
19. కావున మీయందు దయజూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడియున్నాడు. యెహోవా న్యాయముతీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు (యెషయా ౩0:18).

20. యాకోబు వంశమునకు తనముఖముసు మరుగుచేసికొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూచుచున్నామ. ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను (యెషయా 8:17).

21. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమిమీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నాకొరకు కనిపెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలిసికొందుపు (యెషయా 49:2౩).

22. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింప గలవారున్నారా? ఆకాశము వాననియ్యగలదా? మా దేవుడవైన యెహోవా! నీవేగదా దాని చేయుచున్నాపు! నీవే ఈ క్రియలన్నియు చేయుచున్నావు;
నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము (యిర్మియా 14:22).

23. నదులు ఆశకలిగి యెహోవా అమగ్రహించు రక్షణకొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది (విలాస ౩:26).
కౌంతే పు దైవధ్యానఘులో ఉండవలసిన షూటింగు పెట్టుకొనుచున్నారు’.

24. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా ‘నాకౌరకు కనిపెట్టుడి. నేను లేచి మొర పెట్టుకొను దినము కొరకు కనిపెట్టి యుండుడి. నా ఉగ్రతను, నా కోపాగ్ని అంతటిని వారిమీద కుమ్మరించుటకై; అన్యజనులను పోగుచేయుటకును, గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని. నా రోషాగ్నిచేత భూమియంతయు కాలిపోవును (జెఫన్యా 3:8).

25. అది విరువబడిన దినమున, నేను చెప్పినది యెహోవా వాక్కు? అని మందలో బలహీనములై, నన్ను కనిపెట్టుకొనియున్న గొర్రెలు తెలిసికొనెను (జెకర్యా 11: 11).

26. యెరూషలేమునందు సుమెయోనను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును, భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతనిమీదఉండెను (లూకా 2:25).

27. తమ ప్రభువు పెండ్లివిందునుండి వచ్చి తట్టగానే, అతనికి తలుపుతీయుటకు అతడెప్పుడు వచ్ఛునో అని అతనికొరకు ఎదురు చూచు మనుష్యులవలె ఉండుడి (లూకా 12:36).

28. మనము చూడనిదానికొరకు నిరీక్షించినయెడల, ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము (రోమా 8:25).

సన్నిధికూట వివరము:

క్రైస్తవులలో కొందరు ప్రతిదినము కొతసేపు దైవధ్యానములో ఉందవలసిన మీటింగు పెట్టుకొనుచున్నారు ఆ మీటింగులోనికి

1) ఒకరోజు క్రీసు ప్రభువు వచ్చి కనబడును చెప్పవలసిన సంగతులు చెప్పును అడుగు ప్రశ్నలకు జవాబు వినిపించును.

2) ఇంకొకనాడు ఆయన దేవదూతలలో ఒకరిని పంపును. ఆ దూత కనబడును. వార్త చెప్పును. అడిగిన ప్రశ్నలకు జవాబు వినిపించుమ.

3) మరియెుకనాడు ఆయన పరలోక భక్తులతో ఒకరిని వంపును. ఆ ఒకరు కనబడుదురు, చెప్పవలసిన సంగతులు చెప్పుదురు. అడిగిన ప్రశ్నలకు జవాబు వినిపింతురు.

4) వేరొకనాడు ఆయన భూలోక విశ్వాసులలో ఒకరి ఆత్మను పంపును. ఆ యాత్మ నరరూపములో కనబడును. సంగతులు చెప్పును. అడిగిన ప్రశ్నలకు జవాబు వినిపించును.

5) ఇంకను మరియెుకనాడు ఆయన పాతాళ లోకములోని మృతులలో ఒకరిని పంపును. ఆ మృతులు మోక్షమునకు వెళ్ళనివారు. ఆ ఒకరు కనబడుదురు, సంగతులు చెప్పెదరు. అడిగిన ప్రశ్నలకు జవాబు వినిపింతురు.

6) తుదకు ఒక భూతమును రానిచ్చును. ఆ భూతము కనబడును, సంగతులు చెప్పును. అడిగిన ప్రశ్నలకు జవాబు వినిపించి వెళ్ళిపోయిన తరువాత క్రీన్తుప్రభువు వచ్చి, ఆ భూతము పలికిన మాటలు నమ్మకుడి, భయపడకుడి అని చెప్పి ఆదరించును.

షరా: నైబిలులోని వాక్యముల అర్థములు క్రీస్తు ప్రభువు చెప్పును. ఇది దైవపూజయై యున్నది. శక్తిపూజకాదు ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామమున కూడుకొందురో, అక్కడ నేనుందునని ప్రభువు చెప్పినమాట మాకు ఆధారము. బైబిలులోని విశ్వాసులకు ఆయన కసబడిన విధముగానే నేడును ప్రభువు విశ్వాసులకు కనబడును, ఒకానొకప్పుడు ఆయన అవిశ్వాసులకుకూడ కనబడి మాటలాడును.

క్రీసుయెుక్కరెండవరాకడ మిక్కిలి సమీపముగా నున్నది. గనుక ఆయన మేఘాసీనుడై వచ్చి, భూమిమీదనున్న భక్తులను ప్రాణముతో తీసుకొని వెళ్ళనైనైయున్న సమయము మిగుల సమీపించినది గనుక సిద్ధపడండి. అందుకే ఈ కూటములు, ఈ పత్రికల ప్రచురణలు.

లోకములోనున్న ఏ మతస్తులైనా సరే, సన్నిధి కూటములు పెట్టుకొనవలెని మా కోరిక. క్రీస్తు పేరు ఎత్తుట ఇష్టము లేనివారూ ‘దేవా! సృష్టికర్తా! మాకు కనబడి మాటలాడుమని’ ప్రార్థింపవచ్ఛును. ఏ మతమునైనను దూషింపరాదు, తెలియని సంగతులు దేవునిని అడిగి తెలుసుకొనవలెను.

స్వస్థిశాల

(1) స్థలము : గుంటూరునకు 8 కి.మీ. దూరమున, మంగళగిరి రోడ్డున కీ శే జె. రాజారావుగారి కాకానితోట (2) కారిముఫౌం ప్రతి సోమవారము ఉ“9గ౦ 11ల నుండి సాయంకాలము 5గ౦ ల వరకు. (3) వారము: ఇక్కడికి ప్రతి సోమవారము నలుగురు బైబిలు మిషను ఫదర్లు వచ్చి; అనారోగ్యవంతులకు క్రీస్తు బోధలు, ప్రార్థనలు, కీర్తనలు నేర్పింతురు, క్రీస్తు ప్రభావమువలన పాపులకు, రోగులకు, బీదలకు, బిడ్డలు లేనివారికి, భూతపీడితులకు, అప్పులు పాలైనవారికి, కోర్టులో వ్యాజ్యములు గలవారికి, తప్పిపోయిన వస్తువులు గలవారికి, పెళ్ళి సమకూడనివారికి, కుటుంబ కలహములు గలవారికి, ఉద్యోగములు లేనివారికి, విషపు పురుగులవల్ల బాధపడువారికి, పశ్వాదులకు మేలు కలుగుచున్నది. కొందరికి వెంటనే, మరికొందరికి ఇంటియొద్ద స్వస్థత కలుగుచున్నది. తమ కోరికలు నెరనేర్చుకొనగోరువారు; పాప కార్యములు ఇతర పూజలు మానివేసి క్రీస్తును మాత్రమే పూజింపవలెసు. బోధ వినిపించుట ఫాదర్ల పని; నమ్ముట వ్రజల పని, బాగుచేయుట క్రీస్తు ప్రభువు వని. క్రీస్తు ఎంత దేవుడైనను మన నిమిత్తమై నరుడుగా జన్మించి, మోక్షమార్గము బోధించి, ఔషధములు లేకుండా తన ప్రభావము వలననే స్వస్ధపరచి, ఆకలిగా నున్నవారికి ఆహారము కల్పించి, ఆపదలోనున్నవారిని విమోచించి, మాదిరికి మృతులలో కొందరిని బ్రతికించి, ఇట్లు అనేకమైన ఉపకారములు చేసెను. అయినను ఆయన దేవుడని గ్రహింపనివారు ఆయనను సిలువకు అంటగొట్టి క్రూరముగా చంపిరి. ఆయన వారిని నాశనము చేయలేదు. ఎందుకనిన, ఆయన లోకమును రక్షించుటకు వచ్చెను. మూడవదినమందు బ్రతికివచ్ఛి, నలుబది దినములు మరికొన్ని ధర్మములు బోధించి, మోక్షలోకమువకు వెళ్ళెను. ఆయన వెళ్ళకముందు తన శిష్యులతో ఇట్లు చెప్పెను: ‘నేను మరలావచ్ఛి మిమ్మును తీసుకొని వెళ్ళుదును. అంతవరకు నా విషయములను లోకములోనున్న వారందరికి బోధించుడి, నమ్మి బాప్తీస్మము పొందువాడు రక్షిరిపబడుమ’.

ప్రియులారా! ఆయన మేఘాసీనుడై వచ్చి, భూమిమీద నున్న భక్తులను ఆకర్షించి మోక్షమునకు తీసుకొని వెళ్ళును. ఆ సమయము మిగుల సమీపించినది. కనుక సిధ్ధపడండీ. ‘ఎన్నో పరోపకారములు చేసిన క్రేస్తు ప్రభువును మీరు నమ్మి ప్రార్ధించినయెడల, మీ కోరికలన్నియు నెరవేరును. ఈ సంగతులన్నియు ఉన్న బైబిలును చదువుకొనండి, మీకు శుభముకలుగును గాక! ఆమేన్

ఆత్మలను పంపవచ్చును. వారు యెంతో మాటలాడుదురు. అవి వ్రాసికొనండి. 7) పిమ్మట ఱయన ఒక భూతమును పంపవచ్ఛును. ఆ భూతము మీతో మాటలాడును. మీ ప్రశ్నలకు జవాబులు చెప్పును అవి వ్రాసికొనండి. అటుపిమ్మ ట ప్రభువువఛ్ఛి భూతముచెప్పిన మాటలు నమ్మకుడి. ఆ మాటలకు బెదరకండి అని చెప్పి ఆదరించును.

షరా: క్రీస్తు ప్రభువు ఏదైనను చూపవచ్చును. మీరు కోరినప్పుడెల్లా సంస్కారపు భోజనము వడ్డీంచును. ఇవి బైబిలుమిషను బోధలు గనుక మీరు దేవునిని అడిగి సత్యాసత్యములు తెలిసికొనండి. ఏ మతస్థులైనను దీనిలోని పధ్ధతులు వాడుకొనవమ్చసు. క్రీస్తు అను మాటకు బదులుగా దేవుని పేరు ఎత్తవచ్చును.

రెండు భావికాల వృత్తాంతములు

1. సంఘము వెళ్ళిపోగానే శేషించినవారికి ఏడేండ్ల శ్రమలు . అవి లోకమెన్నడును ఎరఎగనివి, “అవి తప్పించుకొసుటకు భక్తులతో ఏకిభవించుటకే క్షేమము). ఈ రెండు సంగతులు చాలా కాలమునుండి చెప్పుచున్నారు. ఇంకను జరగలేదని ఆలస్యము జరుగగూడదు.

2. 1) ఢిల్లీలో త్వరలోనే గొప్ప సంతర్పణ జరుగుననియు, బసయును, ట్రైన్ టిక్కెట్లసు ఉచితమే అని గవర్నమెంటువారు చాటించిన : యెడలవ్ఎవరు సిద్ధపడిరు! 2) క్రీస్తు ప్రభువు మేఘాసీనుడై వచ్చి భూమిమీద నున్న భక్తుల సంఘమును ప్రాణముతోనే పైకి తీసికొని వెళ్ళి అక్కడ ఏడేండ్లు గొప్ప సంతర్పణ చేయును. గనుక సిధ్ధపడుడని మేము అనేక మార్లు ఏ చెప్పుచున్నను కొందరు కుశల ప్రశ్నలు వేయుచు అశ్రధ్ధగా నున్నారు. ఆయన వచ్చుటయు సంఘము వెళ్ళుటయు ఒక్కరెష్పపాటులోనే జరుగును. గమక అప్పుడు సిద్దపడుటకు వీలుండదు ఇప్పుడే సిద్ధపడండి.

Share this now. Choose your platform